సీనియర్ హీరోల విషయంలో డైరెక్టర్లకు అది శాపంగా మారిందా?
టాలీవుడ్ లో సీనియర్ హీరోలకు హీరోయిన్లను సెలెక్ట్ చేయడమనేది చాలా తలనొప్పిగా మారింది.;
టాలీవుడ్ లో సీనియర్ హీరోలకు హీరోయిన్లను సెలెక్ట్ చేయడమనేది చాలా తలనొప్పిగా మారింది. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, రవితేజ, మహేష్ బాబు లాంటి స్టార్ల వయసులు చాలా ఎక్కువ ఉండటంతో వారి వయసుకు తగ్గ హీరోయిన్లను వెతికి ఎంపిక చేయడం చాలా కష్టంగా మారింది. సీనియర్ హీరోల సినిమాలు ఆలస్యమవడానికి ఇది కూడా ఒక కారణం.
సినిమా కథ ఓకే అయ్యి, స్క్రిప్ట్ లాక్ అయిపోయి, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అన్నీ పూర్తైనా కూడా డైరెక్టర్లకు హీరోయిన్లను వెతికి పట్టుకోవడం తలకు మించిన భారంగా మారుతుంది. ఈ నేపథ్యంలోనే పదే పదే చేసిన భామలతోనే చేయాల్సి వస్తుంది. కొత్త భామల్ని ట్రై చేద్దామంటే ఏజ్ పరంగా సెట్ అవరనే రీజన్ తో మేకర్స్ ధైర్యం చేయలేకపోతున్నారు. ఒక వేళ ధైర్యం చేసినా దాన్ని సోషల్ మీడియాలో నెటిజన్లు ఒప్పుకోవడం లేదు.
హీరోల ఏజ్ పెరిగే కొద్దీ ఈ ప్రాబ్లమ్ మరింత పెద్దదవుతుంది. చేసేదేమీ లేక 60 హీరోలు యంగ్ హీరోయిన్లతో జోడీ కడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో పలువురు యంగ్ హీరోయిన్లు సీనియర్ హీరోలతో నటించగా ఆ టాపిక్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది. వారిలో మరీ ముఖ్యంగా మాస్ మహారాజా రవితేజ సరసన ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి, శ్రీలీల లాంటి వారు నటించడాన్ని అంతా తప్పుబడుతున్నారు.
రవితేజతో పాటూ నందమూరి బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ కలిసి నటించడాన్ని కూడా అందరూ తప్పుబడుతున్నారు. గతంలో ధమాకా టైమ్ లోనే రవితేజ, శ్రీలీల ఏజ్ గ్యాప్ పై వార్తలొచ్చినప్పటికీ ఆ తర్వాత సినిమా రిలీజయ్యాక వారి జంట బావుందని టాక్ వినిపించింది. అంతేకాదు, బాలయ్య- ప్రగ్యా జైస్వాల్ పెయిర్ పై వార్తలొచ్చినప్పటికీ వారి జంట కూడా ఆన్ స్క్రీన్ బాగా ఉందని అందరూ అన్నారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఓ వర్గం ఆడియన్స్ మాత్రం దీనిపై కామెంట్స్ చేస్తూ ఎప్పటికప్పుడు దీన్ని హాట్ టాపిక్ గానే ఉంచుతున్నారు.