ధావన్ కి టాటా చెప్పి ధనుష్ కి లైనేస్తోంది!
`కూలీనంబర్ 1` రీమేక్ లో నటించింది కుర్రబ్యూటీ సారా అలీఖాన్. వరుణ్ ధావన్ ఈ చిత్రంలో కథానాయకుడు. ఇటీవలే ఈ మూవీ రిలీజ్ కాగా మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. ఇందులో యంగ్ ఎనర్జిటిక్ సారా పెర్ఫామెన్సెస్ డ్యాన్సులకు.. ధావన్ బోయ్ తో రొమాన్స్ లో చెలరేగిన తీరుకు మాత్రం కుర్రకారు ఫిదా అయిపోతున్నారు.
అయితే ఓవైపు ధావన్ బోయ్ తో కలిసి తాజా మూవీ ప్రచారం అదరగొట్టేసిన సారా ఇప్పటికే ధనుష్ టీమ్ తో చేరిపోవడం ఆసక్తికరం. బ్యాక్ టు బ్యాక్ కమిట్ మెంట్లతో ఈ అమ్మడు ఎంత బిజీగా ఉందో ఈ సన్నివేశం చెబుతోంది. అక్కడ ధావన్ తో ప్రత్యక్షమై ఇప్పటికిప్పుడు ధనుష్ తో కలిసి చెలరేగుతోంది. క్రిస్మస్ సంబరాల్లో అతడితో చిలౌట్ చేసింది.
సారా అలీ ఖాన్ తో ధనుష్ క్రిస్మస్ సరదా క్షణాలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ధనుష్ తన మూడవ బాలీవుడ్ మూవీలో నటిస్తున్నాడు. రాంజానా- షమితాబ్ తర్వాత అట్రాంగి రే సెట్స్ పై ఉంది. రాంజానా ఫేం ఆనంద్ ఎల్ రాయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. `అట్రాంగి రే` బృందంతో కలిసి ధనుష్ క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. ధనుష్ తో సారా అలీ ఖాన్ సెలబ్రేషన్ ఫోటోల్ని సారా స్వయంగా షేర్ చేయగా అవి ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ అవుతున్నాయి.
ధనుష్ కోలీవుడ్ లోనే అత్యంత బిజీ హీరో. అట్రాంగి రే తో పాటు కర్ణన్ (మిత్రన్)- జగమే తంత్రం వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు. రామ్‌కుమార్.. కార్తీక్ నరేన్ లతో సినిమాలు చేస్తున్నాడు. మరెన్నో క్యూలో ఉన్నాయి.