గుండెల్లో గుబులు రేపుతున్న జిలేబి భంగిమ!
గుండెల్లో గుబులు రేపుతున్న ఈ జిలేబి బ్యూటీ ఎవరు? నవ్వులతో గిల్లేస్తోంది.. భంగిమలతో కాల్చేస్తోంది. కొంటెతనం కలబోసిన టెంప్టింగ్ క్వీన్ లా కనిపిస్తోంది. ఇంతకీ ఎవరీ అమ్మడు? అంటే.. పేరు శివలీక ఒబేరాయ్.
బాలీవుడ్ లో అప్ కమింగ్ నటి. ఇప్పుడిప్పుడే వరుసగా క్రేజీ చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది. ఇక ఈ బ్యూటీ ఇన్ స్టా ట్రీట్ యువతరంలో నిరంతరం చిచ్చు పెడుతూనే ఉంది. తాజాగా ఈత దుస్తులలో సమ్మోహన భంగిమతో కట్టి పడేసింది ఈ బ్యూటీ.
శివలీకా ఒబెరాయ్ హిందీ చిత్ర పరిశ్రమలో వేగంగా పాపులరవుతున్న అప్ కం నటి. 2019 లో విడుదలైన రొమాంటిక్ థ్రిల్లర్ `యే సాలీ ఆషికి`తో హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. ఉత్తమ తొలి చిత్ర నటిగా ఫిలింఫేర్ నామినేషన్ పొందింది. ఈ రొమాంటిక్ డ్రామాకు చెరాగ్ రూపారెల్ దర్శకత్వం వహించారు. జయంతిలాల్ గడా - అమ్రిష్ పూరి ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో ఆమె అమ్రిష్ పూరి మనవడు వర్ధన్ పూరి తో కలిసి నాయికగా నటించింది.
శివలీకా ఒబెరాయ్ సోషల్ మీడియా ల్లో చురుకైన వినియోగదారు .. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఈత దుస్తులలో కనిపిస్తున్న ఫోటోని షేర్ చేయగా వైరల్ గా మారింది. ``జలాలు లోతుగా ఉన్నాయి.. వేగంగా నడుస్తాయి`` అంటూ టెంప్టింగ్ క్యాప్షన్ ని ఈ ఫోటోకి ఇచ్చింది. తాజా ఫోటోషూట్ లో నీలిరంగు ఈత దుస్తుల్లో బబ్లీ బ్యూటీ ఎంతో హాట్ గా కనిపిస్తోంది. శివలీకా ఒబెరాయ్ వన్నెచిన్నెలు యూత్ కి మతి చెడగొడుతున్నాయనే చెప్పాలి. ఇక ఈ బ్యూటీ తరచుగా తన టోన్డ్ బాడీని ఎలివేట్ చేసే ఫోటోషూట్లను షేర్ చేస్తుంటే అవి వైరల్ గా మారుతున్నాయి.
నటనలోకి ప్రవేశించే ముందు శివలీకా ఒబెరాయ్ కిక్ - హౌస్ ఫుల్ 3 కోసం నాడియాద్వాలా గ్రాండ్సన్ ఎంటర్ టైన్మెంట్ ప్రొడక్షన్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఆ తరువాత శివలీకా తన తొలి చిత్రం కోసం ఆడిషన్ ప్రారంభించింది. ప్రకటనలు మోడలింగ్ లోనూ రాణించింది. ఈ బోల్డ్ బ్యూటీ చివరిసారిగా 2020 లో విడుదలైన హిందీ చిత్రం ఖుదా హాఫిజ్ లో కనిపించింది. అసిస్టెంట్ డైరెక్టర్ టర్న్ డ్ హీరోయిన్ గా ఈ అమ్మడు టెక్నికాలిటీస్ పైనా పూర్తి అవగాహనను కలిగి ఉంది. అందుకే ఈ భామకు అవకాశాలు కూడా సులువుగా వస్తున్నాయిట.
ఇక ఇన్ స్టా వేదికగా ఓ రేంజులో చెలరేగుతున్న హాటెస్ట్ శివ్ లీక ఒబేరాయ్ తదుపరి దక్షిణాదినా నాయికగా రాణించాలని కలలుగంటోందిట. తెలుగు సినీపరిశ్రమలో దర్శకనిర్మాతలు అవకాశం ఇస్తే ఇక్కడా తనదైన హవా సాగించాలని భావిస్తోంది. నేచురల్ స్మైల్.. బోల్డ్ లుక్ తో గుబులు రేపుతున్న ఈ బ్యూటీకి పూరి-కొరటాల వంటి టాప్ డైరెక్టర్స్ అవకాశాలిచ్చి ఎంకరేజ్ చేస్తారేమో చూడాలి. ఇటీవల దక్షిణాదిన ఐటెమ్ నంబర్లతోనూ ఉత్తరాది భామలు బోలెడంత మ్యాజిక్ చేస్తున్నారు. ఈ కేటగిరీలో అయినా శివ్ లీక అవకాశాలు అందుకుంటుందేమో చూడాలి.
క్రేజీ సీక్వెల్లో శివ్ లీక:
విద్యుత్ జమ్వాల్ తన 2020 చిత్రం `ఖుదా హాఫీజ్` సీక్వెల్ కోసం పనిని ప్రారంభించాడు. ఖుదాహాఫిజ్ చాప్టర్- II # ఆర్మీవెటరన్ అనే శీర్షికతో పాటు విద్యుత్ చిత్రాన్ని పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలో అతని సహనటి శివలీకా ఒబెరాయ్ - దర్శకుడు ఫరూక్ కబీర్ కూడా ఉన్నారు. ఖుదా హాఫీజ్ గత సంవత్సరం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలైంది. ఇది పూర్తిగా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్.. సమీర్ చౌదరి (విద్యుత్) మధ్యప్రాచ్యానికి వచ్చిన తరువాత మాంసం వ్యాపారంలో చిక్కుకున్న అతని భార్య నర్గిస్ (శివలీకా) ను రక్షించాలనే అతని లక్ష్యం చుట్టూ కథాంశం రన్ అవుతుంది. ఉజ్బెకిస్తాన్ లో చిత్రీకరించిన ఈ చిత్రంలో అన్నూ కపూర్- అహానా కుమ్రా- శివ్ పండిట్- విపిన్ శర్మ- నవాబ్ షా కూడా నటించారు.