శాతకర్ణిలో అత్తాకోడళ్ల లుక్స్ అదిరాయ్

Update: 2016-09-01 04:53 GMT
నందమూరి బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణిని టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటిగా ప్రత్యేకించి చెప్పుకోవాలి. దర్శకుడు క్రిష్ మ్యారేజ్ సందర్భంగా దాదాపు నెల రోజులు బ్రేక్ తీసుకున్న యూనిట్.. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ ను రీస్టార్ట్ చేశారు. ఇప్పటివరకూ కేవలం బాలయ్యపైనే సన్నివేశాలు.. యుద్ధాల చిత్రీకరణ జరగగా.. ఇప్పుడు ఫ్యామిలీ.. రాజకోటకు సంబంధించిన ఎపిసోడ్స్ ను పిక్చరైజ్ చేస్తున్నారు.

మధ్యప్రదేశ్ లోని నిజమైన కోటల్లో శాతకర్ణి షూటింగ్ జరుగుతోంది. బాలకృష్ణకు తల్లిగా నటిస్తున్న హేమమాలిని.. భార్యగా యాక్ట్ చేస్తున్న శ్రియా శరణ్ లు కూడా మూవీ యూనిట్ తో జత కలిశారు. ఇప్పుడా షూటింగ్ కి సంబంధించిన అప్ డేట్స్ కొన్ని బయటకొచ్చాయి. పసి పిల్లాడిని ఎత్తుకున్న శ్రియ.. పక్కనే గంభీరంగా కనిపిస్తున్న హేమమాలిని... రాజు గెటప్ లో బాలకృష్ణ కనిపిస్తున్నారు. అయితే.. అత్తాకోడళ్ల లుక్స్ విషయంలో డైరక్టర్ తీసుకున్న జాగ్రత్తల గురించి ఎన్ని చెప్పుకున్నా తక్కువే అనాలి.

ఇక బ్యాక్ గ్రౌండ్ లో కనిపిస్తున్న కోట విజువల్స్ కూడా కొత్తగా ఉన్నాయి. బాహుబలి లాంటి సినిమాలో గ్రాఫిక్ కోటలను చూసేసినా.. నిజమైన కోటలు వాటి సౌందర్యాలకు ఏ గ్రాఫిక్స్ సాటి రాలేవు కదా. ఆ ఒరిజినాలిటీ గౌతమిపుత్ర శాతకర్ణిలో కనిపిస్తోంది.
Tags:    

Similar News