ప్రభాస్ హీరోయిన్‌ కి లేడీ బిల్లా డ్రీమ్‌...!

అందాల ఈ హీరోయిన్‌ కి గ్యాంగ్‌ స్టర్ గా మారాలనే ఆలోచన రావడం విడ్డూరంగా ఉంది. గ్యాంగ్‌స్టర్‌ పాత్ర అంటే ఓ రేంజ్‌ లో యాక్షన్‌ సన్నివేశాలు చేయాల్సి ఉంటుంది.

Update: 2024-04-29 16:30 GMT

తెలుగు లో ఇప్పటి వరకు ఒక్క సినిమా చేయకున్నా కూడా డబ్బింగ్‌ సినిమాలు మరియు సోషల్ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేయడం ద్వారా పాపులారిటీని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ మాళవిక మోహనన్‌. ఈ అమ్మడి అందానికి ఎంతటి వారైనా ఫిదా అవ్వాల్సిందే అన్నంత అందం ఈ అమ్మడి సొంతం.

సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేస్తూ కుర్రకారులో హీట్‌ పెంచే ముద్దుగుమ్మ మాళవిక మోహనన్‌ ఈసారి అదే సోషల్‌ మీడియాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది.

ముద్దుగుమ్మ మాళవిక మోహనన్‌ ను ఒక నెటిజన్‌ మీకు డ్రీమ్‌ రోల్‌ ఏంటి అంటూ ప్రశ్నించాడు. అందుకు మాళవిక నుంచి ఆసక్తికర సమాధానం లభించింది. నేను ఇప్పటి వరకు చాలా పాత్రల్లో నటించాను. అయితే నేను మాత్రం లేడీ డాన్‌ గా, గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో నటించాలని కోరుకుంటున్నాను అంది.

అందాల ఈ హీరోయిన్‌ కి గ్యాంగ్‌ స్టర్ గా మారాలనే ఆలోచన రావడం విడ్డూరంగా ఉంది. గ్యాంగ్‌స్టర్‌ పాత్ర అంటే ఓ రేంజ్‌ లో యాక్షన్‌ సన్నివేశాలు చేయాల్సి ఉంటుంది. వాటన్నింటికి ఓకే కనుకే మాళవిక మోహనన్‌ లేడీ బిల్లా గా కనిపించాలని కలలు కంటోంది.

Read more!

ప్రస్తుతానికి ఈ అమ్మడు తమిళంలో తంగళన్ తో పాటు తెలుగు లో రాజా సాబ్‌ సినిమాలో నటిస్తోంది. ప్రభాస్ కు జోడీగా రాజాసాబ్‌ సినిమాలో ముగ్గురు ముద్దుగుమ్మలు కనిపించబోతున్నారట. అందులో ఒక హీరోయిన్ గా మాళవిక మోహనన్‌ ను ఎంపిక చేయడం జరిగింది. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు.

మాళవిక మోహనన్‌ మొదటి తెలుగు సినిమా రాజాసాబ్‌ హిట్ అయితే వరుసగా టాలీవుడ్‌ ప్రాజెక్ట్‌ లు చేసే అవకాశాలు ఉన్నాయి. పలువురు యంగ్‌ హీరోలు ఈ అమ్మడితో జోడీ కట్టేందుకు ఆసక్తి ఉన్నారు. మరి వారిలో ఏ ఒక్కరు మాళవిక కి లేడీ డాన్ పాత్ర లో నటించే అవకాశం ఇస్తారో చూడాలి.

Tags:    

Similar News