సుకుమార్ కండీష‌న్స్ కి సామ్ గ్రీన్ సిగ్నల్!

Update: 2021-11-17 00:30 GMT
`పుష్ప` సినిమాలో స‌మంత స్పెష‌ల్ నంబ‌ర్ హాట్ టాపిక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. పెళ్లి త‌ర్వాత‌ ఐటం పాట‌లో న‌ర్తించ‌డం స‌మంత కు ఇదే తొలిసారి. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సామ్ ఇప్పుడు త‌న‌లో మ‌రో కోణాన్ని ఆవిష్కరించ‌బోతోంది. ఇప్ప‌టికే పుష్ప టీమ్ స‌మంత‌కి పెద్ద అప్లాజ్ కూడా ఇచ్చింది. పుష్ప లో ఐటం పాట‌కు ఒప్పుకోవ‌డం పుష్ప సినిమా యూనిట్ చేసుకున్న ఓ అదృష్టం గా భావిస్తున్న‌ట్లు చెప్పక‌నే చెప్పారు.  స‌మంత తీసుకుంటున్న కొటిన్న‌ర పారితోషికం సంగ‌తి అటుంచితే సామ్ ని అలా పొగిడేసే ప్ర‌య‌త్నం మాత్రం అంద‌రినీ ఆలోచ‌న‌లో పడేసింది.

ఆ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే..`పుష్ప‌`లో స‌మంత స్పెష‌ల్ పాట‌లో ఎలా క‌నిపించ‌బోతోంది? అంటూ అభిమానుల్లో ఆస‌క్తి నెల‌కొంది. డీగ్లామ‌ర‌స్ గా క‌నిపిస్తుందా? అన్న‌ది ఇప్పుడు హాట్ టాపిక్. స‌మంత ఫోటో షూట్ల‌లో...ప‌ర్స‌న‌ల్ ఫోటోలు ప‌రిశీలిస్తే త‌న‌లో గ్లామ‌ర్ ఎలివేష‌న్స్ ని హైలైట్  చేస్తుంది త‌ప్ప ఇప్ప‌టివ‌ర‌కూ ఆన్ స్క్రీన్ మ‌రీ అంత‌గా చెల‌రేగిపోయింది లేదు. ఆన్ స్క్రీన్ హ‌ద్దు మీరి రొమాన్స్ కి సామ్ ఎప్పుడూ దూర‌మే. వ్య‌క్తిగత డిస్ట్ర‌బెన్సెస్ త‌ర్వాత‌.. పుష్ప‌లో ప్ర‌త్యేక గీతానికి ఒకే చేయ‌డం అంత‌టా చ‌ర్చ‌కొస్తుంది. ఇక ద‌ర్శ‌కుడు సుకుమార్ ఐటం(స్పెష‌ల్) గాళ్స్ ని తెర‌పై ఎంత ఘాటుగా చూపిస్తారో చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ పాట కోసం బాలీవుడ్ హాట్ బ్యూటీ పేర్ల‌ను ప‌రిశీలించారు. జాక్వెలిన్ పెర్నాండేజ్.. నోరా ప‌తేహీ..దిశా ప‌టానీ పేర్లు ముందుగా తెర‌పైకి వ‌చ్చాయి. వాళ్లంద‌ర్నీ కాద‌ని స‌మంత‌ని లాక్ చేయ‌డం తో సుకుమార్ కండీష‌న్స్ కి సామ్ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన‌ట్లే అయిందని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇక పుష్ప‌లో రింగ రింగ రేంజు ఐట‌మ్ నంబ‌ర్ ఉంటుంద‌న్న గుస‌గుస తాజాగా మ‌రోమారు రివీలైంది. అయితే ఈ స్పెష‌ల్ నంబ‌ర్ లో సామ్ మ‌రీ అందాల ఆర‌బోత‌కు వెళ్లే ఛాన్స్ అయితే లేద‌ట‌. ప‌ర్ఫెక్ట్ ఫిట్ టోన్డ్ బాడీని మాత్రం ఎలివేట్ చేసేందుకు ఛాన్సుంద‌ని గుస‌గుస వినిపిస్తోంది.

టాలీవుడ్ లో స‌మంత కెరీర్ ప్ర‌స్థానం ద‌శాబ్ధం దాటింది.  ప‌దేళ్ల ప్ర‌స్థానంలో ఏనాడూ సామ్ టూమ‌చ్ వ‌ల్గ‌ర్ అనిపించేవీ.. డీ గ్లామ‌రస్ పాత్ర‌ల్ని  పోషించ‌లేదు. త‌న‌కంటూ ఓ బ్రాండ్ ని క్రియేట్ చేసుకుని మార్కెట్ లో చెలామ‌ణి అయింది. నాగ‌చైత‌న్య‌తో పెళ్లి త‌ర్వాత పాత్రల ప‌రంగా మ‌రింత  సెల‌క్టివ్ గా వెళ్లింది. ఇప్పుడు స్పెష‌ల్ నంబ‌ర్ ని బ్యాలెన్స్ చేస్తుంద‌నే భావిస్తున్నారు.
Tags:    

Similar News