డీసెంట్ ఓపెనింగ్స్ తో టాప్ 6 లో...!
తాజాగా బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన రణవీర్ సింగ్ దురంధర్ సినిమా విషయంలో అదే జరిగింది.;
బాలీవుడ్ సినిమాలకు నార్త్ ఇండియాలో ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ నమోదు కావడం లేదు, వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన స్టార్ హీరోల సినిమాలు సైతం మినిమం ఓపెనింగ్స్ రాబట్ట లేకపోవడం ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం. అయితే అవే సినిమాలు ఓవర్సీస్ లో ముఖ్యంగా అమెరికా వంటి దేశాల్లో మంచి కలెక్షన్స్ రాబట్టడం, ముఖ్యంగా ఓపెనింగ్ విషయంలో సాలిడ్ నెంబర్స్ ని దక్కించుకోవడం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన వార్ 2 సినిమా డిజాస్టర్ గా నిలిచింది. కానీ ఓవర్సీస్ మార్కెట్లో మొదటి రోజే ఏకంగా 2.42 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ రాబట్టి 2025 టాప్ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన కలెక్షన్స్ విషయాన్ని పక్కన పెడితే ఓపెనింగ్ విషయంలో వార్ 2 సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిందని బాక్సాఫీస్ వర్గాల వారు మాట్లాడుతున్నారు. ఇంకా సల్మాన్ ఖాన్ సికిందర్ సినిమా కూడా ఓవర్సీస్ లో ఓపెనింగ్ డే అత్యధిక కలెక్షన్స్ ని రాబట్టడం ద్వారా డీసెంట్ నెంబర్స్ ని నమోదు చేయగలిగింది.
బాలీవుడ్ నుండి దురంధర్
తాజాగా బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన రణవీర్ సింగ్ దురంధర్ సినిమా విషయంలో అదే జరిగింది. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది, కొందరు బాహాటంగానే సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఎక్కువ అయ్యాయి అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు సినిమా నిడివి ఎక్కువగా ఉంది అంటూ విమర్శలు చేస్తున్నారు. సినిమాకు నెగిటివ్ రివ్యూ లతో పాటు కొందరు పాజిటివ్ రివ్యూలు కూడా ఇస్తున్నారు. ఈ స్పై థ్రిల్లర్ విషయంలో రకరకాల ప్రచారం జరిగింది అయినా కూడా మొదటి రోజు ఓవర్సీస్ మార్కెట్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ నమోదు చేసి టాప్ 10 లో చేరింది. ఈ సంవత్సరం అత్యధిక డే 1 కలెక్షన్స్ నమోదు చేసిన సినిమాల జాబితాలో ఈ సినిమా నిలవడంతో పాటు డిస్ట్రిబ్యూటర్లకు ఊరట కలిగించే నెంబర్స్ ని నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సినిమాకు సంబంధించి కలెక్షన్స్ నిలకడగా వస్తున్నట్లు బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.
రణవీర్ సింగ్ హీరోగా..
రణవీర్ సింగ్ దూరంధర్ సినిమా మొదటి రోజు ఓవర్సీస్ మార్కెట్లో దాదాపుగా 8 లక్షల డాలర్లను రాబట్టింది. ఇప్పటికే ఆ నెంబర్ మిలియన్ మార్క్ క్రాస్ చేసింది. ఈ సంవత్సరం బాలీవుడ్ సినిమాల్లో మిలియన్ మార్క్ కలెక్షన్స్ క్రాస్ చేసిన సినిమాలు చాలా తక్కువగా ఉన్నాయి, అందులో ఈ సినిమా నిలబడడం విశేషం. ఇక ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఇప్పటికే 100 కోట్ల రూపాయల క్లబ్ లో చేరింది. మొదటి మూడు రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా 103 కోట్లను రాబట్టిందని బాలీవుడ్ బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. మొదటి రోజు 28 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసిన ఈ సినిమా మూడవ రోజు అంటే ఆదివారం ఏకంగా 43 కోట్ల రూపాయలను రాబట్టిందని తెలుస్తోంది. నేటి నుండి ఈ సినిమా పరిస్థితి ఎలా ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చస్తున్నారు. వీక్ డేస్ లో కూడా సినిమా ఆడితే తప్పకుండా ఈ సినిమా హిట్ చిత్రాల జాబితాలో చేరడం ఖాయం.
బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్...
రణవీర్ సింగ్ కెరియర్ లోనే అత్యంత ఖరీదైన సినిమాగా ఈ సినిమాను మొదటి నుండి ప్రచారం చేస్తూ వచ్చారు. ఆదిత్యధర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు మొదట ఒక సైనికుడి జీవిత చరిత్ర అంటూ ప్రచారం జరిగింది, కానీ దర్శకుడు ఆదిత్య ధర్ అవన్నీ పుకార్లే అని.. ఎవరి జీవిత చరిత్ర ఆధారంగానూ ఈ సినిమా తీయడం లేదని క్లారిటీ ఇచ్చాడు. దాంతో సినిమా గురించి చర్చ మొదలైంది. ఆయన ఇది బయోపిక్ కాదు అంటూ చెప్పినప్పటికీ సదరు వ్యక్తికి సంబంధించిన కొన్ని విషయాలను ఈ సినిమాలో చూపించే అవకాశం ఉందని ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమా చూసిన తర్వాత ఇది ఒక రా ఏజెంట్ కదా అని అర్థమైంది. ఈ మధ్యకాలంలో వచ్చిన స్పై థ్రిల్లర్ లకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉందంటూ ఆ జోనర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. కొందరు మాత్రం ఈ సినిమా నిడివి ఎక్కువగా ఉందని యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయని కంప్లైంట్ ఇస్తున్నారు. ఈ సినిమా లాంగ్ రన్ లో ఎలా ఉంటుందా అనేది చూడాలి.