నాగార్జున‌-బాల‌య్య‌ల‌ను అనీల్ క‌న్విన్స్ చేయ‌గ‌ల‌డా?

అనీల్ రావిపూడి ఎంత పెద్ద స్టార్ ని అయినా మెప్పించ‌గ‌ల‌డు. త‌న‌లో ఉన్న స‌బ్జెక్ట్ తో పాటు ఎదుట వారిని ఆకర్షించే విధానం, స‌రదా గుణం వంటి ల‌క్ష‌ణాల‌తో ఇదంతా సాద్య‌మ‌వుతుంది.;

Update: 2026-01-18 10:30 GMT

అనీల్ రావిపూడి ఎంత పెద్ద స్టార్ ని అయినా మెప్పించ‌గ‌ల‌డు. త‌న‌లో ఉన్న స‌బ్జెక్ట్ తో పాటు ఎదుట వారిని ఆకర్షించే విధానం, స‌రదా గుణం వంటి ల‌క్ష‌ణాల‌తో ఇదంతా సాద్య‌మ‌వుతుంది. ట్యాలెంట్ తో పాటు జోవియ‌ల్ గా ఉండ‌టం అనీల్ కి అడ్వాటెంజ్ గా చెప్పొచ్చు. త‌న సినిమాలో న‌టించే ఏ హీరోయిన్ తోనైనా అంతే చ‌నువుగా, స్నేహంగా మెలుగుతాడు. సినిమా ప్ర‌చారానికి దూరంగా ఉండే న‌య‌న‌తార‌ను సైతం ప్ర‌చారంలో భాగం చేయ‌డంతో అత‌డెంత ఫేమ‌స్ అయ్యాడో చెప్పాల్సిన ప‌నిలేదు. న‌య‌న‌తారను అనీల్ క‌న్విన్స్ చేసిన విధానం చూసి సాక్షాత్తు చిరంజీవి షాక్ అయ్యారు.

ఎలా ఒప్పించావో ఆ కిటుకు ఏంటో మాకు చెప్ప‌వ‌య్యా? అంటూ చ‌మ‌త్క‌రించారు. విక్ట‌రీ వెంక‌టేష్ కూడా అనీల్ తో అంతే స‌ర‌దాగా ఉంటారు. ఎప్పుడూ సీరియ‌స్ గా ఉండే బాల‌య్య సైతం అనీల్ ని చూసే స‌రికి కూల్ అయిపోతారు. ఆ సంగ‌తి ప‌క్క‌న బెడితే అనీల్ త‌దుప‌రి సినిమాపై చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. అందులో హీరో ఛాన్స్ ఎవ‌రు అందుకుంటారు? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. అలాగే అనీల్ భవిష్య‌త్ లో చిరంజీవి-వెంక‌టేష్ ల‌తో ఓ భారీ మ‌ల్టీ స్టార‌ర్ కూడా చేసే అవ‌కాశం ఉంది. క‌థ సిద్దంగా లేదు కానీ ఉంటే ఇప్ప‌టికిప్పుడే ఆ ప్రాజెక్ట్ మొద‌ల‌య్యేది. కానీ ఈ కాంబినేష‌న్ మాత్రం మిస్ కాదు.

అందుకు పెద్ద‌గా స‌మయం కూడా ప‌ట్ట‌దు. ఏడాది రెండేళ్ల త‌ర్వాతైనా క‌చ్చితంగా ఆ కాంబోలో సినిమా ఉంటుంది. అనీల్ కి ఈ కాంబినేష‌న్ డీల్ చేయ‌డం పెద్ద విష‌యం కాదు. కానీ భ‌విష్య‌త్ లో అనీల్ ఇండ‌స్ట్రీలో సీనియ‌ర్ హీరో లైనా చిరంజీవి, వెంక‌టేష్‌, నాగార్జున‌, బాల‌య్య‌ల‌ను ఒకే తాటిపైకి తీసుకొచ్చి సినిమా చేసే అవ‌కాశాలు కూడా ఎక్కువ‌గానే ఉన్నాయి. ఈ కాంబినేష‌న్ లో సినిమా చేయ‌డం అన్న‌ది మారుతి డ్రీమ్. కానీ అత‌డికి అవ‌కాశాలు చాలా తక్కువ‌. మారుతీ ఆ కాంబినేష‌న్ క‌ల‌పాలంటే అత‌డు వ‌రుస‌గా ఐదారు బ్లాక్ బ‌స్ట‌ర్లు అయినా తీసి ఉండాలి.

