మేడ్ ఇన్ కొరియా.. 'నాగ్ 100'పై డౌట్స్?

కానీ మేడ్ ఇన్ ఇండియా చూసిన తర్వాత.. ఆ కాంబినేషన్‌ పై అక్కినేని అభిమానుల్లో అనుమానాలు మొదలయ్యాయి.;

Update: 2026-03-17 16:30 GMT

టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఇటీవల చర్చనీయాంశంగా మారిన చిత్రం మేడ్ ఇన్ కొరియా. ఆ సినిమాకు ఆడియన్స్ నుంచి మిక్స్ డ్ రెస్పాన్స్ వస్తుండటంతో.. మూవీ దర్శకుడు రా కార్తిక్‌ పై అందరి దృష్టి పడింది. ముఖ్యంగా కింగ్ నాగార్జున అభిమానుల్లో మాత్రం ఆ సినిమా తర్వాత కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎందుకంటే నాగ్ ల్యాండ్ మార్క్ 100వ మూవీని రా కార్తిక్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

అయితే మేడ్ ఇన్ కొరియా మూవీలో ఎమోషన్స్ ఉన్నప్పటికీ.. అవి డీప్ గా కాకుండా పైపైనే చూపించారని విమర్శలు వినిపిస్తున్నాయి. స్టోరీలోని ఫీలింగ్స్ ప్రేక్షకులకు చేరే విధంగా ఉన్నా.. చాలా చోట్ల నేచురాలిటీ మిస్ అయిందని పలువురు సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని సీన్స్ రియల్ లైఫ్ కు దగ్గరగా లేవని అంటున్నారు.

అలా మేడ్ ఇన్ కొరియా మూవీతో ఒక్కసారిగా కార్తిక్ పేరు ట్రెండింగ్ లోకి వచ్చింది. ఆయన టేకింగ్, కథ చెప్పే విధానం కొంత మంది ఆడియన్స్ ను ఆకట్టుకోగా, మరికొందరిని మెప్పించలేకపోయింది. అందుకే ఆ సినిమాకు హిట్ లేదా ఫ్లాప్ అనే క్లియర్ టాక్ రావడం లేదు. ఒక విధంగా చెప్పాలంటే.. ఇది మీడియం రెస్పాన్స్ అందుకున్న మూవీ అని చెప్పాలి.

అదే సమయంలో నాగ్ తో ఇప్పుడు రా కార్తిక్ వర్క్ చేస్తున్నారు. యూనిక్‌ స్టోరీ టెల్లింగ్‌, థ్రిల్లింగ్ కథనాలతో తనదైన మార్క్‌ చూపించే రా కార్తిక్‌ నాగార్జున కెరీర్‌ మైల్‌ స్టోన్ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఆ క్రేజీ డైరెక్టర్ నాగ్‌ కోసం ఎలాంటి కథను సిద్ధం చేశారోనని ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటున్నారు.

కానీ మేడ్ ఇన్ ఇండియా చూసిన తర్వాత.. ఆ కాంబినేషన్‌ పై అక్కినేని అభిమానుల్లో అనుమానాలు మొదలయ్యాయి. నాగార్జున కోసం రా కార్తిక్ ఎలాంటి కథను తీసుకువస్తారో.. అది ఆయన కెరీర్‌ లో మైల్ స్టోన్ గా నిలుస్తుందో లేదో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నాగార్జున లాంటి సీనియర్ స్టార్‌ కు 100వ సినిమా చాలా కీలకం. ఆ మూవీ స్టోరీ, డైరెక్షన్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ ది బెస్ట్ గా ఉండాలని అభిమానులు ఆశిస్తున్నారు.

ఇప్పుడు మేడ్ ఇన్ కొరియా మూవీకి వచ్చిన మిక్స్ డ్ రెస్పాన్స్ కారణంగా.. ఆ ప్రాజెక్ట్‌ పై అభిమానులు పూర్తి నమ్మకం పెట్టుకోవడంలో కొంత ఆలోచిస్తున్నట్లు కనిపిస్తున్నారు. మరికొందరు మాత్రం రా కార్తిక్‌ టాలెంట్‌ ను నమ్ముతున్నట్లు చెబుతున్నారు. సరైన కథ, స్ట్రాంగ్ స్క్రీన్‌ ప్లేతో వస్తే.. నాగార్జున 100వ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టే స్టామినా ఆయనకు ఉందని భావిస్తున్నారు.

దర్శకుడికి ఇది ఒక పెద్ద అవకాశమని, దీన్ని యూజ్ చేసుకుంటే మరింత గుర్తింపు వస్తుందని అంటున్నారు. ఏదేమైనా మేడ్ ఇన్ కొరియా సినిమా రా కార్తిక్‌ కు మిక్స్ డ్ రిజల్ట్ తెచ్చిపెట్టింది. అదే సమయంలో నాగార్జున 100వ సినిమా ప్రాజెక్ట్‌ పై ఆసక్తితో పాటు సందేహాలు కూడా పెంచింది. మరి ఆ కాంబినేషన్ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో తెలుసుకోవాలంటే మరికొద్ది రోజుల పాటు వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News