దేవదాసుల వారసులను చూస్కోండి మరి

Update: 2015-11-11 03:46 GMT
దీపావళి సందర్బంగా ఈరోజు రిలీజ్ కానున్న 'అఖిల్' సినిమాలో హీరో హీరోయిన్లు అఖిల్ - సాయేషా సైగల్. ఇద్దరికి ఇది మొదటి మూవీయే కావడం విశేషం. అయితే.. ఇలా ఒకే సినిమాతో హీరోహీరోయిన్లు అరంగేట్రం చేసిన సందర్భాలు ఎక్కువగానే ఉంటాయి. ప్రేక్షకులకు ఫ్రెష్ నెస్ పంచడం కోసం ఇలా ట్రై చేస్తుంటారు దర్శకనిర్మాతలు.

అయితే.. అఖిల్ - సాయేషా సైగల్ లు ఇద్దరూ తారల వారసులే కావడం, ఓ బడా వంశానికి చెందినవారు కావడం విశేషం. అఖిల్ అక్కినేని వంశంలో నేటి తరానికి చెందినవాడు కాగా.. దిలీప్ కుమార్ మనుమరాలు సాయేషా సైగల్.  అన్నిటికంటే ముఖ్యమైన కోఇన్సిడెన్స్ ఏంటంటే..  అఖిల్ తాతయ్య అక్కినేని నాగేశ్వరరావు - సాయేషా సైగల్ తాతయ్య దిలీప్ కుమార్ లు ఇద్దరూ దేవదాసు చిత్రంలో నటించిన వారే కావడం విశేషం. ఇలా రెండు భాషల్లో వచ్చిన ఒకే సినిమాలో నటించిన హీరోలకు వారసులు.. ఒకే మూవీతో సినీ రంగ ప్రవేశం చేయడం మాత్రం ఆశ్చర్యకరమే.    

ఇదే విషయంపై సాయేషా సైగల్‌ ను అడిగితే.. ''ఏమో మాకు అలా రాసిపెట్టుంది. ఇద్దరి తాతలూ లెజండ్‌ లే. పైగా ఇద్దరూ దేవదాసులే. మేం ఖచ్చితంగా ఇప్పుడు హిట్టు కొట్టి వారి లెగసీని నిలబెట్టాలి. ఇద్దరం కూడా తెలుగు ఇండస్ర్టీలో పాగా వేయాలనే కాచుకుచ్చున్నాం. వారి ఆశీస్సులు మాకున్నాయ్‌. ఇక మీరు ధియేటర్లలో చూసుకోండి'' అంటూ సెలవిచ్చాంది. అఖిల్‌ కూడా ఈ మధ్య ఇలాంటి కామెంట్లే చేశాడులే. ఎనీవే.. గుడ్‌ లక్‌!!


Tags:    

Similar News