కశ్మీర్ లోయలో కొత్త సందడి... సైన్యం మాత్రమే ఉండే చోట ఏమిటిది..!

సాధారణంగా ఉగ్రవాదం భయం లేని రోజుల్లో ‘కశ్మీరు లోయలో కన్యా కుమారిరో’ అనే సందడి కనిపించేది!;

Update: 2025-12-17 01:30 GMT

సాధారణంగా ఉగ్రవాదం భయం లేని రోజుల్లో ‘కశ్మీరు లోయలో కన్యా కుమారిరో’ అనే సందడి కనిపించేది! అయితే.. 1990 ప్రారంభంలో ఉగ్రవాదుల చర్యలు, వారిపై భద్రతా దళాల కాల్పులు వెరసి అప్పటి అంత సందడి లేకుండా.. ఎక్కువగా సైనిక కవాతులకే పరిమితమైనట్లు మారింది! అయితే ఇప్పుడు మాత్రం దక్షిణ కశ్మీర్ లోని షోపియన్, పుల్వామా జిల్లాలో సరికొత్త సందడి మొదలైంది. జనాలు సినిమాహాళ్లను హౌస్ ఫుల్ చేస్తున్నారు.

అవును... ఇటీవల వరకూ ఉగ్రవాదం, అల్లర్లు వంటివాటికి పేరుగాంచిన దక్షిణ కశ్మీర్ లోని షోపియన్, పుల్వామా జిల్లాలో ఇప్పుడు సరికొత్త సందడి మొదలైంది. అక్కడి ప్రజలు చాలా కాలంగా పరిమిత వినోద ఎంపికలతో ఇబ్బందులు పడుతూ.. సినిమా చూడటం వారి దినచర్యల నుంచి దాదాపు కనుమరుగైపోయిన వేళ.. అక్కడి థియేటర్ల ముందు హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన నివేదికలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

వివరాళ్లోకి వెళ్తే... ఆదిత్య ధార్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ "ధురంధర్" ప్రపంచవ్యాప్తంగా సందడి చేస్తోన్న సంగతి తెలిసిందే. కలెక్షన్లు పాత రికార్డులను చెరిపేసేలా ఉన్నాయని అంటున్నారు. అయితే ఆ సందడి దేశంలోని మిగిలిన ప్రాంతాల్లోనే కాదు.. షోపియన్, పుల్వామా వంటి ప్రాంతాల్లోనూ మొదలైంది. ఈ ప్రాంతంలో ఈ సినిమా ప్రదర్శించబడుతోన్న థియేటర్లకు జనాలు పెద్ద ఎత్తున వస్తున్నారని అంటున్నారు.

వాస్తవానికి జమ్ముకశ్మీర్ అంతటా చిన్న ఫార్మాట్ థియేటర్లను నిర్వహిస్తున్న మల్టీఫ్లెక్స్ చైన్ అయిన సితారా ఈ చిత్ర ప్రదర్శనకు మద్దతు ఇచ్చింది. ఈ నేపథ్యంలో షోపియన్, పుల్వామా ప్రజల స్పందనపై తాజాగా స్పందించిన సితారా ప్లెక్స్ ఎండీ రాహుల్ నెహ్రా... ఇలాంటి ప్రాంతాల్లో ధురంధర్ కు వచ్చిన స్పందన, ప్రేక్షకులు థియేటర్లకు వస్తారనే తమ నమ్మకాన్ని బలపరుస్తుందని అన్నారు.

కాగా.. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ధురంధర్ సినిమా మోత మోగిస్తోంది. ఈ సందర్భంగా అటు కలెక్షన్లు, ఇటు కాంప్లిమెంట్స్ తో దూసుకుపోతుంది. ఈ సమయంలో సాధారణ ప్రేక్షకులే కాదు.. సినీ ప్రముఖులు సైతం ఈ సినిమాను తెగ పొగిడేస్తున్నారు. ఈ లిస్టులో స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు చేరింది. ఈ సినిమా చూసిన తర్వాత ఇన్ స్టా వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించింది.

ఇందులో భాగంగా... ధురంధర్ సినిమా చూసి బయటకు వచ్చాక కూడా తాను ఇంకా ఆ వైబ్ లోనే ఉన్నానని.. అంతగా ఆ సినిమా తనను కట్టిపడేసిందని.. బిగ్ స్క్రీన్ పై ఈ సినిమాను చూస్తుంటే కలిగే అనుభవం, థ్రిల్ మాటల్లో చెప్పలేమని స్పందించింది.

Tags:    

Similar News