రెడ్ బ్యాగ్ లో ఏముంది?.. సస్పెన్స్ తో టీజర్ ఇంట్రెస్ట్ పెంచేలా..
సస్పెన్స్ థ్రిల్లర్ కథలంటే సినీ ప్రియుల్లో ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. అలాంటి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న మూవీ ది రెడ్ బ్యాగ్. హరికృష్ణ సోమిశెట్టి నిర్మిస్తున్న ఆ సినిమాకు రవికుమార్ సీరపు దర్శకత్వం వహించారు.
సస్పెన్స్ థ్రిల్లర్ కథలంటే సినీ ప్రియుల్లో ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. అలాంటి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న మూవీ ది రెడ్ బ్యాగ్. హరికృష్ణ సోమిశెట్టి నిర్మిస్తున్న ఆ సినిమాకు రవికుమార్ సీరపు దర్శకత్వం వహించారు. ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై హైప్ క్రియేట్ చేయగా, తాజాగా రిలీజైన టీజర్ క్యూరియాసిటీని పెంచింది. ఏపీ పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ చేతుల మీదుగా టీజర్ విడుదలైంది.
టీజర్ ప్రారంభం నుంచే మిస్టరీ ఎన్విరాన్మెంట్ ను క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. "జీవితంలో పిలవని అతిథులు వస్తుంటారు.. వాళ్లు మన జీవితాన్ని మార్చేస్తారు.. ఆ అతిథి మనిషే కావాల్సిన అవసరం లేదు" అనే వాయిస్ ఓవర్ తో కథపై ఆసక్తిని పెంచారు. సాధారణంగా కనిపించే ఒక రెడ్ బ్యాగ్ చుట్టూ కథ తిరుగుతున్నట్లు టీజర్ ద్వారా క్లియర్ గా తెలుస్తోంది.
నలుగురు యువతుల జీవితాలు ఒక్కసారిగా ప్రమాదంలో పడటం, ఆ పరిస్థితుల కారణంగా ఒక రెడ్ బ్యాగ్ కనిపించడం కథలో మెయిన్ ఎలిమెంట్ గా కనిపిస్తోంది. ఆ బ్యాగ్ లో ఏముంది? దాని కోసం ఎవరు వెతుకుతున్నారు? యువతులకు దానితో ఉన్న సంబంధం ఏమిటి? అనే ప్రశ్నలకు టీజర్ సమాధానం చెప్పకపోయినా ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించేలా రూపొందించారు.
టీజర్ లో గ్లామర్ తో పాటు యాక్షన్, థ్రిల్ కు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చారు. కథలోని పాత్రలు సాధారణ పరిస్థితుల నుంచి ప్రాణాపాయ స్థితికి చేరినట్లు చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా వెంటాడే సీన్స్, వైలెన్స్ ఘటనలు, ఉత్కంఠభరితమైన కట్స్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. చివర్లో నటి రాశి కనిపించిన తీరు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎలాంటి డైలాగ్ లేకుండానే ఆమె ఎక్స్ప్రెషన్ తో మిస్టరీని మరింత పెంచే ప్రయత్నం చేశారు.
కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మౌనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి తదితరులు తమ పాత్రలకు తగ్గట్టుగా కనిపించారు. టీజర్ లో అందరి పాత్రలకు ప్రాధాన్యం ఉన్నట్లు అనిపిస్తోంది. ముఖ్యంగా ఉమెన్ రోల్స్ చుట్టూనే కథ ఎక్కువగా తిరిగే అవకాశం కనిపిస్తోంది. సాంకేతికంగా కూడా టీజర్ మంచి రేంజ్ లో కనిపించింది. ప్రియేష్ గురుస్వామి అందించిన సినిమాటోగ్రఫీ విజువల్స్‌ను మరింత ఆకర్షణీయంగా నిలబెట్టింది.
ముఖ్యంగా నైట్ ఎఫెక్ట్ లో తీసిన షాట్లు సినిమాకు కావాల్సిన మిస్టరీ ఫీల్ ను తీసుకొచ్చాయి. శేఖర్ మోపురి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ కు మెయిన్ అసెంట్ గా నిలిచింది. ప్రతి సీన్ లో ఉత్కంఠను పెంచేలా మ్యూజిక్ ను ఉపయోగించారు. శివ శర్వాణి ఎడిటింగ్ కూడా స్పీడ్ గా సాగుతూ టీజర్ ను ఆసక్తికరంగా మార్చింది. ఏదేమైనా ది రెడ్ బ్యాగ్ టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించడంలో సక్సెస్ అయింది. ఒక సాధారణ రెడ్ బ్యాగ్ చుట్టూ నడిచే మిస్టరీ వెనుక అసలు కథ ఏమిటన్న ప్రశ్న ప్రేక్షకుల ముందుంచింది. సస్పెన్స్, థ్రిల్, యాక్షన్ ఎలిమెంట్స్ తో రూపొందించిన ఆ చిత్రం విడుదలకు ముందే మంచి బజ్ ను సంపాదించింది.