డాక్టర్ గా నటిస్తున్న శృతి హాసన్

Update: 2020-07-28 04:30 GMT
కొన్ని సంద‌ర్భాలు వెరీ రేర్ అనే చెప్పాలి. అలాంటివి మ‌ళ్లీ మ‌ళ్లీ రిపీట్ కావు ఏ ఆర్టిస్టు విష‌యంలో అయినా. పాప్ సామ్రాజ్య‌పు రారాజు అయిన మైఖేల్ జాక్స‌న్ అంత‌టివాడు జీవితంలో ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నాడు. అనారోగ్యంతో డిప్రెష‌న్ ని ఫేస్ చేశాడు. సాటి న‌టుల అసూయ‌.. ఆస్తి గొడ‌వ‌లు అప్పుల వేద‌న‌లు అనుభ‌వించాడు. డిప్రెష‌న్ కి స‌రిప‌డ‌ని మందులు ఎక్కించి అత‌డి శ‌రీరాన్ని విష‌పూరితం చేయ‌డం వ‌ల్ల‌నే మ‌ర‌ణించాడని క‌థ‌నా‌లు వ‌చ్చాయి.

చార్లీ చాప్లిన్ అంత‌టి గొప్ప హాస్య‌న‌ట చ‌క్ర‌వ‌ర్తికే జీవితంలో క‌ష్టాలు త‌ప్ప‌లేదు. దాంతో పాటే డిప్రెష‌న్ ని ఎదుర్కోక త‌ప్పని స్థితి. కానీ ఏనాడూ త‌మ డిప్రెష‌న్ ని బ‌య‌ట పెట్ట‌క కెరీర్ ప‌రంగా రాణించేందుకు చేసిన సాహ‌సాలు ఎంద‌రికో స్ఫూర్తి నింపుతాయి. క‌న్నీళ్ల మాటునే ఎదుటివారికి న‌వ్వులు పంచే ప్ర‌య‌త్నం చేశారు చాప్లిన్.

ఇప్పుడు అలాంటి స‌న్నివేశ‌మే శ్రుతి హాస‌న్ ఎదుర్కొంటోందా? ల‌వ్ లైఫ్ ఫెయిలై వ‌్య‌క్తిగ‌త జీవితంలో తుఫాన్ నే ఎదుర్కొని చాలాకాలం పాటు డిప్రెష‌న్ లోకి వెళ్లిన శ్రుతి తిరిగి కంబ్యాక్ అయ్యేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నం ఇటీవ‌ల హాట్ టాపిక్ అయ్యింది. ప్రేమించిన మైఖేల్ కోర్స‌లే నుంచి బ్రేక‌ప్ అవ్వ‌డాన్ని డైజెస్ట్ చేసుకోలేక డిప్రెష‌న్ లోకి వెళ్లాన‌ని శ్రుతి ఇంత‌కుముందు మీడియా ఇంట‌రాక్ష‌న్ లో చెప్పింది. కానీ ఏ బాధ‌ను అయినా మ‌రిపించేది కాలం మాత్ర‌మే. వృత్తిలో లీనం అయితే మ‌ర‌పు సాధ్య‌మే.

అందుకే ఇటీవ‌ల వ‌రుస‌గా సినిమాల‌కు సంత‌కాలు చేస్తోంది. ఇక్క‌డో ఆస‌క్తిక‌ర‌మైన ట్విస్టేమిటంటే లైఫ్ లో ఎంతో డిప్రెష‌న్ ఫేస్ చేసిన శ్రుతి తాజా చిత్రంలో డాక్ట‌ర్ గా న‌టిస్తుండ‌డ‌మే అస‌లు ట్విస్టు. ర‌వితేజ స‌ర‌స‌న `క్రాక్` లో శృతి ప్లే చేస్తున్న రోల్ ఇదే..! అలానే తొలి సరిగా తల్లి పాత్రలో కూడా శృతి కనిపించ‌నుంద‌ట‌. రవి తేజతో శృతి చేస్తున్న రెండో సినిమా ఇది. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన  `బలుపు` మీడియం రేంజ్ హిట్ అయిన‌ సంగతి తెల్సిందే.
Tags:    

Similar News