మారుతిని ఆ న‌లుగురు సీనియ‌ర్లు న‌మ్మాలి. అప్పుడే సాద్య‌మ‌వుతుంది. కానీ అనీల్ కి మాత్రం ఆ న‌లుగుల‌ర్నీ డీల్ చేయ‌డం అన్న‌ది న‌ల్లేరు మీద న‌డ‌క‌లాంటింది. ఇప్ప‌టికే చిరంజీవి, వెంక‌టేష్, బాల‌య్య‌ల‌తో ఒక్కో సినిమా చేసి హిట్ అందుకున్నారు. వెంకీ-చిరంజీవిల‌తో ఇప్ప‌టికే క‌లిసి ప‌నిచేసారు. త్వ‌ర‌లోనే నాగ‌ర్జున‌తో కూడా ప‌నిచేస్తారు. మీ న‌లుగుర్ని క‌లిపి సినిమా చేస్తానంటే వైనాట్ అంటూ ఆ న‌లుగురు ముందుకొస్తారు. కానీ చిక్కు ఎక్క‌డ అంటే? నాగార్జున‌, బాల‌య్య‌ల‌ను ఒప్పించ‌డ‌మే అనీల్ ముదున్న బిగ్ ఛాలెంజ్ అవుతుంది. వాళ్లిద్ద‌రిని ఒకేతాటిపైకి తీసుకురావ‌డం అంత సుల‌భం కాదు.

ఇంత వ‌ర‌కూ నాగ్-బాల‌య్య లు ఒకే వేదిక‌ను ఏ నాడు పంచుకోలేదు. వారిద్ద‌రు అవార్డు పంక్ష‌న్ల‌ల‌లో క‌నిపించ‌డం కూడా చాలా రేర్ గా ఉంటుంది. వాళ్లిద్ద‌రి మ‌ధ్య కొన్ని పొర పొచ్చాలున్నాయి. అవి ఏంటి? అన్న‌ది ఇప్ప‌టికీ మిస్ట‌రీనే. బాల‌య్య ఇండ‌స్ట్రీలో ఉన్న హీరోల అంద‌రి గురించి మాట్లాడుతారు. కానీ నాగ్ గురించి ఏ రోజు మాట్లాడింది లేదు. అలాగే నాగార్జున కూడా ఏ నాడు బాల‌య్య గురించి మాట్లాడింది లేదు. అలా ఇద్ద‌రి మ‌ధ్య గ్యాప్ ఉంది. ఇదంతా ఇండ‌స్ట్రీ స‌హా ప్రేక్ష‌కుల‌కు తెలిసిందే. మ‌రి అనీల్ ఆ న‌లుగురితో సినిమా తీయాలంటే ముందుగా బాల‌య్య‌, నాగ్ ల‌ను క‌న్విన్స్ చేయాల్సి ఉంటుంది. ఇది అత‌డితో సాధ్య‌మేనా? అంటే! అదంత సుల‌భ‌మైంది కాదు. హీరోయిన్ల‌ను ఒప్పించినంత ఈజీగా నాగ్, బాల‌య్య‌ల‌ను క‌న్విన్స్ చేయ‌డం సాధ్య‌మ‌వ్వ‌డానికి అవ‌కాశాలు త‌క్కువ‌. కానీ అనీల్ వాళ్లిద్ద‌ర్ని ఒకేతాటిపై తీసుకు రాగ‌లిగితే గ‌నుక ఇండ‌స్ట్రీలో అనీల్ పేరు ద‌ర్శ‌కుడిగా ప్ర‌త్యేకంగా లిఖించ‌బ‌డుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు.

Tags:    

Similar News