అందాల అరియానా హొయలన్ని విరిసేనా..

అందుకే రంగుల ప్రపంచంలో రాణించే అందాల భామలు అందరూ ఇన్ స్టాగ్రామ్ ద్వారా పాపులారిటీ పెంచుకుంటున్నారు.

Update: 2024-04-29 17:48 GMT

ఇన్ స్టాగ్రామ్ అనేది ప్రస్తుతం అందాల భామలకు అతిపెద్ద ఆదాయ మార్గం అయ్యింది. సెలబ్రెటీ ఇమేజ్ వచ్చే బ్యూటీస్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా లక్షల నుంచి మిలియన్స్ లో ఫాలోవర్స్ పెంచుకుంటున్నారు. వారికి ఆ రూట్లో మంచి ఆదాయం వస్తూ ఉంది. అదే సమయంలో ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్ లతో సందడి చేస్తూ ఉంటే సినిమా అవకాశాలు కూడా వెతుక్కుంటూ వస్తున్నాయి. అందుకే రంగుల ప్రపంచంలో రాణించే అందాల భామలు అందరూ ఇన్ స్టాగ్రామ్ ద్వారా పాపులారిటీ పెంచుకుంటున్నారు.


ఒకప్పుడు నార్త్ ఇండియన్ బ్యూటీస్ తో పోల్చుకుంటే తెలుగమ్మాయిలు గ్లామర్ షో విషయంలో కాస్తా వెనుకబడి ఉండేవారు. అయితే ఇండిపెండెంట్ లైఫ్ స్టైల్ కి అలవాటుపడిన తర్వాత అవకాశాల కోసం గ్లామర్ షో తప్పదనే అభిప్రాయానికి ఓ వర్గం తెలుగమ్మాయిలు కూడా వచ్చేశారు. అందుకే గ్లామర్ షో చేస్తూ ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్ లు, వీడియోలు తీసుకుంటూ వాటిని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తున్నారు.

ఇలా షేర్ చేసిన ఫోటోలు, వీడియోలకి లక్షల్లో లైక్స్ వస్తూ ఉంటాయి. బుల్లితెరపై యాంకర్స్ గా రాణిస్తున్న అందాల భామలు కూడా గ్లామర్ షో విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ఈ విషయంలో బిగ్ బాస్ ఫేమ్ అరియానా కాస్తా ముందువరుసలోనే ఉంటుంది. యుట్యూబ్ ఛానల్స్ లో యాంకర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన అరియనా గ్లోరీ ఆర్జీవీ ఇంటర్వ్యూతో పాపులర్ అయ్యింది.

Read more!

అదే ఫేమ్ తో బిగ్ బాస్ లోకి అడుగుపెట్టింది. రెండు సార్లు బిగ్ బాస్ లో హౌస్ లోకి వెళ్లి టాప్ 5 కంటిస్టెంట్ లలో ఒకరిగా నిలిచింది. అలాగే బిగ్ బాస్ టాక్ షోకి హోస్ట్ గా రెండు సార్లు చేసింది. ఈ షో ద్వారా అరియానా గ్లోరీ విశేషమైన పాపులారిటీ సొంతం చేసుకుంది. బుల్లితెర రియాలిటీ షోలలో కూడా అరియానా గ్లోరీ పార్టిసిపేట్ చేస్తూ వస్తుంది. అలాగే డాన్స్ షోలలో కూడా సందడి చేస్తోంది. ఇన్ స్టాగ్రామ్ లో అరియానాకి 1 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు.

రెగ్యులర్ గా ఈ బ్యూటీ గ్లామర్ ఫోటోషూట్ లని, షార్ట్ వీడియోలని ఇన్ స్టాలో షేర్ చేస్తూ ఉంటుంది. వీటికి లక్షల్లో లైక్స్ వస్తూ ఉంటాయి. ఆ మధ్యకాలంలో బికినీతో హాట్ ఫోటోలని అమ్మడు ఇన్ స్టాగ్రామ్ లో పెట్టగా అవి కాస్తా వైరల్ అయ్యాయి. తాజాగా బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ బ్రా, స్కర్ట్ తో నెక్స్ట్ లెవల్ లో అందాలు ఆరబోస్తూ వీడియోని అరియానా గ్లోరీ షేర్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అరియానా గ్లోరీ ఈ లుక్ లో అప్సరసలా ఉందంటూ ఆమె అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

4
Tags:    

Similar News