లయ హడావిడికి అసలు రీజన్ ఇదా?

Update: 2023-03-12 22:10 GMT
సోషల్ మీడియా పుణ్యమా అని ఒకప్పుడు ఫేడ్ అవుట్ అయిపోయిన టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం మళ్లీ వార్తల్లోకి ఎక్కుతున్నారు. గత వారంలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన మాజీ హీరోయిన్‌కి దాదాపు 10+ ఇంటర్వ్యూలు అకస్మాత్తుగా తెర మీదకి వచ్చాయి. ఒక రకంగా యూట్యూబ్ లో ఎక్కడ చూసినా ఆమె ఇంటర్వ్యూలు దర్శనం ఇస్తున్నాయి. ఆమె ఎవరు అనుకుంటున్నారా? ఆమె ఎవరో కాదు నటి లయ.

ఈ అందమైన మాజీ హీరోయిన్ అకస్మాత్తుగా చాలా ఇంటర్వ్యూలు ఇవ్వడం ఎందుకు అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. చాలా కాలం క్రితమే సినీ పరిశ్రమకు దూరమైన విజయవాడ బ్యూటీ లయ గురించే ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో అలాగే సాధారణ ప్రేక్షకుల్లో చర్చ జరుగుతోంది. స్వయంవరం సహా ప్రేమించు వంటి సినిమాలతో ఈ అచ్చ తెలుగు అమ్మాయి మంచి క్రేజ్ సంపాదించింది.

అయితే ఆమెకు మంచి సంబంధం రావడంతో తాను సినిమాల నుండి తప్పుకుని, వివాహం చేసుకుని, అమెరికాలో స్థిరపడింది. శ్రీనువైట్ల అమర్ అక్బర్ ఆంటోనిలో అతిథి పాత్రలో నటించినప్పటికీ ఆ సినిమా డిజాస్టర్ కావడంతో ఆమెకి పెద్దగా ఆ సినిమా ఉపయోగ పడలేదు. అయితే, ఇప్పుడు చాలా యూట్యూబ్ ఛానెల్‌లు, కొన్ని టీవీ ఛానెల్‌లు ఆమెను ఇంటర్వ్యూలు చేయడంతో ఇంత హడావుడిగా ఆమె ఎందుకు ఇలా చేస్తోంది అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది.

నిజానికి లయ భర్త డాక్టర్‌గా ఉండగా USAలో IT కన్సల్టెంట్‌గా ఆమె పని చేస్తోంది. 40 ఏళ్ల లయ తెలుగు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారని కొందరు అంటున్నారు. ఈ యేజ్ లో కథానాయిక పాత్రలు ఆమెకు రానప్పటికీ కొన్ని ఆసక్తికరమైన క్యారెక్టర్ రోల్స్ చేయాలనే ఆలోచనలో ఆమె ఉన్నట్లు సమాచారం. అయితే, అలాంటి పాత్రలకు వయస్సు అలాగే గ్లామర్ కూడా అవసరం. అయితే లయకు వయసు తక్కువే అయినా గ్లామర్ ఎక్కువే. అందుకే ఇప్పుడు టాలీవుడ్ జనాలు అయోమయంలో పడ్డారని తెలుస్తోంది. లేదా సీనియర్ హీరోల సరసన హీరోయిన్ గా నటించే ఆఫర్లు లయకు వస్తాయని కూడా అంటున్నారు.

Similar News