ఆలియా వయసెంతో తెలుసా? ఒక సినిమాకి వసూల్ ఎంత?
ఈ వెరీ స్పెషల్ డేని ఆలియా ఎలా గడిపింది అంటే.. ఈ రోజును తన భర్త రణబీర్ కపూర్, ముద్దుల కూతురు రాహా కపూర్, సోదరి షాహీన్ భట్‌లతో కలిసి హాంకాంగ్ వంటి ఖరీదైన విదేశీ నగరంలో ఘనంగా ఎంజాయ్ చేశారు;
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ మార్చి 15న తన 33వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ వెరీ స్పెషల్ డేని ఆలియా ఎలా గడిపింది అంటే.. ఈ రోజును తన భర్త రణబీర్ కపూర్, ముద్దుల కూతురు రాహా కపూర్, సోదరి షాహీన్ భట్‌లతో కలిసి హాంకాంగ్ వంటి ఖరీదైన విదేశీ నగరంలో ఘనంగా ఎంజాయ్ చేశారు. పుట్టినరోజు వేడుకలు ముగించుకుని ఇప్పటికే ఆలియా-రణ్ వీర్ జోడీ ముంబై విమానాశ్రయానికి చేరుకున్న ఫోటోలు వైరల్ అయ్యాయి.
ఆర్.ఆర్.ఆర్ తో టాలీవుడ్ లోను అడుగుపెట్టిన ఆలియా జీవిత ప్రయాణం ఇటీవల రకరకాల టర్నులు తిరుగుతోంది. ప్రస్తుతం ఒక బిడ్డకు మమ్మీగా ఉన్నా... వ్యాపారాలు నిర్వహించడంలో ఆలియా తర్వాతే ఎవరైనా! అనడంలో సందేహం లేదు. ఆలియా భట్ కేవలం వెండితెరపైనే కాదు.. వ్యాపార రంగంలోనూ తన తెలివితేటలను ప్రదర్శిస్తున్నారు. ప్రతి పుట్టినరోజున ఈభామ ఏదో ఒక కొత్త అడుగు వేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. గతంలో `ఎడ్ మా మమ్మా` వంటి కిడ్స్ వేర్ బ్రాండ్‌తో సక్సెస్ సాధించిన ఆలియా తన ప్రొడక్షన్ హౌస్ `ఎటర్నల్ సన్‌షైన్`లో డార్లింగ్స్, జిగ్రా వంటి వైవిధ్యమైన చిత్రాలను నిర్మించారు. కేవలం నటనకే పరిమితం కాకుండా.. లాభసాటి వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతూ విభిన్న రంగాల్లో రాణిస్తున్నారు.
ఇలాంటి సమయంలో ఈ ఏడాది తన బర్త్‌డేను మరింత స్పెషల్‌గా మార్చుకుంటూ ఆలియా ఒక కొత్త ప్రొడక్షన్ లేబుల్‌ను ప్రారంభించారు. మా ప్రొడక్షన్ హౌస్ `ఎటర్నల్ సన్‌షైన్`కి ఒక బేబీ పుట్టింది.. అదే ఎటర్నల్ కిడ్స్! అంటూ సోషల్ మీడియాలో దీనిని ప్రకటించారు. ఈ లేబుల్ కింద ప్రత్యేకంగా పిల్లల కోసం.. యువత కోసం సినిమాలను, వెబ్ సిరీస్‌లను నిర్మించనున్నారు. ఇప్పటికే మూడు ఆసక్తికరమైన ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయని, అందులో అమెజాన్ ప్రైమ్ కోసం ఒక యంగ్ అడల్ట్ వెబ్ సిరీస్ కూడా ఉందని ఆలియా వెల్లడించారు.
ముఖ్యంగా నేటి తరం యువత ఆలోచనలను, వారి సంబంధాలను ప్రతిబింబించేలా కాలేజ్ నేపథ్యంలో ఒక స్లైస్-ఆఫ్-లైఫ్ సిరీస్‌ను ఆలియా ప్లాన్ చేస్తున్నారు. దీని కోసం నిజమైన 20 ఏళ్ల యువతీ యువకులను కాస్టింగ్ చేయబోతున్నట్లు ఆలియా తెలిపారు. భర్త రణబీర్‌తో కలిసి వ్యాపార నిర్ణయాలు తీసుకోవడంలో భట్ అమ్మాయి ఎంతో పరిణతిని చూపిస్తున్నారు. వచ్చే పుట్టినరోజు నాటికి ఆలియా ఇంకెన్ని కొత్త ఆవిష్కరణలు చేస్తుందోనని ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా చర్చిస్తున్నాయి.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ఆలియా చేతిలో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, విక్కీ కౌశల్ తో కలిసి `లవ్ అండ్ వార్` చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం రూ 12 కోట్ల నుంచి 15 కోట్లు వసూలు చేస్తోందని సమాచారం. అలాగే యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై థ్రిల్లర్ `ఆల్ఫా`లో శర్వరీతో కలిసి పవర్ ఫుల్ యాక్షన్ రోల్ లో కనిపించనుంది. ఈ చిత్రం జూలై 10న విడుదల కానుంది. అటు కెరీర్, ఇటు బిజినెస్.. మరోవైపు పర్సనల్ లైఫ్‌ను ఆలియా బ్యాలెన్స్ చేస్తున్న తీరు నిజంగా స్ఫూర్తిదాయకం.