గ్రీకు సుంద‌రిని త‌ల‌పిస్తున్న ప‌టౌడీ ‌వార‌సురాలు

Update: 2021-03-18 02:30 GMT
బాలీవుడ్ లో అసాధార‌ణంగా కెరీర్ ని మ‌లుచుకుంటున్న యువ‌ క‌థానాయిక‌గా సారా అలీఖాన్ పేరు మార్మోగుతోంది. ప‌టౌడీ ఖాన్ సైఫ్ అలీఖాన్ న‌ట‌వార‌సురాలిగా తెర‌కు ప‌రిచ‌య‌మైనా త‌నదైన అందం ప్ర‌తిభ తో దూసుకెళుతున్న ఈ యంగ్ బ్యూటీ ఇటీవ‌లే కూలీనంబ‌ర్ 1 చిత్రంలో అద్భుత‌మైన డ్యాన్సుల‌తోనూ ఆక‌ట్టుకుంది.

ఇక సోష‌ల్ మీడియాల్లో సారా వ‌రుస‌ ఫోటోషూట్లు వెబ్ లో అంతే వైర‌ల్ గా మారుతున్నాయి. తాజాగా సారా అలీఖాన్ అద్భుత‌మైన ఫోటోషూట్ తో వెబ్ ని షేక్ చేస్తోంది. చూస్తుంటే సూర్య వంశ‌పు రాకుమారినే త‌ల‌పిస్తోంది అంటూ అభిమానులు ఫిదా అయిపోతున్నారు.

భారీ ఎంబ్రాయిడ‌రీ క్రిస్ట‌ల్ వ‌ర్క్ తో డిజైన్ చేసిన‌ డార్క్ షేడెడ్ లెహంగాలో సారా గ్రీకుసుంద‌రినే త‌ల‌పిస్తోంది. ఇక ఆ నుదుటిన పాపిడి బొట్టు.. చేతుల‌కు ఎంపిక చేసుకున్న ఆభ‌ర‌ణం ప్ర‌తిదీ త‌న అందాన్ని రెట్టింపు చేశాయి. ప్ర‌స్తుతం ఈ ఫోటో యువ‌త‌రంలో వైర‌ల్ గా మారింది.

2018 లో కేదార్ ‌నాథ్ చిత్రంతో సారా అలీఖాన్ బాలీవుడ్ ‌లో అడుగుపెట్టింది. అభిషేక్ కపూర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దివంగత సుశాంత్ సింగ్ రాజ్ ‌పుత్ క‌థానాయ‌కుడిగా నటించారు. సింబాలో ర‌ణ‌వీర్ స‌ర‌స‌న‌ సారా నాయిక‌గా న‌టించింది. లవ్ ఆజ్ కల్- కూలీ నెంబ‌ర్ వ‌న్ చిత్రాల్లోనూ సారా న‌టించింది. ప్ర‌స్తుతం అట్రాంగి రే చిత్రంలో అక్ష‌య్-ధ‌నుష్ ల‌తో క‌లిసి న‌టిస్తోంది. ఈ చిత్రానికి ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం  వ‌హిస్తున్నారు.
Tags:    

Similar News