• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఎట్టకేలకు సాలిడ్ హిట్టు...

ఎట్టకేలకు సాలిడ్ హిట్టు కొట్టిన శర్వా..!

By - Tupaki Desk
Update: 2022-09-10 04:22 GMT
వర్సటైల్ హీరో శర్వానంద్ కెరీర్ ప్రారంభం నుంచీ విభిన్నమైన కథలు విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే గత కొంతకాలంగా శర్వా గడ్డుకాలం ఎదుర్కొన్నాడు.

శర్వానంద్ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం అందుకోలేకపోయాయి. అప్పుడెప్పుడో 'మహానుభావుడు' సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న యువ హీరో.. మళ్లీ ఆ రేంజ్ హిట్టు అందుకోలేకపోయారు. ఎలాంటి సినిమా చేసినా.. డిఫరెంట్ జోనర్ ట్రై చేసినా.. ఎంత కష్టపడినా నిరాశే ఎదురైంది.

ఇటీవల కాలంలో శర్వా నటించిన 'పడి పడి లేచే మనసు' 'రణరంగం' 'జాను' 'శ్రీకారం' 'మహాసముద్రం' 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' వంటి ఆరు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. దీంతో శర్వానంద్ మార్కెట్ డౌన్ అయిందని.. పైకి లేవడం కష్టమే అనే కామెంట్స్ వినిపించాయి. ఇలాంటి పరిస్థితుల్లో 'ఒకే ఒక జీవితం' సినిమా మీదనే ఆశలన్నీ పెట్టుకున్నాడు.

శర్వానంద్ హీరోగా నటించిన ల్యాండ్ మార్క్ 30వ చిత్రం ''ఒకే ఒక జీవితం''. తెలుగు తమిళ భాషల్లో శ్రీ కార్తిక్ అనే కొత్త డైరెక్టర్ ఈ సినిమాని తెరకెక్కించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. పాండమిక్ నేపథ్యంలో ఆలస్యమవుతూ వచ్చిన ఈ మూవీ.. శుక్రవారం (సెప్టెంబర్ 9) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు తొలి రోజే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రమోషనల్ కంటెంట్ తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా.. అదే విధంగా థియేటర్లలోనూ అలరిస్తోంది. ఇది శర్వానంద్ కెరీర్ లోనే గుర్తుండిపోయే సినిమా అనే కామెంట్స్ వస్తున్నాయి.

'ఒకే ఒక జీవితం' సినిమాలో శర్వా నటనకు విమర్శకుల ప్రశంసలతో పాటుగా అన్ని వర్గాల ప్రేక్షకుల మన్ననలు దక్కుతున్నాయి. సెంటిమెంట్ ప్రధానంగా సాగే సన్నివేశాల్లో తనలో ఎంత గొప్ప నటుడు ఉన్నాడో శర్వా మరోసారి చాటి చెప్పాడు. తెలుగుతో పాటుగా తమిళ్ లోనూ ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది.

ఫస్ట్ డే ఈ సినిమాకు చాలా మంచి మౌత్ టాక్ రావడంతో రెండో రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ఆశాజనకంగా ఉన్నాయి. ట్రెండ్ చూస్తుంటే ఫస్ట్ వీకెండ్ లో డీసెంట్ కలెక్షన్స్ గ్యారంటీ అని అర్థమవుతుంది. గత కొన్నాళ్లుగా సరైన హిట్ కోసం తీవ్రంగా కష్టపడుతున్న శర్వానంద్.. ఎట్టకేలకు మంచి విజయాన్ని సాధించాడు. ఇది హీరోతో పాటుగా ఫ్యాన్స్ కు కూడా ఉపశమనం కలిగించే విషయమని చెప్పాలి.

'ఒకే ఒక జీవితం' హిట్ అవ్వడంతో శర్వా రెట్టింపు ఉత్సాహంతో తదుపరి సినిమా చేయనున్నారు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో శర్వా కొత్త సినిమా ప్రారంభోత్సవం ఇటీవలే హైదరాబాద్‌ లో జరిగింది. పొలిటికల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్‌ గా నటిస్తుండగా.. ప్రియమణి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • TollywoodFilms 
  • Sharwanand 
  • MahanubavuduFilm 
  • JaanuFilm 
  • MahaSamudramFilm 
  • OkeOkaJeevithamFilm 
  • SriKarthik 
  • RituVarma 

Similar News

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

Copyright @2026

Powered by Blink CMS