రాజాధిరాజాగా అల్లరోడు.. సాంగ్ ఫుల్ క్రేజీ!

మళ్లీ చాలా కాలం తర్వాత కామెడీ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు'తో త్వరలోనే సందడి చేయనున్నారు.

Update: 2024-04-29 17:46 GMT

టాలీవుడ్ లో ఒకప్పుడు కామెడీ ఎంటర్టైనర్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను హీరో అల్లరి నరేష్ ఓ రేంజ్ లో అలరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ఈ హీరో.. వైవిధ్యమైన సినిమాలతో మెప్పించారు. నాంది, ఉగ్రం అంటూ సీరియస్ కంటెంట్ చిత్రాలతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. మళ్లీ చాలా కాలం తర్వాత కామెడీ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు'తో త్వరలోనే సందడి చేయనున్నారు.


డైరెక్టర్ మల్లి అంకం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు ప్రేక్షకుల్లో చిట్టిగా మనసు దోచుకున్న ఫరియా.. ఈ సినిమాతో మరో హిట్ కొట్టాలని ట్రై చేస్తోంది. ఇప్పటికే 'ఆ ఒక్కటీ అడక్కు' మూవీ నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకుని పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మ్యూజిక్ ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు మేకర్స్.

ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్ కు మ్యూజిక్ లవర్స్ నుంచి మంచి స్పందన లభిస్తోంది. రీసెంట్ గా హమ్మమ్మో రొమాంటిక్ సాంగ్ ను రిలీజ్ చేసిన మేకర్స్.. ఇప్పుడు రాజా ధి రాజా పాట గ్లింప్స్ ను స్టార్ డైరెక్టర్ మారుతి చేతుల మీదుగా విడుదల చేయించారు. మే 1వ తేదీన ఫుల్ సాంగ్ ను రివీల్ చేస్తామని సోషల్ మీడియాలో మేకర్స్ ప్రకటించారు. మే3వ తేదీన బిగ్ స్క్రీన్ పై ఈ పాట ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుందని ట్వీట్ చేశారు.

భాస్కర్ భట్ల అందించిన లిరిక్స్ ను హస్కీ వాయిస్ తో మోహనా భోగరాజు, ధనుంజయ్ సీపాన సూపర్ గా పాడారు. గోపీసుందర్ మ్యూజిక్ కూడా క్రేజీగా ఉంది. ఇక సాంగ్ అంతా ఫన్నీగా సాగుతున్నట్లు కనిపిస్తోంది. పాటలో అల్లరి నరేష్ రాజు గెటప్ లో ఉండగా.. స్వయంవరం జరుగుతున్నట్లు చూపించారు. బిగ్ బాస్ హరితేజ క్రేజీ ఇన్విటేషన్ తో రాణి వచ్చి విల్లు విరిచేస్తోంది. ఆ తర్వాత అంతా ఫుల్ డ్యాన్స్ చేస్తున్నట్లు చూపించారు.

Read more!

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ రాజాధిరాజా సాంగ్.. క్రేజీగా ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక చిలకా ప్రొడక్షన్ బ్యానర్ పై రాజీవ్ చిలకా.. ఈ మూవీని నిర్మిస్తున్నారు. ప్రస్తుత యువతకు బాగా కనెక్ట్ అయ్యే కథతో ఈ సినిమా తీశామని ఇటీవల ఆయన తెలిపారు. మూవీ అంతా ఫన్ తో నిండి ఉంటుందని కూడా చెప్పారు. మరి ఈ మూవీతో అల్లరి నరేష్ ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.

Full View
Tags:    

Similar News