NBK-సూర్య త‌ర్వాత చ‌ర‌ణ్‌తో జాక్‌పాట్!

`యానిమ‌ల్` చిత్రం ఎంద‌రికో లైఫ్‌ని ఇచ్చింది. ముఖ్యంగా ట్ర‌బుల్స్ లో ఉన్న డియోల్ హీరో బాబికి గ్రేట్ కంబ్యాక్ ఇది.

Update: 2024-04-29 14:30 GMT

`యానిమ‌ల్` చిత్రం ఎంద‌రికో లైఫ్‌ని ఇచ్చింది. ముఖ్యంగా ట్ర‌బుల్స్ లో ఉన్న డియోల్ హీరో బాబికి గ్రేట్ కంబ్యాక్ ఇది. ఈ చిత్రంలో అబ్రార్ అనే ముస్లిమ్ యువ‌కుడిగా, క్రూరుడిగా అత‌డి న‌ట‌న‌కు గొప్ప పేరు, గుర్తింపు ద‌క్కాయి. డియోల్ బోయ్ ఈజ్ బ్యాక్! అంటూ అంతా స్వాగ‌తించారు. ఓవ‌ర్ నైట్ అత‌డి ఫేట్ మార్చిన ఘ‌నుడిగా తెలుగు ప్ర‌తిభావంతుడు సందీప్ రెడ్డి వంగాకు మంచి పేరొచ్చింది.

ఒకే ఒక్క బ్లాక్ బ‌స్ట‌ర్ పెర్ఫామెన్స్ త‌ర్వాత అత‌డికి సౌత్ లో వ‌రుస‌గా అవ‌కాశాలు క్యూ క‌ట్టాయి. తొలిగా సూర్య క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న కంగువ లాంటి భారీ పాన్ ఇండియా చిత్రంలో విల‌న్ పాత్ర‌లో అవ‌కాశం ద‌క్కింది. కంగువ‌లో బాబి డియోల్ లుక్ కి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. ఆ త‌ర్వాత అత‌డికి నేరుగా నంద‌మూరి హీరో బాల‌కృష్ణ నుంచి కాల్ వెళ్లింది. నంద‌మూరి - డియోల్ స్టార్ల‌ కాంబినేష‌న్ లో ఇప్పుడు బాబి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్బీకే 109 సెట్స్ పై ఉంది.

ఇంత‌లోనే ఇప్పుడు బాబీకి మ‌రో మెగా జాక్ పాట్ త‌గిలింది. ఆర్.ఆర్.ఆర్ తో పాన్ ఇండియా స్టార్ గా ఆవిర్భ‌వించిన మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ సినిమాలో అత‌డు అవ‌కాశం ద‌క్కించుకున్నాడ‌ని తెలిసింది. బుచ్చిబాబు స‌న ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ క‌థానాయిక జాన్వీ క‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు బాబి డియోల్ చేరిక అద‌న‌పు బ‌లంగా మార‌నుంది. అలాగే డియోల్ కి ఎలాంటి పాత్ర‌ను ఆఫ‌ర్ చేసారు? అంటే.. ఇందులో చ‌ర‌ణ్ ని ఢీకొట్టే విల‌న్ గా కాకుండా అత‌డికి మెంటార్ గా క‌నిపిస్తాడ‌ని గుస‌గుస వినిపిస్తోంది. అయితే ఈ పాత్ర‌లో డెప్త్ ఆక‌ట్టుకుంటుంద‌ని, బాబికి మంచి పేరు తెస్తుంద‌ని చెబుతున్నారు. ఏదేమైనా ఇప్పుడు బాబి మెగా కాంపౌండ్ లో అడుగుపెడుతున్నాడు. ఇక్క‌డ వ‌రుస‌గా అవ‌కాశాలు వెల్లువెత్తే ఛాన్సుంది. డియోల్ హీరోతో మెగా డీల్ భారీ స‌మీక‌ర‌ణాల‌కు తావిచ్చే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా.

Tags:    

Similar News