కండిష‌న్స్ అప్ల‌య్ అన‌డంతో హీరో-హీరోయిన్ బ్రేక‌ప్

1990ల‌లో ఖిలాడీ అక్ష‌య్ కుమార్ - శిల్పాశెట్టి జంట ప్రేమాయ‌ణం నిరంత‌రం మీడియా హెడ్ లైన్స్ లో నిలిచేది.;

Update: 2025-12-08 08:30 GMT

గ్లామ‌ర్ ప‌రిశ్ర‌మ‌లో చిత్ర‌విచిత్రాలు చోటు చేసుకుంటాయి. ఈ రంగంలో ల‌వ్ - డేటింగ్ వ్య‌వ‌హారాలు, ఆపై బ్రేక‌ప్ క‌థ‌లు రెగ్యుల‌ర్ గా వింటూనే ఉంటాము. చ‌ద‌రంగంలో పావులు ఎట్నుంచి ఎటు క‌దులుతాయో ముందే ఎలా ఊహించ‌లేమో ...ఈ రంగంలో ఏ ఎఫైర్ క‌థ‌ ఎట్నుంచి ఎటు వెళుతుందో కూడా ఎవ‌రూ ఊహించ‌లేరు.

1990ల‌లో ఖిలాడీ అక్ష‌య్ కుమార్ - శిల్పాశెట్టి జంట ప్రేమాయ‌ణం నిరంత‌రం మీడియా హెడ్ లైన్స్ లో నిలిచేది. ఈ జంట తొంద‌ర్లోనే పెళ్లితో ఓ ఇంటివాళ్లు అవుతున్నార‌ని కూడా హిందీ మీడియాలో క‌థ‌నాలొచ్చాయి. కొన్ని మీడియాలు అప్ప‌టికే పెళ్ల‌యిపోయింద‌ని కూడా క‌థ‌లు అల్లాయి. అయితే చివ‌రికి అక్ష‌య్ కుమార్ తో శిల్పాశెట్టి ల‌వ్ బ్రేక్ అయింది. అత‌డు మ‌రో హీరోయిన్ ట్వింకిల్ ఖ‌న్నాను పెళ్లాడ‌గా, శిల్పా శెట్టి ది గ్రేట్ బిజినెస్ మేన్, బాంబే డైయింగ్ య‌జ‌మాని అయిన రాజ్ కుంద్రాను పెళ్లాడారు. ఎవ‌రి లైఫ్ లో వారు సెటిల‌య్యారు.

అయితే శిల్పా శెట్టితో అక్ష‌య్ పెళ్లి జ‌ర‌గ‌క‌పోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఏమిటి? అంటే..... త‌న కుమార్తె ర‌క్ష‌ణ కోసం ఏంటి భ‌రోసా? అంటూ ఆ రోజుల్లోనే శిల్పా శెట్టి త‌ల్లిగారు బాగా ఇన్వాల్వ్ అయ్యార‌ట‌. త‌మ‌ కుమార్తెను పెళ్లాడాలంటే కండిష‌న్స్ అప్ల‌య్ అనడంతో అక్ష‌య్ కి చిర్రెత్తుకొచ్చి వెంట‌నే బ్రేక‌ప్ అయిపోయాడ‌ని కూడా క‌థ‌నాలొచ్చాయి. ఆ ర‌కంగా శిల్పా శెట్టి ఒక గొప్ప అవ‌కాశాన్ని కోల్పోయింది. ఆ త‌ర్వాత అక్ష‌య్ ని డీప్ గా ల‌వ్ చేసిన ట్వింకిల్ ఖ‌న్నా ఇంట్లో వాళ్ల‌ను ఒప్పించి పెళ్లాడేసింది.

