రామ్, భాగ్యశ్రీ.. ఎన్నిసార్లు చెప్పినా మళ్లీ..
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బొర్సే రిలేషన్ షిప్ లో ఉన్నారని కొన్ని నెలలుగా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే.;
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బొర్సే రిలేషన్ షిప్ లో ఉన్నారని కొన్ని నెలలుగా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి ఇటీవల ఆంధ్రా కింగ్ తాలూకా మూవీలో నటించగా.. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే రామ్, భాగ్యశ్రీ మధ్య సాన్నిహిత్య సంబంధం పెరిగిందని రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి.
అది కాస్త స్నేహబంధం దాటి.. ప్రేమగా మారిందని పుకార్లు వినపడుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఆ విషయంపై రామ్, భాగ్యశ్రీ రెస్పాండ్ అయ్యారు. ఆంధ్రా కింగ్ తాలూకా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూల్లో స్పందించారు. తామిద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమేనని స్పష్టం చేశారు. కేవలం ఫ్రెండ్ షిప్ రిలేషన్ ఉందని చెప్పారు.
తాను సినిమా కోసం లవ్ సాంగ్ రాసినప్పటి నుంచి రూమర్స్ మొదలయ్యాయని రామ్ తెలిపారు. భాగ్యశ్రీపై ప్రేమతో పాట అంత బాగా రాశానని అనుకుంటున్నారని, కానీ హీరోయిన్ ను సెలెక్ట్ చేయకముందే రాశానని చెప్పారు. ఆ తర్వాత ఆయన అంటే తనకు ఎంతో గౌరవమని, అంతకు మించి తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని భాగ్యశ్రీ పేర్కొన్నారు.
అంత క్లారిటీగా ఇద్దరూ చెప్పినా కూడా.. నెట్టింట మాత్రం రిలేషన్ షిప్ ఉందని రూమర్లు ఇంకా చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. త్వరలోనే ఇద్దరూ ప్రకటిస్తారని కొందరు నెటిజన్లు ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో పుకార్లను స్ప్రెడ్ చేస్తున్నారు. వారిద్దరి మధ్య కెమిస్ట్రీని ఉదాహరణగా చూపిస్తూ.. రూమర్లను వైరల్ చేస్తున్నారు.
నిజానికి ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ.. నవంబర్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆడియన్స్ తోపాటు విమర్శకులను సినిమా ఆకట్టుకోగా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం అనుకున్న స్థాయిలో వసూళ్లు సాధించలేదు. రీసెంట్ గా సడెన్ గా నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 తాండవం వాయిదా పడడంతో రామ్, భాగ్యశ్రీ మూవీకి మరో ఛాన్స్ వచ్చినట్లైంది.
దీంతో వారిద్దరూ సినిమా పోస్ట్ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఈవెంట్స్ లో రామ్, భాగ్యశ్రీ.. నవ్వుతూ సరదాగా కనిపించారు. ఫ్రెండ్స్ అంటే క్లోజ్ గా ఉండకూడదా.. సరదాగా ఉండకూడదా.. ఉండొచ్చు కదా.. కానీ దాన్ని బేస్ గా తీసుకుని వారి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ నిజంగా ఉందని కామెంట్లు పెడుతున్నారు. ఎన్నిసార్లు క్లారిటీ ఇస్తున్నా కూడా రూమర్స్ స్ప్రెడ్ చేస్తూనే ఉన్నారు. అవి మరెప్పుడు ఆగుతాయో వేచి చూడాలి.,