అల్లు అర్జున్ 200 డేస్ టార్గెట్ కహానీ!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా స్టార్‌డమ్‌ని ఎంజాయ్ చేస్తుండటమే కాకుండా అదే స్థాయి సినిమాలని బ్యాక్ టు బ్యాక్ పట్టాలెక్కిస్తున్నారు.;
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా స్టార్‌డమ్‌ని ఎంజాయ్ చేస్తుండటమే కాకుండా అదే స్థాయి సినిమాలని బ్యాక్ టు బ్యాక్ పట్టాలెక్కిస్తున్నారు. `పుష్ప 2` సినిమాతో పాన్ ఇండియా స్టార్ల జాబితాలో చేరిన బన్నీ ఈ మూవీ అందించిన బ్లాక్ బస్టర్ విజయం తరువాత భారీ సినిమాలని చేస్తున్నారు. ఇప్పటికే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్‌లో హాలీవుడ్ రేంజ్‌లో `రాకా`ని చేస్తున్న విషయం తెలిసిందే. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని కళానిధి మారన్ నిరమిస్తున్నారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో బన్నీ ఈ రెండు విభిన్నమైన క్యారెక్టర్లలో నటిస్తున్నారు. అందులో ఒకటి తోడేలు తరహాలో సాగే క్యారెక్టర్ అని ఫస్ట్ లుక్ టైటిల్ రివీల్ పోస్టర్‌తో క్లారిటీ ఇచ్చేశారు. దీపిక పదుకోన్ వారియర్‌గా కనిపించనున్న ఈ మూవీలోని కీలక పాత్రల్లో రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారని ప్రచారం జరుగుతున్నా ఇప్పటి వరకు దీనిపై టీమ్ క్లారిటీ ఇవ్వలేదు. ఇదిలా ఉంటే బన్నీ తన సినిమాలకు సంబంధించిన ఓ స్ట్రిక్ట్ రూల్‌ని ఫాలో అవుతున్నారని, 200 డేస్ కండీషన్‌ని ఫాలో అవతున్నాడని నెట్టింట ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
గతంలో బన్నీ వద్దకు వెళ్లాలంటే 40కి మించిన రూల్స్ పాటించాలని, అవి పాటించకపోతే బన్నీ కోటరీని దాటి వెళ్లలేమని ఆ మధ్య ఓ వార్తల చక్కర్లు కొట్టినట్టుగానే తాజాగా బన్నీ సినిమాల విషయంలో ఓ వార్త నెట్టింట చక్కర్లుకొడుతోంది. ఇంతకీ ఆ వార్త ఏంటంటే బన్నీ తనతో సినిమాలు చేసే ఐరెక్టర్లకు కండీషన్‌లు పెడుతున్నారట. తను అంగీకరించిన సినిమా షూటింగ్‌ని 200 రోజులలో పూర్తి చేయాలని, లేదంటే డేట్స్ కంప్లీట్ అయిపోతే తను మరో ప్రాజెక్ట్‌కు వెళ్లిపోతాడట.
ప్రాజెక్ట్ ఆలస్యం అయినా, తన పాత్రకు సంబంధించిన పోర్షన్ పెండింగ్‌లో ఉన్నా పట్టించుకోకుండా తదుపరి ప్రాజెక్ట్‌కు డేట్స్ కేటాయించి షూటింగ్‌కి వెళ్లిపోతారంట. అది పూర్తయిన తరువాత ముందు సినిమా బ్యాలెన్స్ వర్క్‌ని పూర్తి చేస్తారట. బన్నీ ఉన్నట్టుండి తన దర్శకులకు 200 డేస్ టార్గెట్ పెట్టడానికి ప్రధాన కారణం తాను అనుకున్న సినిమాలని అనుకున్న టైమ్‌కు పూర్తి చేయడమేనని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. బన్నీ ప్రస్తుతం అట్లీ మూవీతో పాటు లోకేష్ కనగరాజ్ మూవీని చేస్తున్న విషయం తెలిసిందే.
దీనితో సమాంతరంగా మలయాళ నటుడు, డైరెక్టర్ బసిల్ జోసెఫ్ డైరెక్ట్ చేయనున్న మూవీని డైరెక్ట్ చేయబోతున్నాడు. దీన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించనున్నారు. బన్నీ ఉన్నట్టుండి డైరెక్టర్స్‌కి 200 డేస్ టార్గెట్ పెట్టడానికి కారణం ఒకేసారి రెండబు మూడు సినిమాలని ప్రేక్షకుల ముందుకు తీసుకురావచ్చనే ఆలోచన అని ఇన్ సైడ్ టాక్.