వారణాసి గ్లింప్స్ పై సూపర్ హిట్ డైరెక్టర్ కామెంట్..!
సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న వారణాసి సినిమా గ్లింప్స్ తోనే సెన్సేషన్ సృష్టించింది.;
సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న వారణాసి సినిమా గ్లింప్స్ తోనే సెన్సేషన్ సృష్టించింది. సినిమా గురించి చిన్న హింట్ ఇస్తూ జక్కన్న చేసిన ప్లానింగ్ అంతా ఇంతా కాదు. రామోజీ ఫిల్మ్ సిటీ అంతా సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో నిండిపోయేలా ఈవెంట్ ని గ్రాండ్ సక్సెస్ చేశారు. ఐతే మహేష్ వారణాసి గ్లింప్స్ పై ఇప్పటికే చాలామంది డైరెక్టర్స్ రెస్పాండ్ అవ్వగా లేటెస్ట్ గా సక్సెస్ మిషన్ అనిల్ రావిపూడి కూడా తన రెస్పాన్స్ చెప్పారు.
ప్రతి షాట్ షాక్ అయ్యేలా..
వారణాసి గ్లింప్స్ చూసిన తర్వాత మహేష్ కి కాల్ చేసి చాలాసేపు మాట్లాడానని అన్నారు అనిల్ రావిపూడి. గ్లింప్స్ అంత భారీగా ఉంటుందని తాను ఊహించలేదని అన్నారు. వారణాసి గ్లింప్స్ లో ప్రతి షాట్ తనను షాక్ అయ్యేలా చేసిందని అన్నారు అనిల్ రావిపూడి. ప్రతి ఫ్రెం ట్రైం ట్రావెలర్ గా అనిపించిందని.. రాజమౌళి నుంచి మరో అద్భుతమైన ప్రాజెక్ట్ వస్తుందని గ్లింప్స్ చూశాక అర్ధమైందని అనిల్ రావిపూడి అన్నారు.
రాజమౌళి ఈ సినిమా మొదలు పెట్టి ఏడాది అవుతున్నా సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదని ఫ్యాన్స్ కాస్త అప్సెట్ అయ్యారు. కానీ నవంబర్ 15న గ్లోబ్ త్రొట్టర్ ఈవెంట్ గా వారణాసి టైటిల్ రివీల్ ఇంకా గ్లింప్స్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ ని ఖుషి చేశారు. ఈ ఈవెంట్ కోసం ఫ్యాన్స్ అందరికీ పాస్ పోర్ట్ అందించారు. ఆ రోజంతా కూడా సూపర్ ఫ్యాన్స్ ఒక రేంజ్ లో హంగామా చేశారు. ఇక టైటిల్ గ్లింప్స్ తో సినిమాపై మరింత అంచనాలు పెంచుకున్నారు ఫ్యాన్స్.
ఇంటర్నేషనల్ వైడ్ రిలీజ్..
రాజమౌళి వారణాసి సినిమా 2027 సమ్మర్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. రాజమౌళి సినిమా కాబట్టి అది చెప్పిన డేట్ కి వస్తుందని చెప్పడం కష్టం. ఈసారి వారణాసి సినిమాను ఇంటర్నేషనల్ వైడ్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు జక్కన్న. అంతేలాదు ఆర్.ఆర్.ఆర్ కేవలం సాంగ్ ఒక్కటే ఆస్కార్ తెచ్చుకోగా వారణాసి సినిమా అన్ని విభాగాల్లో నామినేట్ అయ్యేలా టార్గెట్ చేస్తున్నారు.
వారణాసి సినిమాలో మహేష్ సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ కుమారన్ కుంభ రోల్ లో నటిస్తున్నారు. వారణాసి సినిమాకు కీరవాణి మ్యూజిక్ మరో హైలెట్ కానుంది. ఈ సినిమా గ్లింప్స్ లోనే తెర మీద రుద్ర పాత్రలో మహేష్ బాబు నటనకు బిజిఎం కూడా నెక్స్ట్ లెవెల్ అందించారు కీరవాణి. అంతేకాదు సినిమా నుంచి రిలీజైన సంచారి సాంగ్ సూపర్ హిట్ కాగా కుంభ సాంగ్ కూడా ట్రెండింగ్ లో ఉంది.