ఫాదర్స్ డే స్పెషల్ విషెస్.. బన్నీ వెనుక 'అల్లు' మాస్టర్ మైండ్!

స్టార్ హీరోలకు అభిమానులు కనిపిస్తారు.. విజయాలు కనిపిస్తాయి.. కానీ ఆ విజయాల వెనుక ఉన్న వ్యక్తులు మాత్రం చాలా అరుదుగా హాట్ టాపిక్ గా మారుతుంటారు.

Update: 2026-06-21 14:39 GMT

స్టార్ హీరోలకు అభిమానులు కనిపిస్తారు.. విజయాలు కనిపిస్తాయి.. కానీ ఆ విజయాల వెనుక ఉన్న వ్యక్తులు మాత్రం చాలా అరుదుగా హాట్ టాపిక్ గా మారుతుంటారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫాదర్స్ డే సందర్భంగా చేసిన ఓ ఎమోషనల్ పోస్ట్.. ఆయన కెరీర్ వెనుక బ్యాక్ బోన్ గా నిలిచిన వ్యక్తిని మరోసారి అందరికీ గుర్తు చేసింది. ఆ వ్యక్తి మరెవరో కాదు.. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్.

ఫాదర్స్ డే సందర్భంగా అల్లు అర్జున్ సోషల్ మీడియాలో తన తండ్రిపై ఉన్న ప్రేమను హృదయానికి హత్తుకునేలా వ్యక్తం చేశారు. "నాకు మా నాన్నే దేవుడు. నేను చూడగలిగే, వినగలిగే, మాట్లాడగలిగే, తాకగలిగే ఏకైక దేవుడు మా నాన్ననే" అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చారు. తన జీవితంలో అన్నీ ఇచ్చింది తండ్రేనని పేర్కొంటూ ప్రపంచంలోని తండ్రులందరికీ ఫాదర్స్ డే విషెస్ తెలిపారు.

ఆ పోస్టుతో పాటు అల్లు అరవింద్‌ తో దిగిన ప్రత్యేక ఫోటో కూడా అభిమానులతో పంచుకున్నారు. దీంతో ఇప్పుడు అభిమానులు తండ్రీకొడుకుల రిలేషన్ ను ప్రశంసిస్తుండగా.. మరోవైపు అల్లు అర్జున్ విజయాల వెనుక అల్లు అరవింద్ పాత్రపై కూడా చర్చ మొదలైంది. ఎందుకంటే బన్నీని ఒక నార్మల్ హీరో రేంజ్ నుంచి పాన్ ఇండియా స్టార్‌ గా తీర్చిదిద్దిన జర్నీలో అల్లు అరవింద్ ఆలోచనలు, ప్లాన్లు కీలక పాత్ర పోషించాయని అంతా చెబుతుంటారు.

2003లో గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమైన అల్లు అర్జున్, నేడు పాన్ ఇండియా రేంజ్ లో భారీ మార్కెట్ ఉన్న స్టార్‌ హీరోగా ఎదిగారు. ఆ జర్నీలో స్టోరీల సెలక్షన్, మార్కెట్ రేంజ్, ప్రేక్షకుల అభిరుచికి తగ్గ ప్లాన్స్ వంటి అనేక అంశాల్లో అల్లు అరవింద్ ప్లాన్ కనిపించిందనే అభిప్రాయం ఉంది. ముఖ్యంగా అల్లు అర్జున్‌ కు స్పెషల్ క్రేజ్ తీసుకురావడంలో అల్లు అరవింద్ కీలక పాత్ర పోషించారని అంతా భావిస్తుంటారు.

ఇతర హీరోలతో పోలిస్తే భిన్నమైన ఇమేజ్‌ ను క్రియేట్ చేయడం, కొత్త మార్కెట్లను లక్ష్యంగా పెట్టుకోవడం వంటి అంశాల్లో ఆయన స్ట్రాటజీలు పనిచేశాయని అంటున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. అయినప్పటికీ తన విజయాల వెనుక ఉన్న తండ్రిని ప్రత్యేకంగా గుర్తు చేసుకోవడం అభిమానులను ఆకట్టుకుంది.

ఫాదర్స్ డే రోజు చేసిన పోస్ట్ కేవలం విషెస్ మెసేజ్ మాత్రమే కాకుండా.. ప్రతి సక్సెస్ ఫుల్ పర్సన్ వెనుక ఒక ఫ్యామిలీ, ఒక ఫాదర్ ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుందనే విషయాన్ని గుర్తు చేసింది. అందుకే బన్నీ ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారడమే కాకుండా.. "అల్లు అర్జున్ వెనుక అసలైన మాస్టర్ మైండ్ అల్లు అరవిందే" అనే చర్చకు కూడా కారణమైంది. ఫాదర్స్ డే రోజు తండ్రికి బన్నీ ఇచ్చిన గౌరవం అభిమానుల హృదయాలను గెలుచుకుంటోంది.



Tags:    

Similar News