‘శాతకర్ణి’లో ఆ స్టార్ నటిస్తున్నాడా?

Update: 2016-10-24 07:30 GMT
‘గౌతమీపుత్ర శాతకర్ణి’ విషయంలో ఏ కోశానా రాజీ పడుతున్నట్లు లేడు క్రిష్. ఈ సినిమాకు ఏకంగా రూ.70 కోట్ల బడ్జెట్ వేసుకుని రంగంలోకి దిగిన క్రిష్.. అన్ని విషయాల్లోనూ భారీతనం చూపిస్తున్నాడు. మొరాకో.. జార్జియా లాంటి దేశాలకు వెళ్లి అద్భుతమైన లొకేషన్లలో షూటింగ్ చేసుకుని వచ్చాడు. ఇక్కడ కూడా భారీ సెట్టింగ్స్ వేయించాడు.

మరోవైపు నటీనటులు.. టెక్నీషియన్ల విషయంలోనూ భారీతనం ఉండేలా చూసుకుంటున్నాడు. కబీర్ బేడి లాంటి ఇంటర్నేషనల్ యాక్టర్ తో పాటు బాలీవుడ్ ఎవర్ గ్రీన్ బ్యూటీ హేమమాలినిని బాలయ్య తల్లి పాత్రకు తీసుకున్నాడు. దీంతో నార్త్ ఇండియన్ ప్రేక్షకులకు కూడా ‘శాతకర్ణి’ అప్పీలింగ్ గా అనిపించే అవకాశముంది. మరోవైపు ఈ చిత్రాన్ని కన్నడ ప్రేక్షకులు కూడా అక్కున చేర్చుకునేలా చేయడానికి ఓ వ్యూహం పన్నాడు క్రిష్. ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ను ఓ కీలక పాత్రలో చూపించబోతున్నట్లు సమాచారం.

బాలయ్యకు శివరాజ్ కుమార్ తో మంచి అనుబంధం ఉంది. ఈ మధ్యే శివరాజ్ సినిమా ‘శివలింగ’ 100 రోజుల వేడుకకు కూడా బాలయ్య హాజరయ్యాడు. బాలయ్య కూడా చెప్పడంతో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో కీలక పాత్ర చేయడానికి శివరాజ్ ఒప్పుకున్నట్లు సమాచారం. అదే నిజమైతే ఈ చిత్రం కన్నడ నాట కూడా దుమ్ముదులిపే అవకాశముంది. షూటింగ్ చివరి దశలో ఉన్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News