టాలీవుడ్ లో ఐక్యత సాధ్యం కాదా?
కోలీవుడ్ అంటే? అక్కడ నటులే పని చేయాలి. అక్కడ హీరోలు, దర్శకులకే అవకాశాలివ్వాలి. ఏ శాఖలో చూసుకున్నా? అందులో తమిళులు మినహా బయట వారు పెద్దగా కనిపించరు.;
కోలీవుడ్ అంటే? అక్కడ నటులే పని చేయాలి. అక్కడ హీరోలు, దర్శకులకే అవకాశాలివ్వాలి. ఏ శాఖలో చూసుకున్నా? అందులో తమిళులు మినహా బయట వారు పెద్దగా కనిపించరు. ఆ విషయంలో వాళ్లలో ఐక్యత అంత బలంగా ఉంటుంది. ఇతర పరిశ్రమల నుంచి బయట వారు వెళ్లి స్థిరపడటం అన్నది అంత సులభం కాదు. ప్రేక్షకులు అంగీకరించడానికంటే ముందే? అక్కడ పరిశ్రమ యాక్సెప్ట్ చేయాలి. కానీ అది జరగదు. వాళ్లలో వాళ్లకు ఎన్ని ఉన్నా? బయట వారి ఎంట్రీని ఎంత మాత్రం సహించలేరు అన్నది కాదనలేని నిజం.
తమిళనాడు కంటే అమెరికా వసూళ్లే ఎక్కువ:
తెలుగు సినిమాలు అమెరికాలో మంచి వసూళ్లు సాధిస్తాయి. కానీ పక్కనే ఉన్న తమిళ నాడు రాష్ట్రం నుంచి మాత్రం పెద్దగా వసూళ్లు కనిపించవు. ఎంత పెద్ద హిట్ సినిమా రిలీజ్ చేసినా అక్కడ అదే పరిస్థితి. అక్కడ మనం మనం బరంపురం అన్న కాన్సెప్ట్ ఎక్కువగా పని చేస్తుంది. ఈ విషయంపై ఇటీవలే సంగీత దర్శకుడు తమన్ కూడా తమిళ్ లో సినిమాలు ఎందుకు చేయరు? అని అడిగితే అక్కడ తనకి అవకాశాలివ్వరు ? అని ఓపెన్ గానే చెప్పాడు. అతడికే కాదు తెలుగు నుంచి ఎవరూ వెళ్లినా అదే పరిస్థితి. గతంలో కొంత మంది నటీనటులు, టెక్నిషియన్లు కూడా ఈ విషయంపై ఎంతో ఓపెన్ గా మాట్లాడారు.
భాషతో సంబంధం లేకుండా ఆదరణ:
ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో ఎందుకు అంత ఐక్యత ఉండదు? అన్న క్వశ్చన్ కూడా రెయిజ్ అవుతుంది.
తెలుగు ఇండస్ట్రీ సహా ప్రేక్షకులు ఏ భాషా చిత్రం రిలీజ్ అయినా? ఆ సినిమా బాగుందుంటే ఆదరిస్తారు.ఆ చిత్రాన్ని మంచి హిట్ చేస్తారు. సినిమాను సినిమాగా మాత్రమే ఆదరించడం అన్నది తెలుగు ప్రేక్షకుల గొప్పతనం. ఆ విషయంలో ఎలాంటి రాజకీయాలకు తావు ఇవ్వరు. రాష్ట్రాల మధ్య విబేధాలు ఎన్ని ఉన్నా? సినిమాపై ఆప్రభావం ఎంత మాత్రం పడకుండా ఎంచక్కా ఎంజాయ్ చేస్తారు. ఈ విషయంలో ఇండస్ట్రీ పెద్దలు, దర్శక, నిర్మాతలు కూడా ఇదే తీరున వ్యవహరిస్తున్నారు? అన్నది కాదనలేని నిజం.
వాటికి సమాధానం దొరుకుతుందా:
సినిమాకు భాషతో సంబంధం లేదంటారు. కళకు భాషతో పనేంటంటారు? ఏ భాషా కళాకారుడినైనా ఆదరించడం అన్నది తెలుగు పరిశ్రమ, ప్రేక్షకుల గొప్పదనంగా భావిస్తారు. కోలీవుడ్ నటులైన విజయ్, సూర్య, కార్తీ, ధనుష్ లాంటి వారు తెలుగు దర్శక, నిర్మాతలతో సినిమాలు చేస్తారు. అక్కడ సంగీత దర్శకులు, నటీనటులు, టెక్నీషియన్లకు టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉంటుంది. మరి తెలుగు హీరోలు ఎవరైనా కోలీవుడ్ లో స్ట్రెయిట్ సినిమాలు చేసారా? వీరంతా అక్కడకు వెళ్లి సినిమాలు చేస్తామంటే? అక్కడ దర్శక, నిర్మాతలు గ్రాండ్ గా వెల్కమ్ చేస్తారా? ఇలాంటి సందేహాలన్నింటి నివృతి చేయాల్సిన బాధ్యత కోలీవుడ్ ని ప్రోత్సహిస్తోన్న టాలీవుడ్ పెద్దలపై ఉందన్నది మర్చిపోవొద్దు సుమీ.