'కట్టాలన్' టీజర్.. ఒక్కసారిగా హైప్ ఎక్కించిందిగా!
మాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ కట్టాలన్ (Kattalan) టీజర్ ను మేకర్స్ రీసెంట్ గా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.;
మాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ కట్టాలన్ (Kattalan) టీజర్ ను మేకర్స్ రీసెంట్ గా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. మలయాళ నటుడు ఆంటోని వర్గీస్ హీరోగా నటిస్తుండగా, దుషారా విజయన్ హీరోయిన్ గా కనిపించనున్నారు. డెబ్యూ డైరెక్టర్ పాల్ జార్జ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ చిత్రాన్ని క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై షరీఫ్ మహమ్మద్ నిర్మిస్తున్నారు.
బ్లాక్ బస్టర్ మార్కో సినిమాను నిర్మించిన క్యూబ్స్ సంస్థ.. ఈసారి అంతకుమించిన స్థాయిలో యాక్షన్ థ్రిల్లర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై భారీ బజ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు పవర్ ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో రూపొందిన టీజర్ సినిమాపై అంచనాలను పెంచింది. టీజర్ లో హై వోల్టేజ్ యాక్షన్, రగ్డ్ విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ముఖ్యంగా ఆంటోనీ వర్గీస్ క్యారెక్టర్ ను చాలా పవర్ ఫుల్ గా డిజైన్ చేసినట్లు టీజర్ ద్వారా క్లియర్ గా తెలుస్తోంది. అయితే టీజర్ పోస్టర్ లో ఆంటోని వర్గీస్ చనిపోయిన ఏనుగుపై నిలబడి, రక్తం కారుతున్న గొడ్డలిని చేతిలో పట్టుకుని కనిపించడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ సీన్ సినిమాకు కీలకంగా మారనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పుడు టీజర్ చూసిన అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.
టీజర్ కట్ అదిరిపోయిందని చెబుతున్నారు. మూవీపై ఒక్కసారిగా హైప్ పెంచేసిందని అంటున్నారు. సినిమా ఆకట్టుకునేలా ఉందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో కట్టాలన్ మూవీ మలయాళ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ రిలీజ్ గా నిలవనుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. మే 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. అంతేకాదు ఇప్పటికే భారీ ఓవర్సీస్ డీల్స్ దక్కించుకుని కొత్త రికార్డులను సృష్టించింది.
ఇక సినిమాలో సునీల్, కబీర్ దుహాన్ సింగ్, రాజ్ తిరందాసు, జగదీష్, సిద్ధిక్, రాపర్ బేబీ జీన్, పార్థ్ తివిరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ నటుడు సునీల్ పాత్రపై మంచి అంచనాలు ఉన్నాయి. యాక్షన్ సన్నివేశాలను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో రూపొందించేందుకు థాయ్ లాండ్ లో షూటింగ్ నిర్వహించారు. వరల్డ్ ఫేమస్ యాక్షన్ డైరెక్టర్ కేచా ఖంఫక్డీ నేతృత్వంలో తెరకెక్కించారు.
ఒంగ్- బాక్ సిరీస్ లో నటించిన పాంగ్ అనే ఏనుగును సినిమాలో ఉపయోగించడం విశేషం. కాంతార సహ పలు సినిమాలతో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే కట్టాలన్ మూవీ తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. మరి ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.