అక్కడ నిలబడతావా శర్వా??

Update: 2017-01-24 00:13 GMT
ఇప్పుడు శర్వానంద్ కూడా ''శతమానం భవతి'' సినిమాతో 25 కోట్ల షేర్ క్లబ్బులోకి చేరిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆల్రెడీ చెప్పేసుకున్నాం. అయితే అందరి హీరోలనూ అడిగినట్లే.. ఇప్పుడు మనోడ్ని కూడా అడగాల్సిన ప్రశ్న ఏంటంటే.. పెద్ద రేంజ్ స్టార్ హీరోలకూ చిన్న రేంజ్ హీరోలకు ఉన్న ఆ డిఫరెన్స్ గురించే. పదండి అదేంటో చూద్దాం.

ఇప్పుడు ఒక మహేష్‌ బాబు అండ్ రామ్ చరణ్‌ ఉన్నారనుకోండి.. ఫ్లాప్ అన్నాకూడా వారి సినిమాలకు 40 కోట్ల వరకు షేర్ వసూలు అయ్యే ఛాన్సుంది. దానితో పంపిణీదారులు చాలావరకు సేవ్ అవుతారు. కాకపోతే చిన్న హీరోల విషయంలో అలా జరగట్లేదు. భలే భలే మగాడివోయ్ సినిమాతో 25 కోట్ల క్లబ్బులో నాని చేరిపోయాడు అనుకుంటే.. తరువాత ఆ ఫీట్ ను ఇంతవరకు మనోడు మళ్ళీ ఎచీవ్ చేయలేకపోయాడు. కృష్ణగాడి వీర ప్రేమగాధ ఫుల్ రన్ లో 13+ కోట్లు వసూలు చేస్తే.. జంటిల్మన్ సినిమా 17+ కోట్లు వసూలు చేసిందంతే. అలాగే నేను శైలజ్ సినిమాతో 20 కోట్ల క్లబ్బులోకి ఎంటర్ అయిన రామ్.. హైపర్ తో మళ్ళీ డింకీలు కొట్టేశాడు. ఇక 36+ కోట్ల మనం తరువాత చైతన్య మొన్ననే 22+ కోట్ల ప్రేమమ్ ను అందుకున్నాడు. అలాంటి ఇలాంటి ఫీట్లను కుర్ర హీరోలు కన్సిస్టెంట్ గా చేయలేకపోతున్నారనేగా ఈ గణాంకాలు చెబుతోంది. అందుకే ఇప్పుడు శర్వానంద్ తన తదుపరి సినిమాలను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి.

పర్ఫెక్ట్ కంటెంట్ తో పాటు కత్తిలాంటి ప్రమోషన్స్.. అలాగే మాంచి రిలీజ్ టైమ్ కూడా వర్కవుట్ అయితేనే.. ఒకటే ఫీట్ ను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడానికి సాధ్యపడుతుంది. మరి శర్వానంద్ ఆ దశలో స్టెప్పులు కరక్టుగానే వేస్తాడని అనుకుందాం. అలా చేస్తేనే ఆ పొజిషన్లో నిలబడటం కుదురుతుంది.
Tags:    

Similar News