బోయపాటికి బన్నీ ఛాన్స్ ఇస్తారా?
ప్రముఖ డైరెక్టర్ బోయపాటి శ్రీను.. ఏకంగా నాలుగోసారి బాలకృష్ణతో అఖండ 2 సినిమా చేశారు. పాన్ ఇండియా మూవీ అంటూ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తో నడుస్తోంది.;
ప్రముఖ డైరెక్టర్ బోయపాటి శ్రీను.. ఏకంగా నాలుగోసారి బాలకృష్ణతో అఖండ 2 సినిమా చేశారు. పాన్ ఇండియా మూవీ అంటూ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తో నడుస్తోంది. ఇకపోతే ఈ సినిమా టాక్ కాస్త పక్కన పెడితే.. ఇది పాన్ ఇండియా సినిమా అన్నారు కాబట్టి.. అటు బోయపాటి కూడా నెక్స్ట్ పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ తెచ్చుకున్న హీరోలతోనే సినిమాలు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే బోయపాటి నెక్స్ట్ టార్గెట్ ఎవరు అంటూ కామెంట్స్ వ్యక్తం అవ్వగా.. తాజాగా బన్నీ పేరు గట్టిగా వినిపిస్తోంది.
ఎందుకంటే గతంలో అల్లు అర్జున్ సరైనోడు సినిమా తర్వాత ఒక ఫంక్షన్ లో పాల్గొన్నప్పుడు బోయపాటితో మరో సినిమా చేయాలని ఉంది అంటూ తన మనసులో మాట చెప్పుకొచ్చారు. అంతేకాదు గత ఐదు సంవత్సరాల క్రితమే గీత ఆర్ట్స్ నుండి బోయపాటి అడ్వాన్స్ తీసుకున్నారు. ఈ విషయాన్ని అల్లు అరవింద్ స్వయంగా తెలిపారు కూడా.. దీనికి తోడు అల్లు అర్జున్ - బోయపాటి మధ్య మంచి సాన్నిహిత్యం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ తో బోయపాటి సినిమా చేస్తారు? బోయపాటి నెక్స్ట్ టార్గెట్ బన్నీనే అంటూ కథనాలు వెలువడుతున్నాయి.
ఇదంతా వినడానికి బాగానే ఉన్నా.. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే.. పుష్ప, పుష్ప 2 చిత్రాల తర్వాత అల్లు అర్జున్ రేంజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ రేంజ్ లో ఆయన సినిమా చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం పాన్ ఇండియా డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ మూవీగా వస్తున్న ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ చేయడానికి సన్నహాలు సిద్ధం చేస్తున్నారు. దీనికి తోడు అవతార్ వంటి చిత్రాలకు పనిచేసిన విఎఫ్ఎక్స్ సంస్థలు ఈ సినిమా కోసం పని చేస్తున్నాయి. అటు కోలీవుడ్ బడా నిర్మాత కళానిధి మారన్ కూడా సన్ పిక్చర్స్ బ్యానర్ పై వందల కోట్ల రూపాయలను బడ్జెట్ గా కేటాయిస్తున్నారు.
మరి ఇలాంటి అల్లు అర్జున్ తన స్థాయికి తగ్గట్టుగా నెక్స్ట్ లెవెల్ లో దర్శకులను సెలెక్ట్ చేసుకుంటారే తప్పా.. ఇప్పుడు మిక్స్డ్ టాక్ తో రన్ అవుతున్న సినిమా చేసిన డైరెక్టర్ బోయపాటి శ్రీనుకి అవకాశం ఇస్తాడా..? పైగా హాలీవుడ్ రేంజ్ కి ఎదిగే ప్రయత్నం చేస్తున్న బన్నీ ఇప్పుడు లోకల్ డైరెక్టర్లకి అవకాశం ఇస్తారా ? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాలి అంటే.. బోయపాటి నెక్స్ట్ మూవీ ప్రకటించే వరకు ఎదురు చూడాల్సిందే.