లివింగ్ టుగెదర్ పై మానస వారణాసి అభిప్రాయం.. యువత ఏమంటున్నారంటే?

ఈ మధ్యకాలంలో "లివింగ్ టుగెదర్" పై యువతలో పెరిగిపోతున్న ఆసక్తి గురించి తాజాగా 'కపుల్ ఫ్రెండ్లీ' హీరోయిన్ మానస వారణాసి ఊహించని కామెంట్లు చేసి అందరినీ ఆలోచింపజేసింది.;

Update: 2026-03-08 07:34 GMT

ఈ మధ్యకాలంలో "లివింగ్ టుగెదర్" పై యువతలో పెరిగిపోతున్న ఆసక్తి గురించి తాజాగా 'కపుల్ ఫ్రెండ్లీ' హీరోయిన్ మానస వారణాసి ఊహించని కామెంట్లు చేసి అందరినీ ఆలోచింపజేసింది. మరి లివింగ్ రిలేషన్ పై మానస తన అభిప్రాయాన్ని ఏ విధంగా పంచుకుంది? ఆమె అభిప్రాయం ఏమిటి? దీనిపై ఫాన్స్ ఏమంటున్నారు? అనే విషయం ఇప్పుడు చూద్దాం..

లివింగ్ రిలేషన్ పై మానస అభిప్రాయం..

మానస వారణాసి.. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14 2026న తన రెండో చిత్రం 'కపుల్ ఫ్రెండ్లీ' తో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మానస వారణాసి లివింగ్ టుగెదర్ అంశంపై తన అభిప్రాయాన్ని పంచుకుంది. మానస మాట్లాడుతూ.." ఏ బంధంలోనైనా సరే అవగాహన అనేది చాలా ముఖ్యం. ఒకరినొకరు పూర్తిగా తెలుసుకోవడానికి లివింగ్ రిలేషన్ చాలా ఉపయోగపడుతుంది.. ఒకప్పుడు పెళ్లయ్యాక మాత్రమే ఒకరి గురించి ఒకరు తెలుసుకునేవారు. దానివల్ల ఎన్నో విషయాలలో కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చేది. కానీ జనరేషన్ మారిపోయింది. పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. అందుకే ఇప్పుడున్న కాలానికి తగ్గట్టుగా ఈ లివింగ్ రిలేషన్ వల్ల ముందే ఒకరి గురించి మరొకరి అర్థం చేసుకునే అవకాశం లభిస్తోంది. అప్పటి వారిలా సర్దుకుపోయే తత్వం ఇప్పటివారిలో లేదు కాబట్టే లివింగ్ రిలేషన్ అనేది పెళ్లికి ముందు చాలా ముఖ్యమైనది. ఒకవేళ ఇద్దరి అభిప్రాయాలు కలిస్తే పెళ్లి చేసుకోవడం మరింత ఉత్తమం" అంటూ తన అభిప్రాయంగా చెప్పుకొచ్చింది.

మానస కామెంట్స్.. నెట్టింట చర్చ..

ఇకపోతే మానస వారణాసి లివింగ్ రిలేషన్ పై చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట చర్చకు దారితీస్తున్నాయి. కొంతమంది యువత ఆమె ఆలోచన ధోరణిని సమర్ధిస్తున్నారు. వివాహం అనేది మూడు ముళ్ళు.. ఏడడుగులు.. రెండు మనసుల కలయిక మాత్రమే కాదు.జీవితాంతం ఒకరినొకరు అర్థం చేసుకొని జీవించాల్సిన అంశం. అందుకే పెళ్లి అయిన తర్వాత విడిపోవడం కంటే పెళ్లికి ముందే కలిసి ఉండి.. ఒకరినొకరు అర్థం చేసుకొని పెళ్లి బంధంలోకి అడుగుపెట్టడం మంచిది. ఒకవేళ అలా ఉండలేము అనిపిస్తే పెళ్లికి ముందే విడిపోవడం కూడా ఉత్తమమే అంటూ మానస వారణాసి చెప్పిన కామెంట్లు కరెక్ట్ అంటూ ఆమెకు మద్దతు పలుకుతున్నారు. మరి కొంతమంది మాత్రం పెళ్లికి ముందే కలిసి ఉండడం ఏంటి అంటూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా మానస వారణాసి చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు నెట్టింట చర్చకు దారితీస్తున్నాయి.

మానస వారణాసి సినిమా జీవితం..

తెలంగాణకు చెందిన మానస వారణాసి మోడల్ గా కెరియర్ మొదలుపెట్టి.. ఫెమినా మిస్ ఇండియా 2020 అందాల పోటీల్లో పాల్గొని.. విజేతగా కిరీటాన్ని ధరించింది. 2021 లో జరిగిన మిస్ వరల్డ్ పోటీలలో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించి.. పదవ స్థానంలో నిలిచిన ఈమె.. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తొలిసారి 'దేవకీ నందన వాసుదేవ' అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె.. కపుల్ ఫ్రెండ్లీ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది . సంతోష్ శోభన్ తో కలిసి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. మళ్లీ ఇదే జంట వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Tags:    

Similar News