తమిళ స్టార్ హీరో ఇప్పటికీ అదేనంట బ్రో!
వరుసగా క్రేజీ ప్రాజెక్ట్‌లలో నటిస్తూ 50 సినిమాల మైలు రాయిని క్రాస్ చేయబోతున్నాడు. వెట్రిమారన్ డైరెక్షన్‌లో `వడచెన్నై`కి సీక్వెల్‌గా రూపొందుతున్న యాక్షన్ డ్రామా `అరసన్`లో నటిస్తున్నాడు.;
కోలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత క్రేజీ నటుడిగా పేరు తెచ్చుకున్న హీరో శింబు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన శింబు ఆ తరువాత హీరోగా ఎంట్రీ ఇవ్వడం వరుస విజయాల్ని తన ఖాతాలో వేసుకోవడం తెలిసిందే. మన్మథతో స్క్రీన్ రైటర్‌గా తన సత్తా చాటుకున్న శింబు `వల్లభ`తో దర్శకుడిగానూ అదరగొట్టి అందరిని ఆశ్చర్యపరిచాడు. గాయకుడిగానూ తన టాలెంట్ చూపించిన శింబు ఇప్పుడు హీరోగా బిజీగా ఉన్నాడు.
వరుసగా క్రేజీ ప్రాజెక్ట్‌లలో నటిస్తూ 50 సినిమాల మైలు రాయిని క్రాస్ చేయబోతున్నాడు. వెట్రిమారన్ డైరెక్షన్‌లో `వడచెన్నై`కి సీక్వెల్‌గా రూపొందుతున్న యాక్షన్ డ్రామా `అరసన్`లో నటిస్తున్నాడు. విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తున్న ఈ మూవీ తెలుగులోనూ భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఇది శంబు నటిస్తున్న 9వ సినిమా. ఇక 50వ ప్రాజెక్ట్‌ని డేసింగు పెరియసామి డైరెక్షన్‌లో చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ప్రి ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఇక 51వ ప్రాజెక్ట్‌ని `రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్` ఫేమ్ అశ్వత్ మారిముత్తు డైరెక్షన్‌లో చేస్తున్నాడు. దీనికి గాడ్ ఆఫ్ లవ్` అనే టైటిల్‌ని ఫైనల్ చేశారు. ఈ మూవీని ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ అత్యంత భారీ స్థాయిలో నిర్మించబోతోంది. ఇదిలా ఉంటే శింబుని జయ టీవి యాంకర్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కారణం ఈ ఇంటర్వ్యూలో హీరో శింబు బోల్డ్‌గా సమాధానాలు చెప్పడమే. ఇంటర్వ్యూలో హీరో శింబుని యాంకర్ లవ్, శృంగారంకు సంబంధించి బోల్డ్‌గా ప్రశ్నలు వేసింది. వాటికి శింబు అంతే బోల్డ్‌గా సమాధానాలు చెప్పడం ఇప్పుడు ఆసక్తిని రేకెత్తించి చర్చనీయాంశంగా మారింది. ఎంతో మందితో లవ్ ఎఫైర్‌లు నడిపారు కదా ఇప్పటికీ మీరు వర్జిన్‌గానే ఉన్నారా? అని అడిగింది. దానికి శింబు సమాధానం చెబుతూ నేను ఇప్పటికీ ఎవరితో శృంగారంలో పాల్గొనలేదని, తాను ఇప్పటికీ వర్జిన్‌నే అని సమాధానం చెప్పాడు.
అదెలా అని యాంకర్ అడిగితే `నన్ను ఓ అమ్మాయి ఇష్టపడితే.. ప్రేమిస్తే నేను కూడా అదే చేశాను కానీ ఏనాడూ శృంగారంలో పాల్గొనలేదు. నన్ను ప్రేమించిన వారిని అంతే గౌరవంగా చూశాను. ప్రేమను పంచాను అంతే. అని తెలిపాడు. ఇక మీలో ఇప్పుడు మార్చుకోవాలనిపించే అంశం ఏదని అడిగితే అలాంటిది ఏమీ లేదని స్ట్రెయిట్‌గా ఆన్సర్ ఇచ్చాడు.