లెక్చరర్ తో హీరోయిన్ స్టోరీ.. ఎగ్జామ్ పేపర్స్ లీక్

సాధారణంగా సినిమా ప్రమోషన్స్ లో నటీనటులు తమ పాత్రల గురించి లేదా షూటింగ్ విశేషాల గురించి చెబుతుంటారు.;

Update: 2025-12-08 07:57 GMT

సాధారణంగా సినిమా ప్రమోషన్స్ లో నటీనటులు తమ పాత్రల గురించి లేదా షూటింగ్ విశేషాల గురించి చెబుతుంటారు. కానీ కొన్నిసార్లు ఫ్లోలో నోరు జారి లేదా కావాలనే బోల్డ్ గా మాట్లాడి సంచలనం సృష్టిస్తుంటారు. లేటెస్ట్ గా హీరోయిన్ రాశీ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్కేఎన్ నిర్మించిన 'త్రీ రోజెస్' సీజన్ 2 వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో ఆమె పాల్గొంది.

ఈషా రెబ్బా, కుషిత కల్లపులతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న రాశీ, డిసెంబర్ 12న 'ఆహా'లో స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్ కోసం ఇంటర్వ్యూలు ఇస్తూ తన పర్సనల్ లైఫ్ సీక్రెట్ ను బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. రాశీ సింగ్ తన గతం గురించి మాట్లాడుతూ.. స్కూల్ డేస్ అయిపోయాక జస్ట్ కాలేజీలో అడుగుపెట్టిన కొత్తలోనే తనకో బాయ్ ఫ్రెండ్ ఉండేవాడని చెప్పింది. అయితే ఆ వ్యక్తి మరెవరో కాదు, స్వయంగా ఆమెకు పాఠాలు చెప్పే యంగ్ లెక్చరర్ అట.

అప్పుడు తన వయసు కేవలం 17 ఏళ్లు మాత్రమేనని, ఆ లెక్చరర్ కూడా అప్పుడు చాలా యంగ్ గా ఉండేవారని, ఇంకా పెళ్లి కాలేదని రాశీ తెలిపింది. స్టూడెంట్ లెక్చరర్ మధ్య ఫన్నీ థింగ్స్ నడిచిందనే విషయం ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశమైంది. అసలు ట్విస్ట్ ఏంటంటే.. అతని వల్ల రాశీ సింగ్ కు కాలేజీలో క్వశ్చన్ పేపర్లు ముందే చేతికి వచ్చేవట.

ఆయన స్పెషల్ గా తన కోసం పేపర్స్ లీక్ చేసేవారని ఆమె ఓపెన్ గానే ఒప్పుకుంది. ఇది విన్న SKN తో పాటు అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. అంతేకాదు, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ లో వైవా రూమ్ లోకి వెళ్తే.. ఆ లెక్చరర్ ఆమెను ఒక్క సబ్జెక్ట్ క్వశ్చన్ కూడా అడిగేవారు కాదని, కేవలం ఒక పది నిమిషాల పాటు కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ టైమ్ పాస్ చేసేవారని ఆమె నవ్వుతూ చెప్పింది.

అయితే లెక్చరర్ తో రిలేషన్ అనగానే ఇంకేదో ఊహించుకోవద్దని, తమ మధ్య అప్పుడు ఏమీ జరగలేదని రాశీ సింగ్ క్లారిటీ ఇచ్చింది. అదొక బాండ్ అని "ఏం జరగలేదు" అని ఆమె పదే పదే చెప్పడం కొసమెరుపు. ప్రస్తుతం ఆ లెక్చరర్ కు పెళ్లయిందని, విశేషం ఏంటంటే ఇప్పటికీ ఆయన తనను ఇన్ స్టాగ్రామ్ లో ఫాలో అవుతుంటారని చెప్పింది. ఇంకా విచిత్రం ఏంటంటే.. ఆయన భార్య కూడా రాశీని ఫాలో అవుతుందట. ఇక 'త్రీ రోజెస్ 2' సిరీస్ లో ఎంత బోల్డ్ కంటెంట్ ఉందో తెలియదు కానీ, ప్రమోషన్స్ లో మాత్రం రాశీ సింగ్ తన బోల్డ్ కామెంట్స్ తో హీట్ పెంచేసింది. డిసెంబర్ 12న రాబోతున్న ఈ సిరీస్ లో ఇంకెన్ని ట్విస్టులు ఉంటాయో చూడాలి.

Tags:    

Similar News