ఈవారం థియేటర్లలో సందడి చేయబోతున్న 8 చిత్రాలివే!

ప్రతి వారం థియేటర్లలో సందడి చేయడానికి ఎన్నో చిత్రాలు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.;

Update: 2025-12-08 07:46 GMT

ప్రతి వారం థియేటర్లలో సందడి చేయడానికి ఎన్నో చిత్రాలు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సెలవులను, పండుగ దినాలను దృష్టిలో పెట్టుకొని ఆయా చిత్ర నిర్మాతలు తమ సినిమాలను రిలీజ్ చేయడానికి సిద్ధమవుతూ ఉంటారు. ఇక పెద్ద సినిమాలైతే ఎక్కువగా ఫెస్టివల్స్ ను టార్గెట్గా చేసుకొని రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు మరికొన్ని రోజుల్లో క్రిస్మస్ పండుగ రాబోతోంది. ఆ సెలవులను దృష్టిలో పెట్టుకొని కొన్ని సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు ఈ వారం కూడా థియేటర్లలో సందడి చేయడానికి కొన్ని చిత్రాలు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా రెండవ శనివారం, ఆదివారం హాలిడే కావడంతో ఈ రెండు దినాలను క్యాష్ చేసుకోవడానికి కొన్ని చిత్రాలు సిద్ధమవుతున్నాయి. మరి ఈ వారం థియేటర్లలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్న ఆ చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

అన్నగారు వస్తారు..

నలన్ కుమారస్వామి దర్శకత్వంలో కార్తీ హీరోగా , కృతి శెట్టి హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం అన్నగారు వస్తారు. ఈ చిత్రం తమిళంలో వా వాతియార్ పేరుతో విడుదల కాబోతోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రం డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

సైక్ సిద్ధార్థ..

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న సైక్ సిద్ధార్థ మూవీ డిసెంబర్ 12న ప్రేక్షకులు ముందుకు రానుంది. స్పిరిట్ మీడియా, నందు నెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్లపై శ్యాం సుందర్ రెడ్డి తుడి, శ్రీ నందు నిర్మించిన ఈ చిత్రానికి వరుణ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. నందు, యామిని భాస్కర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మోగ్లీ 2025..

రోషన్ కనకాల, సాక్షి సాగర్ మడోల్కర్ కాంబినేషన్లో సందీప్ రాజు తెరకెక్కిస్తున్న చిత్రం మొగ్లీ 2025. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 12న థియేటర్లలో విడుదల కాబోతోంది. టీజీ విశ్వప్రసాద్ , కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఘంటసాల ది గ్రేట్..

లెజెండ్రీ సింగర్ ఘంటసాల వెంకటేశ్వరరావు జీవిత కథ ఆధారంగా రూపొందిన బయోపిక్ ఘంటసాల ది గ్రేట్. సింగర్ కృష్ణ చైతన్య టైటిల్ రోల్ ప్లే చేయగా.. గంటసాల భార్య సావిత్రి పాత్రలో కృష్ణ చైతన్య భార్య మృదుల నటించారు. సిహెచ్ రామారావు దర్శకత్వంలో సిహెచ్ శ్రీమతి ఫణి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 12న థియేటర్లలో విడుదల కాబోతోంది.

ఈషా..

హారర్ థ్రిల్లర్ జానర్ లో కే.ఎల్. దామోదర ప్రసాద్ సమర్పణలో హెచ్ వి ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై హేమా వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రానికి శ్రీనివాస్ మన్నే దర్శకత్వం వహించారు. త్రిగున్, అఖిల్ రాజ్ ,హెబ్బా పటేల్ , సిరి హనుమంతు ప్రధాన పాత్రల్లో వస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 12న విడుదల కాబోతోంది. బన్నీ వాస్ వర్క్ బ్యానర్స్, వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై వంశీ నందిపాటి , బన్నీ వాస్ థియేటర్ రిలీజ్ చేయబోతున్నారు..

మిస్ టీరియస్..

నాగభూషణం మనవడు అబిద్ భూషణ్ హీరోగా.. మేఘన రాజ్, ప్రియా కపూర్ ప్రధాన పాత్రల్లో రాబోతున్న చిత్రం మిస్టీరియస్. మహి కోమటిరెడ్డి దర్శకత్వంలో వస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. డిసెంబర్ 12న విడుదల కాబోతోంది.

నా తెలుగోడు..

హరినాథ్ పోలిచర్ల హీరోగా నటించి , దర్శకత్వం తో పాటు నిర్మిస్తున్న చిత్రం నా తెలుగోడు. డిసెంబర్ 12న విడుదల కాబోతోంది.

ఇట్స్ ఓకె గురూ..

సాయి చరణ్ , ఉషశ్రీ జంటగా వస్తున్న చిత్రం ఇట్స్ ఓకే గురు మణికంఠ దర్శకత్వం వహిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. సుధాకర్ కోమకూల కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 12న విడుదల కానుంది.

Tags:    

Similar News