వార‌సులిద్ద‌రు మ‌రో ఐదేళ్లు అసిస్టెంట్ గానేనా?

మాస్ మ‌హారాజా ర‌వితేజ వార‌సుడు మ‌హాధ‌న్ భూప‌తి రాజు గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు.;

Update: 2026-03-08 07:35 GMT

మాస్ మ‌హారాజా ర‌వితేజ వార‌సుడు మ‌హాధ‌న్ భూప‌తి రాజు గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. న‌టుడిగా తండ్రి వార‌స‌త్వాన్ని కొన‌సాగించ‌డానికి రెడీ అవుతున్నాడు. అయితే అంత‌కు ముందే ఇండ‌స్ట్రీని అర్దం చేసుకోవ‌డానికి అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా కెరీర్ ప్రారంభించాడు. డైరెక్ష‌న్ డిపార్ట్ మెంట్ లో ప‌నిచేస్తే ఇండ‌స్ట్రీ ఎలా ఉంటుంది? అన్న‌ది అర్దం చేసుకోవ‌డానికి ఉప‌యోగప‌డుతుంది. రవితేజ కూడా అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప్రారంభ‌మ‌య్యే హీరో అయ్యాడు. త‌న‌యుడిని కూడా అలాగే వెండి తెర‌కు ప‌రిచ‌యం చేయాల‌ని భావించి అసిస్టెంట్ గా ప్రారంభించాడు.

సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న`విశ్వ‌నాధ్ అండ్ స‌న్స్` కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తవ్వ‌డంతో స‌మ‌యం వృద్దా కాకుండా న్యూ ఏజ్ మేక‌ర్ సందీప్ రెడ్డి వంగా ద‌గ్గ‌ర కూడా `స్పిరిట్` సినిమాకు అసిస్టెంట్ గా చేరాడు. సందీప్ వ‌ద్ద ప‌ని చేస్తే చాలా విష‌యాలు తెలుస్తాయి. న‌టుడిగా స‌క్సెస్ అవ్వ‌క‌పోతే ద‌ర్శ‌కుడిగా తెరంగేట్రం చేయాల‌నుకుంటే అదే అనుభ‌వం ప‌నికొస్తుంది. అలాగే స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ త‌న‌యుడు రిషీ మ‌నోజ్ కూడా అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే.

ఇతడిని త్రివిక్ర‌మ్ హీరోని చేయాల‌నుకున్నాడు. కానీ రిషీ మ‌నోజ్ డాడ్ లా డైరెక్ట‌ర్ అవ్వాల‌నుకుంటున్నాడు. అత‌డి ఫ్యాష‌న్ ని గుర్తించిన త్రివిక్ర‌మ్ తొలుత గౌత‌మ్ తిన్న‌నూరి వ‌ద్ద అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా పెట్టాడు. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా గౌత‌మ్ తెర‌కెక్కించిన `కింగ్ డ‌మ్` సినిమాకు రిషీ అసిస్టెంట్ గా ప‌ని చేసాడు. ప్ర‌స్తుతం ద‌ర్శ‌క సంచ‌ల‌నం సందీప్ రెడ్డి వంగ వ‌ద్ద `స్పిరిట్` సినిమాకు ప‌ని చేస్తున్నాడు. అలా మ‌హాధ‌న్ , రిషీ మ‌నోజ్ లు ఇండ‌స్ట్రీకి అసిస్టెంట్ డైరెక్ట‌ర్ల‌గా లాంచ్ అయ్యారు. మ‌రి ఇలా ఇంకెంత కాలం ప‌ని చేస్తారంటే? మ‌రో ఐదేళ్ల పాటు డెరెక్ష‌న్ డిపార్ట్ మెంట్ లోనే ప‌ని చేయాల‌నుకుంటున్నారుట‌.

ద‌ర్శ‌క‌త్వం స‌హా అన్ని శాఖ‌ల‌పై ఈ ఐదేళ్ల‌లో ప‌ట్టు సంపాదించాల‌ని సీరియ‌స్ గా ఉన్నారుట‌. ప్ర‌త్యేకించి రిషీ మ‌నోజ్ క‌సితో ప‌ని చేస్తున్న‌ట్లు తెలిసింది. మ‌నోజ్ డాడ్ సినిమాల‌కు కూడా అసిస్టెంట్ గా ప‌నిచేసే అవ‌కాశం ఉంది. మేకింగ్ విష‌యంలో ఒక్కొక్క‌రిది ఒక్కో ప్ర‌త్యేక‌త‌. సందీప్ రెడ్డి న్యూ ఏజ్ మేక‌ర్ గా మంచి పేరు సంపాదిచాడు. ఈ నేప‌థ్యంలో త‌న‌యులిద్ద‌ర్ని తండ్రులు అత‌డి వ‌ద్ద పెట్టారు. ఓ సంద‌ర్భంలో రామ్ గోపాల్ వ‌ర్మ సైతం కొత్త కుర్రాళ్లు ఎవ‌రైనా డైరెక్ష‌న్ ఆస‌క్తి ఉంటే? సందీప్ వ‌ద్ద మాత్ర‌మే అసిస్టెంట్ గా ప‌నిచేయాల‌ని..ఇంకెవ‌రి ద‌గ్గ‌ర ప‌నిచేయోద్ద‌ని స‌ల‌హా కూడా ఇచ్చారు.

Tags:    

Similar News