• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఎల్లమ్మ.. వేణు...

ఎల్లమ్మ.. వేణు కాస్టింగ్‌లోనే ఏదో ఉంది!

| ‘బలగం’తో గుర్తింపు తెచ్చుకున్న వేణు యెల్దండి తన రెండో సినిమా ‘ఎల్లమ్మ’లోనూ పాత్రలకు సరిపోయే నటులనే ఎంచుకుంటున్నట్లు కనిపిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తుండగా, ప్రతినాయకుడి పాత్రకు చైతూ జొన్నలగడ్డ పేరు ప్రచారంలో ఉంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. దిల్ రాజు సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమా 2027 మార్చి 5న విడుదల కానుంది.

By - M Prashanth
Update: 2026-11-17 01:30 GMT

ఒక సినిమా కోసం స్టార్ హీరోను ఎంచుకుంటే బిజినెస్ పరంగా కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. అదే కొత్త వ్యక్తిని హీరోగా తీసుకుంటే ఆ రిస్క్ మొత్తం దర్శకుడిపైనే పడుతుంది. అయినప్పటికీ కొందరు దర్శకులు కథలోని పాత్రకు ఎవరైతే సరిపోతారో వారినే ఎంచుకుంటారు. 'బలగం'తో మంచి గుర్తింపు సంపాదించుకున్న వేణు యెల్దండి ఇప్పుడు తన రెండో సినిమా 'ఎల్లమ్మ' విషయంలో కూడా అలాంటి ప్రయత్నమే చేస్తున్నట్లు కనిపిస్తోంది.

మొదట 'ఎల్లమ్మ' కోసం నాని, నితిన్ లను అనుకున్నారు. చివరకు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ను హీరోగా తీసుకున్నారు. ఇప్పటివరకు ఎన్నో సినిమాలకు సంగీతం అందించిన దేవిశ్రీని ప్రధాన పాత్రలో చూడటం ప్రేక్షకులకు కొత్త అనుభవమే. పైగా ఈ సినిమాలో ఆయన పర్షి అనే పాత్రలో కనిపించబోతున్నారు. కథకు తగ్గట్టుగానే దేవిశ్రీని ఎంచుకున్నట్లు వేణు గతంలో చెప్పారు.

నిజానికి 'బలగం'లో కూడా వేణు పెద్ద స్టార్ల కోసం ప్రయత్నించలేదు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్‌రామ్‌తో పాటు తెలంగాణ పల్లెల్లో కనిపించే మనుషులను గుర్తుచేసే నటీనటులతో సినిమా తీశారు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, ఊరి వాతావరణం, అక్కడి మనుషుల ప్రవర్తనను చూపించిన విధానం సినిమాకు బాగా కలిసొచ్చింది. ఆ సినిమాలో నటీనటులకంటే పాత్రలే ఎక్కువగా గుర్తుండిపోయాయి.

ఇప్పుడు 'ఎల్లమ్మ'లోనూ అదే తరహా కాస్టింగ్ కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రతినాయకుడి పాత్ర కోసం చైతూ జొన్నలగడ్డ పేరు చర్చల్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 'రాజు వెడ్స్ రాంబాయి'లో వెంకన్న పాత్రతో మెప్పించిన చైతూకు తెలంగాణ యాసపై మంచి పట్టుంది. అయితే 'ఎల్లమ్మ'లో నటిస్తున్నట్లు చిత్రబృందం ఇంకా ప్రకటించలేదు. ఈ వార్త నిజమైతే వేణు మరోసారి పాత్రకు సరిపోయే నటుడినే ఎంచుకున్నట్లు చెప్పవచ్చు.

అయితే 'బలగం'తో పోలిస్తే 'ఎల్లమ్మ'లో వేణుకు మరో సవాల్ ఉంది. మొదటి సినిమాలో కుటుంబ బంధాలు, భావోద్వేగాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఈసారి గ్రామీణ నేపథ్యంతో పాటు యాక్షన్ కూడా ఉండబోతోందని ప్రచారం జరుగుతోంది. అలాంటి కథలో హీరోతో పాటు ఆయనకు ఎదురుగా నిలబడే పాత్రను కూడా బలంగా రాసుకోవాలి. అందుకే జస్ట్ పేరున్న నటుడిని తీసుకోవడం కంటే ఆ పాత్రను నమ్మించే వ్యక్తిని ఎంచుకోవడం ఉపయోగపడొచ్చు.

ఇక 'ఎల్లమ్మ'ను దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కూడా అందిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 5న సినిమాను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. తెలుగు మాత్రమే కాకుండా ఇతర భాషల్లోనూ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మొదటి సినిమాతో తెలంగాణ పల్లె కథను విజయవంతంగా చెప్పిన వేణు, ఈసారి అదే ప్రాంతపు నమ్మకాలు, సంప్రదాయాల నేపథ్యంలో పెద్ద స్థాయిలో సినిమా చేస్తున్నారు. ఇక ప్రమోషన్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చూడాలి.

Tags:    
  • yellamma 
  • venuyeldandi 
  • devisriprasad 
  • chaitujonnalagadda 

Similar News

బోయపాటి శ్రీను కొత్త కథ ఎంత వరకు వచ్చింది?

2026-11-17 01:30 GMT

జారిపోతున్న షోల్డర్ తో పరువాల విందు వడ్డిస్తున్న నభా నటేష్!

2026-11-17 00:30 GMT

'ఈఎన్ఈ' గ్యాంగ్‌ను తక్కువ అంచనా వేయకండి

2026-11-16 23:30 GMT

తండ్రీకొడుకుల బాక్స్ ఆఫీస్ క్లాష్!

2026-11-16 22:30 GMT

టాలీవుడ్‌లో జాన్వీ కపూర్‌ కొత్త ఆఫర్ల పరిస్థితి ఏంటి?

2026-11-16 19:30 GMT

సాయి పల్లవి దగ్గర నాగవంశీ అడ్వాన్స్ డబ్బులు.. వెనక్కి ఇచ్చిన తీసుకోలేదంటూ కామెంట్స్..!

2026-11-16 19:12 GMT

విడిపోయినా వీడని బంధం.. స్టార్ క‌పుల్స్ ప‌రిణ‌తికి హ్యాట్సాఫ్‌

2026-11-16 19:12 GMT

నెల ముందే రెడీ అంటున్న సంక్రాంతి సినిమాలు

2026-11-16 19:08 GMT

3.5 కోట్ల లగ్జరీ కార్ గిఫ్ట్ అందుకున్న క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్!

2026-11-16 19:08 GMT

బాలకృష్ణ 'దాదా' సందడి షురూ, బిజినెస్‌ అదుర్స్‌!

2026-11-16 19:07 GMT

రామాయణ చైనీస్ వర్షన్ రెడీ అవుతుందట!

2026-11-16 19:05 GMT

Copyright @2026

Powered by Blink CMS