వరస ఫ్లాపుల దెబ్బ.. ఇకపై ఆ పని చెయ్యడట!

Update: 2020-03-04 12:00 GMT
ఎలాంటి హీరోకైనా తన కెరీర్లో ఎత్తుపల్లాలు సహజం. మెగాస్టార్ చిరంజీవి.. సూపర్ స్టార్ రజనీకాంత్ లాంటివారికే ఇలాంటివి తప్పవు.. ఇక యువ హీరోల సంగతి చెప్పేదేముంటుంది? ప్రస్తుతం శర్వానంద్ తన కెరీర్లో ఇలాంటి గడ్డుపరిస్థితినే ఎదుర్కొంటున్నాడు. వరస ఫ్లాపులతో శర్వా మార్కెట్ కూడా దెబ్బతినేలా ఉంది. 'పడి పడి లేచే మనసు'.. 'రణరంగం'.. 'జాను' సినిమాలతో శర్వాకు ఒకదానిని మించి మరొకటి ఫ్లాపు తగిలింది. దీంతో శర్వా తన కెరీర్ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాడట.

ఈమధ్య శర్వా చేసిన సినిమాలు ప్రధానంగా ఆ దర్శక నిర్మాతలతో ఉన్న స్నేహం కారణంగా చేయాల్సి వచ్చిందని.. స్క్రిప్ట్ పై కొన్ని అనుమానాలు ఉన్నప్పటికీ అవి పెద్దగా పట్టించుకోకుండా ముందుకెళ్లానని.. అదే పొరపాటు అయిందని భావిస్తున్నాడట. ఇకపై అలాంటి పొరపాటు చేయకూడదని గట్టిగా ఫిక్స్ అయ్యాడట. అంతే కాకుండా కథల విషయంలో జడ్జిమెంట్ తనే స్వయంగా తీసుకోవాలని ఇతరుల సలహాలు తీసుకోకూడదని కూడా డిసైడ్ అయ్యాడట.

శర్వా ప్రస్తుతం 'శ్రీకారం' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇదో ఫ్యామిలీ డ్రామా అని సమాచారం. అందుకే ఈ సినిమా తర్వాత ఓ ఫుల్ లెంగ్త్ కామెడీ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. 'శ్రీకారం' రిలీజ్ తర్వాత బ్రేక్ తీసుకుని రిలాక్స్ అవ్వాలని.. ఆ తర్వాతే కొత్త సినిమా పై నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నాడట. కామెడీ కంటెంట్ ఉండే స్క్రిప్టులకే ప్రస్తుతం శర్వా ప్రాధాన్యతనిస్తున్నాడని అంటున్నారు.
Tags:    

Similar News