ఇంటీమేట్ సీన్స్, ఆక్వర్డ్ అనుభవాలు! అంటే

సినిమాలు .. వెబ్ సిరీస్‌లలో శృంగార లేదా ఏకాంత సన్నివేశాలను చిత్రీకరించడం అనేది దర్శకులకు, నటీనటులకు ఎంతో సున్నితమైన సవాలుతో కూడుకున్న వ్యవహారం.

Update: 2026-09-23 01:30 GMT

సినిమాలు .. వెబ్ సిరీస్‌లలో శృంగార లేదా ఏకాంత సన్నివేశాలను చిత్రీకరించడం అనేది దర్శకులకు, నటీనటులకు ఎంతో సున్నితమైన సవాలుతో కూడుకున్న వ్యవహారం. ఈ నేథ్యంలో తాజాగా బాలీవుడ్ దర్శకుడు విశాల్ భరద్వాజ్ ఓ ఇంటర్వ్యూలో ఇలాంటి స‌న్నివేశాల‌ చిత్రీకరణపై ఆసక్తికర విషయాలను వెల్లడించారు. నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుద‌ల‌వుతున్న `లస్ట్ స్టోరీస్ 3` ఆంథాలజీలో భాగానికి దర్శకత్వం వహించిన విశాల్ సినిమాల్లో ఇంటిమసీ డైరెక్టర్ల ప్రాముఖ్యతను ప్రత్యేకంగా కొనియాడారు.

సెట్లలో ఇంటిమసీ డైరెక్టర్లు ఉండటం వల్ల దర్శకులకు ఎంతో స్వేచ్ఛ లభిస్తుందని.. నటీనటులు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యవంతంగా నటించగలరని విశాల్ భరద్వాజ్ తెలిపారు. గతంలో ఇలాంటి నిపుణులు లేని సమయంలో ఇంటిమేట్ సీన్స్ తీయడం ఎంతో ఇబ్బందికరంగా ఉండేదన్నారు. ప్ర‌స్తుతం ఇంటిమసీ డైరెక్టర్ల రాకతో షూటింగ్ వాతావరణం ఎంతో సులభంగా, వృత్తిపరంగా మారిందని పేర్కొన్నారు.

ఈ సంద‌ర్భంగా గతంలో జరిగిన ఓ ఇబ్బందికరమైన సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఒకప్పుడు నటి తన వద్దకు వచ్చి సర్ ఈ సీన్‌లో మేమిద్దరం నాలుక ఉపయోగించాల్సి ఉంటుందా? ఒకసారి ఆ మేల్ యాక్టర్‌ని అడిగి చెప్పగలరా? అని అడిగారు. ఆ ప్రశ్నను నేను ఆ నటుడిని అడగాల్సి రావడం ఎంతో ఇబ్బందిగా అనిపిం చిందన్నారు. అప్పట్లో ఇలాంటి సన్నివేశాల పట్ల స్పష్టత లేకపోవడం వల్ల ఇరుపక్షాల మధ్య క్లారిటీ నెలకొనేదని వివరించారు.

అయితే `లస్ట్ స్టోరీస్ 3` చిత్రీకరణ సమయంలో అలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని తెలిపారు. నిజజీవితంలో భార్యాభర్తలైన సిద్ధార్థ్, అదితి రావు హైదరీలతో పని చేయడం వల్ల 50 శాతం ఇబ్బంది అక్కడే తొలగిపోయిందన్నారు. వాళ్లిద్దరి మధ్య ఉన్న అనుబంధం , అవగాహన వల్ల షూటింగ్ ప్రక్రియ హాయిగా సాగిపో యిందని విశాల్ తెలిపారు.

ఈ సన్నివేశాల కోసం మొదట బాడీ డబుల్స్ (డూప్స్)ను సిద్ధం చేసినా? అదితి , సిద్ధార్థ్‌లు స్వయంగా నటించేందుకే మొగ్గు చూపారు. ఒక సీన్‌లో బాడీ డబుల్ కాలును కెమెరాలో చూసిన అదితి `నా కాళ్లు అంత లావుగా ఉండవు` అని సరదాగా అని ఆ షాట్‌లో తానే స్వయంగా నటించింది. ఆమెతో పాటు సిద్ధార్థ్ కూడా డూప్‌ను వద్దని చెప్పి ఆ సన్నివేశంలో స్వయంగా నటించడానికి ముందుకొచ్చార‌ని వెల్లడించారు.

నెట్‌ఫ్లిక్స్ ఆంథాలజీ సిరీస్‌లో మూడో భాగంగా వస్తున్న `లస్ట్ స్టోరీస్ 3`లో విక్రమాదిత్య మోత్వానే, కిరణ్ రావు, శకున్ బాత్రా , విశాల్ భరద్వాజ్ నాలుగు వేర్వేరు కథలకు దర్శకత్వం వహించారు. ప్రేమ, సంబంధాలు, కోరికలు , సాన్నిహిత్యం వంటి విభిన్న కోణాలను ఆవిష్కరించే సిరీస్‌లో సిద్ధార్థ్, అదితిలతో పాటు రాధికా ఆప్టే, కొంకణా సేన్ శర్మ, విజయ్ వర్మ, అలీ ఫజల్, రాధికా మదన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Tags:    

Similar News