ప్లాప్ ల్లో డ‌బుల్ హ్యాట్రిక్ స్టార్ !

బాలీవుడ్ లో అక్ష‌య్ కుమార్...టాలీవుడ్ లో రవితేజ కెరీర్ గ్రాప్ ఒకేలా ఉంద‌న్న‌ది వాస్త‌వం.;

Update: 2026-03-08 07:36 GMT

బాలీవుడ్ లో అక్ష‌య్ కుమార్...టాలీవుడ్ లో రవితేజ కెరీర్ గ్రాప్ ఒకేలా ఉంద‌న్న‌ది వాస్త‌వం. హిందీ న‌టుల్లో వ‌రుస ప్లాప్ ల‌తో అక్ష‌య్ కుమార్ రికార్డు సృష్టిస్తే టాలీవుడ్ లో ర‌వితేజ పేరిట అలాంటి రికార్డులు న‌మోదవుతున్నాయి. ఇటీవలే రిలీజ్ అయిన `భ‌ర్త మ‌హ‌శ‌యుల‌కు విజ్ఞ‌ప్తి` ప్లాప్ తో ర‌వితేజ కెరీర్ లో ప్లాప్ ల్లో డ‌బుల్ హ్యాట్రిక్ న‌మోదైంది. ఓ సారి ఆ వివ‌రాల్లోకి వెళ్తే `ధ‌మాకా` త‌ర్వాత ర‌వితేజ న‌టించిన అన్ని సినిమాలు ప్లాప్ అయ్యాయి. `రావణాసుర‌`, `టైర్ గ‌నాగేశ్వ‌ర‌రావు`, `ఈగ‌ల్`, ` మిస్ట‌ర్ బ‌చ్చ‌న్`, `మాస్ జాత‌ర‌` ఇలా వ‌రుస‌గా ఐదు సినిమాలు ప‌రాజ‌యం చెందాయి.

అయినా ర‌వితేజ ఎక్క‌డా న‌మ్మ‌కాన్ని కోల్పోలేదు. రెట్టించిన ఉత్సాహంతోనే ముందుకు సాగాడు. ఈ క్ర‌మంలో కిషోర్ తిరుమ‌ల‌తో క‌లిసి ఫ్యామిలీ రూట్లోకి వ‌చ్చాడు. వాళ్లిద్ద‌రి కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన `భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి` సంక్రాంతి కానుక‌గా రిలీజ్ అయింది. కిషోర్ స‌క్సెస్ ట్రాక్ చూసి ఈ సినిమా భారీ విజ‌యం సాధిస్తుంద నుకున్నారంతా. ర‌వితేజ కూడా సినిమాపై చాలా కాన్పిడెంట్ గా క‌నిపించాడు. కానీ వారు ఒక‌టి త‌లిస్తే ఫ‌లితం మ‌రోలా వ‌చ్చింది. ఈసినిమా కూడా అంచ‌నాలు అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది. దీంతో ప్లాప్ ల్లో ర‌వితేజ‌ పేరిట డ‌బుల్ హ్యాట్రిక్ న‌మోదైంది.

మూడు ద‌శాబ్దాల‌ ర‌వితేజ కెరీర్ ఇలా అరు ప‌రాజ‌యాలు ఎక్క‌డా చోటు చేసుకోలేదు. ఈ నాలుగేళ్ల కాలంలోనే ఇలాంటి ప్ర‌తికూల ప‌రిస్థితిని ఎదుర్కున్నారు. `రాజా ది గ్రేట్` త‌ర్వాత వ‌రుస‌గా నాలుగు ప్లాప్ లు ప‌డ్డాయి. `ట‌చ్ చేసి చూడు`, `నేల టికెట్`, `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ`, `డిస్కోరాజా` ప్లాప్ అయ్యాయి. అనంత‌రం `క్రాక్` విజ‌యంతో ప‌ట్టాలెక్కాడు అనుకున్న స‌మ‌యంలోనే వెంట‌నే `ఖిలాడీ` తో మ‌రో ప్లాప్ ఎదురైంది. ఆ ప‌రాజయాన్ని త‌ర్వాత చిత్రం `రామారావు ఆన్ డ్యూటీ`తో కంటున్యూ చేసాడు. స‌రిగ్గా అదే స‌మ‌యంలో మ‌ళ్లీ `ధ‌మాకా`తో హిట్ అందుకున్నాడు.

అనంత‌రం మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టించిన `వాల్తేరు వీర‌య్య‌లో కీల‌క పాత్ర‌కు ఎంపిక‌య్యాడు. ఆ సినిమా మంచి విజ‌యం సాధించ‌డంతో? అన్న‌య్య‌-త‌మ్ముడు కాంబినేషన్ బాగా వ‌ర్కౌట్ అయింద‌ని అభిమానులు సంతోషించారు. కానీ ర‌వితేజ సోలో స‌క్స‌స్ కి మాత్రం వంద‌ల కిలోమీట‌ర్ల దూరంలోనే ఉన్నాడు. ప్ర‌స్తుతం ర‌వితేజ కొత్త సినిమాకు స‌న్నాహాలు చేస్తున్నాడు. `మ‌జిలీ` ఫేం శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నాడు. ఈసినిమాకు సంబంధించిన అప్ డేట్ అతి త్వ‌ర‌లోనే రానుంది. వ‌రుస ప్లాప్ ల నేప‌థ్యంలో ర‌వితేజ కూడా విశ్లేషించుకునే ప‌నిలో ప‌డ్డాడు.

Tags:    

Similar News