స్టార్ కపుల్ కు చై-సామ్ జంట క్రిస్మస్ కానుకలు
మొన్ననే మహేష్ - నమ్రత జంటకు పవన్ -అన్నా జంట క్రిస్మస్ కానుకలు పంపించిన సంగతి తెలిసిందే. ఇటు మహేష్ అటు పవన్ అభిమానులు ఈ చక్కని స్నేహంపై ఆసక్తికరంగా ముచ్చటించుకున్నారు. తాజాగా నాగ చైతన్య- సమంత జంట కూడా మహేష్ - నమ్రతా శిరోద్కర్ జంటకు క్రిస్మస్ బహుమతులు పంపించారు.
నమ్రత తన ఇన్ స్టాగ్రామ్ లో తాము అందుకున్న క్రిస్మస్ బహుమతి ఫోటోను పంచుకున్నారు. ఇంతకుముందు పవన్ - అన్నా పంపిన బహుమతి ఫోటోని షేర్ చేసి ఆనందం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ఈసారి కూడా క్రిస్మస్ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. క్రిస్మస్ ట్రీ ఫోటోలు బహుమతులను ప్రదర్శిస్తూ సోషల్ మీడియాల్లో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
సామ్ - చై పంపిన ఫోటోలో క్రిస్మస్ కుకీల పెట్టెతో పాటు దంపతులు చేతి రాత నోట్ కనిపిస్తోంది. బహుమతి ఫోటోతో పాటు నమ్రత తన క్రిస్మస్ చెట్టు వీడియోలు ఫోటోలను కూడా పంచుకుంది. సితార- గౌతమ్ క్రిస్మస్ చెట్టును అలంకరిస్తూ కనిపించారు. ఈరోజు మహేష్ తన అభిమానులకు వారసులు అలంకరిస్తున్న అరుదైన క్రిస్మస్ చెట్టును షేర్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.