మెగాస్టార్ ఇచ్చిన లీడ్ తోనే వెంకీ రోల్!
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో `మన శంకరవరప్రసాద్ గారు` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.;
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో `మన శంకరవరప్రసాద్ గారు` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తొలుత ఈప్రాజెక్ట్ చిరం జీవితోనే మొదలైంది. అటుపై కొన్ని రోజులకు విక్టరీ వెంకటేష్ కూడా గెస్ట్ రోల్ తో భాగమవుతున్నట్లు ప్రకటనొచ్చింది. సాధారణంగా అతిధి పాత్ర అంటే? కొన్ని నిమిషాలకే పరిమితవుతుంది. కీలకమైన సన్నివేశంతో గెస్ట్ రోల్ ఎంట్రీ ఉంటుంది. ఆ సీన్ పూర్తికాగానే ఆ రోల్ పూర్తవుతుంది. బేసిక్ గా ఇలాంటి ఛాన్స్ తీసుకునేది దర్శకుడు మాత్రమే. హీరోలు కల్పించుకోరు.
ఆటతో పాటు పాట కూడా:
ఫలానా హీరోని తీసుకుందామని? దర్శకుడు సూచిస్తే? అందుకు హీరో ఒకే చెప్పి ముందుకెళ్లడం..లేదంటే? హీరో సజ్జెస్ట్ చేసిన నటుడ్ని తీసుకోవడం జరుగు తుంది. `శంకరవరప్రసాద్` విషయంలో చిరంజీవే ఆ బాధ్యత తీసుకున్నట్లు తాజాగా అనీల్ మాటల్లో బయట పడింది. సినిమాలో వెంకటేష్ ని భాగం చేస్తే బాగుంటుందనే ఐడియా ఇచ్చింది చిరంజీవినే. ఆయన ఇచ్చిన లీడ్ ను ఆధారంగా చేసుకునే అనీల్ ఆ పాత్రను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. కీలకమైన సన్నివేశం తో పాటు, చిరు-వెంకటేష్ కలిసి ఓ పాటకు డాన్స్ కూడా చేస్తున్నారు.
కామెడీలో టైమింగ్ ఉన్న నటులు:
ఇద్దరి మధ్య ఆ పాట చిత్రీకరణ కూడా పూర్తయింది. అయితే ఇంత వరకూ వెంకీ పాత్ర నిడివిపై మాత్రం సరైన స్పష్టత లేదు. చిరంజీవి లీడ్ ఇచ్చినా? అనీల్ ఆ పాత్రను ఏ మేర హైలైట్ చేస్తున్నాడే చర్చ ఫిలిం మీడియాలో పరిపాటే అయింది. తాజాగా ఆ విషయంపై కూడా క్లారిటీ వచ్చేసింది. సినిమాలో వెంకటేష్ పాత్ర 20 నిమిషాల పాటు ఉంటుందని అనీల్ ధృవీకరించాడు. చిరంజీవి - వెంకటేష్ మధ్య వచ్చే క్లైమాక్స్ సన్నివేశాలు వినోదభరితంగా మలిచినట్లు తెలిపారు. కామెడీలో ఇద్దరు మంచి టైమింగ్ నటులే. కానీ చిరు కన్నా వెంకీ ఓ మెట్టు పైనే ఉంటారు. వెంకీపై కామెడీ ఇమేజ్ కూడా ఉంది.
వాళ్లిద్దరితో నయన్ కూడా జతైన వేళ:
విషయంలో వెంకీ ఎంత షార్ప్ అన్నది అనీల్ కు బాగా తెలుసు. గతంలో ఇద్దరి కాంబినేషన్ లో `ఎఫ్ 2` రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అందులో వెంకీ కామెడీ ఆద్యంతం నవ్విస్తుంది. ఇప్పుడా ద్వయానికి చిరు కూడా తోడ య్యారంటే కామెడీ పీక్స్ లోనే ఉంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. సినిమాలో నయన తార హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. నయన్ కూడా అవసరం మేర వినోద పాత్రలతో మెప్పించగల నటే. మరి ఆ త్రయంతో? అనీల్ హాస్యాన్ని ఏ స్థాయింలో పండిస్తాడో చూడాలి. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. రెండు లిరికల్ సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. త్వరలో టీజర్..ట్రైలర్ కూడా రిలీజ్ అవుతాయి. చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.