ఈ పాత విష‌యాల‌న్నిటినీ ద‌ర్శ‌క‌నిర్మాత‌ సునీల్ దర్శన్ తాజా పాడ్ కాస్ట్ లో వెల్లడించారు. 2001లోనే ట్వింకిల్ ఖన్నాతో అక్షయ్ కుమార్ పెళ్లి జ‌రుగుతుంద‌ని ఒక జ్యోతిష్కుడు అంచనా వేశాడు. శిల్పాశెట్టి నుంచి విడిపోయిన తర్వాత అక్షయ్ పూర్తిగా త‌న న‌ట‌నా కెరీర్ పై దృష్టి సారించాడు. ధడ్కన్, హేరా ఫేరీ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌లో న‌టించిన అక్షయ్ తిరిగి కంబ్యాక్ అయ్యాడు. శిల్పా శెట్టితో అక్కీ ప్రేమాయ‌ణం, బ్రేక‌ప్ గురించి సునీల్ ద‌ర్శ‌న్ ఇప్పుడు మ‌రోసారి స్ప‌ష్ఠంగా వివ‌రాల్ని అందించారు.

అక్ష‌య్ - శిల్పా త‌మ జీవితాల‌లో ఒక‌టి అనుకుంటే, విధి ఇంకొక‌టి నిర్ణ‌యించింద‌ని ద‌ర్శ‌న్ అన్నారు. శిల్పా శెట్టి త‌ల్లి దండ్రులు `కండిష‌న్స్ అప్ల‌య్` అనడంతోనే ఈ జంట బ్రేక‌ప్ అయింద‌ని చెప్పారు. వారు మంచి అంద‌మైన జంట‌.. కానీ విధి వేరొక‌టి నిర్ణ‌యించింది! అని సునీల్ అన్నారు. ట్వింకిల్ ప్ర‌ముఖ న‌టుడు రాజేష్ ఖ‌న్నా కుమార్తె. సీనియ‌ర్ హీరోకు అత్యంత స‌న్నిహితుడైన ఒక జ్యోతిష్కుడు అక్షయ్ - ట్వింకిల్ ఏదో ఒక రోజు వివాహం చేసుకుంటారని జోశ్యం చెప్పాడు. కానీ అప్ప‌ట్లో నేను దానిని ప‌ట్టించుకోలేద‌ని సునీల్ ద‌ర్శ‌న్ అన్నారు. శిల్పా శెట్టి త‌ల్లిదండ్రులు ఆ రోజు ఆ కండిష‌న్లు పెట్ట‌క‌పోయి ఉంటే ఆమె జీవితం వేరొక మ‌లుపు తీసుకునేది అని కూడా అన్నారు. తల్లిదండ్రులకు వారి కుమార్తె భద్రత ఎంత‌ అవసరమో ఆలోచించడం తప్పు కాదు... కానీ విధి వేరొక విధంగా ఉంద‌ని అన్నారు.

అయితే అక్ష‌య్ కుమార్ కెరీర్ అంతంత మాత్రంగా ఉండ‌టంతో శిల్పా శెట్టి త‌ల్లిదండ్రులు ఆర్థిక భ‌ద్ర‌త గురించి ఎక్కువ‌గా ఆలోచించి ఉంటార‌ని కూడా ద‌ర్శ‌న్ అన్నారు. అయితే శిల్పా శెట్టి నుంచి విడిపోయాక అక్ష‌య్ వ‌రుస ప్రాజెక్టుల‌తో బిజీ అయిపోయాడు. `ఏక్ రిష్టా` చిత్రీకరణకు కొద్దిరోజుల‌ ముందు శిల్పా-అక్కీ విడిపోయార‌ని ద‌ర్శ‌న్ చెప్పారు. అయితే బ్రేక‌ప్ వ‌ల్ల అక్షయ్ గుండె పగిలిపోయిందా? అని ప్ర‌శ్నించ‌గా, అలాంటిదేమీ లేదు.. అత‌డు పూర్తిగా కెరీర్ పై దృష్టి సారించాడ‌ని కూడా సునీల్ అన్నారు. అదే సమయంలో ధడ్కన్, హేరా ఫేరి, ఏక్ రిష్ట వంటి వ‌రుస చిత్రాలతో అత‌డు బిజీ అయ్యాడు.

2001లో అక్షయ్ కుమార్ ట్వింకిల్ ఖన్నాను పెళ్లాడాడు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారంతా పెరిగి పెద్ద‌వాళ్ల‌వుతున్నారు. 2009లో శిల్పా శెట్టి రాజ్ కుంద్రాను వివాహ‌మాడారు. ఆ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వారి జీవితాలు య‌థావిథిగా ముందుకు సాగుతున్నాయి.

Tags:    

Similar News