ర‌కుల్ తో 'దేవ‌సేన' చ‌ర్చ‌లా?

సౌత్ నుంచి త‌న‌కెందుకు పాన్ ఇండియా అవ‌కాశాలివ్వ‌ర‌ని... తెలుగులో కొంత మందికేనా?

Update: 2024-04-29 13:51 GMT

ర‌కుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ కంబ్యాక్ గ్రాండ్ గా ప్లాన్ చేస్తుందా? కొడితే కుంభ స్థ‌లాన్నే కొట్టాలి? అన్న రేంజ్ లో ప్ర‌ణాళిక ఉందా? అందుకోసం అన్ని ర‌కాల అస్త్రాల్ని వాడుడుతుందా? అంటే అవుననే లీకులందుతున్నాయి. అమ్మ‌డు 'కొండ పొలం' త‌ర్వాత టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్తూ ర‌క‌ర‌కాల ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. సౌత్ నుంచి త‌న‌కెందుకు పాన్ ఇండియా అవ‌కాశాలివ్వ‌ర‌ని... తెలుగులో కొంత మందికేనా? అవ‌కాశాల‌న్న‌ట్లు వ్యాఖ్యానించ‌డం అప్ప‌ట్లో చ‌ర్చ‌నీయాంశంగానే మారింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ టాలీవుడ్ వైపు చూసింది లేదు.

ఆమెని పిలిచి అవ‌కాశాలిచ్చింది లేదు. ఆ వ్యాఖ్య‌లు కాస్త‌నెగిటివ్ గానూ మారాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా కంబ్యాక్ ని మాత్రం గ్లాండ్ గానే ప్లాన్ చేస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. ఏకంగా సోలోగానే బాక్సాఫీస్ వ‌ద్ద స‌త్తా చాటే ప్లాన్తో ముందు కొస్తుంద‌ని గుస గుస వినిపిస్తుంది. త‌న‌కున్న పెద్ద పెద్ద ప‌రిచ‌యాల‌న్నింటిని ఉప‌యోగించుకుని నిర్మాత పుష్క‌ర్ రామ్మోహ‌న్ నిర్మాణ సంస్థ‌లో ఓ లేడీ ఓరియేంటెడ్ సినిమా చేసేలా చ‌ర్చ‌లు జ‌రుపుతుందిట‌.

Read more!

ఆ సినిమాకి దేవ‌సేన అనే టైటిల్ కూడా పెట్టిన‌ట్లు ఫిలిం స‌ర్కిల్స్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. ఓ కొత్త కుర్రాడు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడుట‌. అత‌ని పేరు బ‌య‌ట‌కు రాలేదుగానీ బ‌లమైన కంటెంట్ తోనే క‌థ న‌డుస్తుంద‌ని స‌మాచారం. సినిమా బ‌డ్జెట్ కూడా భారీగానే ఉంటుందంటున్నారు. ఇక దేవ‌సేన టైటిల్ వెనుక ఓ క‌థ కూడా ఉంది. 'బాహుబ‌లి'లో దేవ‌సేన లాంటి రోల్ పోషించాల‌ని చాలా మంది హీరోయిన్లు అభిప్రాయ‌ప‌డ్డారు.

కృతిశెట్టి..ర‌కుల్..కృతి స‌న‌న్ లాంటి వారు ఓపెన్ గా నే చెప్పారు. ఇప్పుడు అదే టైటిల్ తో ర‌కుల్ సినిమా పేరు తెర‌పైకి రావ‌డం ఇంట్రెస్టింగ్. ర‌కుల్ చివ‌రిగా త‌మిళ్ లో 'బూ' అనే చిత్రం చేసింది. అదే టైటిల్ తో తెలుగులోనూ రిలీజ్ అయింది. కానీ ఆసినిమా ఎప్పుడు రిలీజ్ ? ఎప్పుడు వెళ్లిందో కూడా తెలియ‌దు. మ‌ళ్లీ మూడేళ్ల త‌ర్వాత స్ట్రెయిట్ తెలుగు సినిమా లో ఆమె పేరు వినిపించ‌డం విశేషం. మ‌రి ఈసినిమా ఏ స్టేజ్ లో ఉందో తెలియాలి.

Tags:    

Similar News