బాక్సాఫీస్‌లో కొత్త ఆశలు

ఏప్రిల్ నెలలో ఇంత దారుణమైన స్లంప్ ఎప్పుడూ చూసి ఉండమేమో.

Update: 2024-04-29 17:36 GMT

కరోనా వల్ల వాషౌట్ అయిన 2020 సంవత్సరాన్ని పక్కన పెడితే.. వేసవి సీజన్ మునుపెన్నడూ లేనంతగా వెలవెలబోతోంది ఈ ఏడాది. పెద్ద సినిమాలు లేక ఇప్పటికే కళ తప్పిన బాక్సాఫీస్‌లో.. వేరే చిత్రాలు కూడా సందడి తీసుకురాలేకపోతున్నాయి. గత నెల చివర్లో వచ్చిన ‘టిల్లు స్క్వేర్’ మినహా ఏ చిత్రమూ ప్రేక్షకులను పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది. ఏప్రిల్లో వచ్చిన తెలుగు సినిమాలన్నీ కూడా తీవ్ర నిరాశకు గురి చేశాయి. ఒక్కో వారం గడిచేకొద్దీ బాక్సాఫీస్ దగ్గర పరిస్థితి ఇంకా ఇంకా ఘోరంగా తయారవుతోంది. షోలు నడిపించడం కంటే క్యాన్సిల్ చేసి స్క్రీన్లను ఖాళీగా పెట్టుకుంటేనే తక్కువ నష్టమని భావించడం వేసవి సీజన్ ఎంతో ఘోరంగా చెప్పడానికి ఉదాహరణ.ఏప్రిల్ నెలలో ఇంత దారుణమైన స్లంప్ ఎప్పుడూ చూసి ఉండమేమో.

ఐతే ఏప్రిల్ తీవ్ర నిరాశకు గురి చేశాక మే నెల కొంత ఆశాజనకంగా కనిపిస్తోంది. ఈ నెలలో కొన్ని క్రేజీ సినిమాలు రిలీజవుతున్నాయి. ఈ నెలలో తొలి వీకెండ్ నుంచే పరిస్థితులు మారే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆ రోజు రిలీజవుతున్న మూడు చిత్రాలూ ప్రేక్షకుల దృష్టిని కొంత ఆకర్షిస్తున్నవే. అల్లరి నరేష్ మళ్లీ తన పాత స్టయిల్ కామెడీ జానర్లో చేసిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ ట్రైలర్‌తో ఆసక్తి రేకెత్తించగలిగింది. ఇక చిన్న సినిమాలతో వరుసగా విజయాలందుకుంటున్న సుహాస్ నుంచి ‘ప్రసన్న వదనం’ అనే థ్రిల్లర్ మూవీ రాబోతోంది. దాని ట్రైలర్ కూడా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఇంకో వైపు తమిళ అనువాద చిత్రం ‘బాక్’ హార్రర్ ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తోంది. ఇందులో తమన్నా, రాశి ఖన్నాల గ్లామర్.. వెన్నెల కిషోర్ కామెడీ హైలైట్‌గా కనిపిస్తున్నాయి. ఈ మూడు చిత్రాలతో బాక్సాఫీస్‌లో మళ్లీ జోష్ వస్తుందని ట్రేడ్ ఆశలు పెట్టుకుంది.

Tags:    

Similar News