తేజస్వి ప్రకాష్.. స్టన్ అయ్యే గ్లామర్ డోస్

ఇక సీరియల్స్ ద్వారా కెరియర్ స్టార్ట్ చేసి గ్లామర్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది తేజస్వి ప్రకాష్.

Update: 2024-04-29 17:53 GMT

బాలీవుడ్ ముద్దుగుమ్మల గ్లామర్ షోకి కొదవ ఉండదు. అక్కడి భామలు ఒకరిని మించి ఒకరు పోటీ పడుతూ హాట్ ఫోటోలతో గ్లామర్ షో చేస్తూ ఉంటారు. వీరికి ఇన్ స్టాగ్రామ్ లో మిలియన్స్ లో ఫాలోవర్స్ ఉంటారు. సినిమా యాక్టర్స్ తో పాటు సీరియల్ హీరోయిన్స్ కూడా గ్లామర్ షో విషయంలో ముందుంటారు. ఇక సీరియల్స్ ద్వారా కెరియర్ స్టార్ట్ చేసి గ్లామర్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది తేజస్వి ప్రకాష్.


ఈ అమ్మడు హిందీ బిగ్ బాస్ సీజన్ 15 విన్నర్ గా నిలవడం ద్వారా మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. బిగ్ బాస్ నుంచి బయటకొచ్చాక హీరోయిన్ గా మరాఠీలో రెండు సినిమాలు చేసింది. మరో వైపు ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్ సాంగ్స్ లలో కూడా తేజస్వి ప్రకాష్ సందడి చేసింది. వీటి ద్వారా ఈ గ్లామర్ బ్యూటీకి స్టార్ హీరోయిన్ రేంజ్ గుర్తింపు వచ్చింది.


ప్రస్తుతం హిందీలో నాగిని సీజన్ 6 సీరియల్ లో తేజస్వి ప్రకాష్ మెయిన్ లీడ్ చేస్తోంది. ఇదిలా ఉంటే ఇన్ స్టాగ్రామ్ లో తేజస్వి ప్రకాష్ కి 7.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. కేవలం ఫోటోషూట్ లలోనే కాకుండా బయట కూడా హాట్ హాట్ కాస్ట్యూమ్స్ తో పార్టీలలో సందడి చేస్తూ ఉంటుంది. ఈ కారణంగా తేజస్వికి బిటౌన్ లో గ్లామర్ క్వీన్ అనే ఇమేజ్ ఉంది.


అలాగే రెగ్యులర్ గా హాట్ ఫోటో షూట్ లతో ఇన్ స్టాగ్రామ్ లో తేజస్వి సందడి చేస్తూ ఉంటుంది. ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలకి లక్షల్లో లైక్స్ వస్తూ ఉంటాయి. ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా ఈ అమ్మడు అందాల ప్రదర్శన చేయడం విశేషం. అందుకే ఇన్ స్టాగ్రామ్ లో తేజస్వి ఫోటోలని ఎక్కువ మంది చూడటానికి ఇష్టపడతారు. తాజాగా వైట్ కలర్ కాస్ట్యూమ్ తో తేజస్వి ప్రకాష్ ఫోటోలకి ఫోజులిచ్చింది.

Read more!

ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. వైట్ స్కర్ట్ లో లెగ్స్ అందాలు చూపిస్తూ వయ్యారాలతో హీటేక్కిస్తున్న తేజస్వి ఫోటోలపై నెటిజన్లు ఆసక్తికరమైన కామెంట్స్ పెడుతున్నారు. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. కఠినమైన ఎండ ఒక్కోసారి మేలు చేస్తుంది అంటూ తన ఫోటోలకి తేజస్వి ప్రకాష్ ట్యాగ్ లైన్ ఇవ్వడం విశేషం. మరి ఈ స్టిల్స్ తో అమ్మడు ఎలాంటి క్రేజ్ అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News