సూపర్ స్టార్ తో లవ్ స్టోరీ.. దర్శకురాలి కల నెరవేరేనా?
ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో ఉండే 24 శాఖలలో పనిచేసే ప్రతి ఒక్కరూ కూడా ఒకే విభాగంలో సెటిల్ కాకుండా పలు శాఖలలో పని చేస్తూ సత్తా చాటుతున్నారు.;
ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో ఉండే 24 శాఖలలో పనిచేసే ప్రతి ఒక్కరూ కూడా ఒకే విభాగంలో సెటిల్ కాకుండా పలు శాఖలలో పని చేస్తూ సత్తా చాటుతున్నారు. ఇకపోతే సినీ ఇండస్ట్రీలో మేల్ డైరెక్టర్స్ ఎంతోమంది మంచి బ్లాక్ బస్టర్ చిత్రాలను ప్రేక్షకులు అందిస్తూ దూసుకుపోతుంటే.. తామేమి తక్కువ కాదు అంటూ ఇటు లేడీ డైరెక్టర్లు కూడా బ్లాక్ బస్టర్ చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ కథ ఓరియంటెడ్ తో మంచి విజయాలను తమ ఖాతాలో వేసుకుంటున్నారు. ఒకప్పుడు లేడీ డైరెక్టర్ అంటే దివంగత నటీమణి దర్శకురాలు విజయనిర్మల గుర్తుకొచ్చేవారు. దాదాపు 40కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆమె..గిన్నిస్ బుక్ లో స్థానం కూడా సంపాదించుకున్నారు.
ఆమె తర్వాత మళ్లీ లేడీ డైరెక్టర్స్ పెద్దగా ఇండస్ట్రీలో కనిపించలేదు. కానీ ఇప్పుడు మళ్లీ లేడీ డైరెక్టర్లు హవా కొనసాగిస్తున్నారు. అలాంటివారిలో సుధా కొంగర కూడా ఒకరు. ప్రస్తుతం ఈమె శివ కార్తికేయన్ హీరోగా, శ్రీ లీల హీరోయిన్ గా తెరకెక్కించిన చిత్రం పరాశక్తి. 2026 జనవరి 10న సంక్రాంతి సందర్భంగా విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రమోషనల్ కార్యక్రమాలు చేపట్టిన సుధా కొంగర తన మనసులో కోరికను బయటపెట్టింది.
ఆమె మాట్లాడుతూ.." నేను రజనీకాంత్ కి వీరాభిమానిని. 1985లో ముత్తల్ మరియతై సినిమా తరహాలో సూపర్ స్టార్ తో ఒక పూర్తిస్థాయి లవ్ స్టోరీని నిర్మించాలని అనుకుంటున్నాను" అంటూ రజనీకాంత్ తో సినిమా చేయడంపై స్పందించింది సుధా కొంగర. మరి స్టైలిష్ ఐకాన్ గా పేరు సొంతం చేసుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్ తన చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం సుధా కొంగరకు ఇస్తారా లేదా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. మొత్తానికైతే సుధా కొంగర సూపర్ స్టార్ట్ తో ప్యూర్ లవ్ స్టోరీ సినిమా చేయాలని ఉంది అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.
సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంది. ఈ చిత్రాన్ని డాన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. జీవి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా.. తెలుగు, తమిళ్ భాషల్లో ఒకేసారి విడుదల కాబోతోంది. ఇందులో అధర్వ, రానా దగ్గుబాటి, బాసిల్ జోసెఫ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. సుధా కొంగర విషయానికి వస్తే సూర్యతో ఆకాశమే నీ హద్దురా, వెంకటేష్ తో గురూ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు చేసి భారీ విజయాన్ని అందుకున్న ఈమె.. ఇప్పుడు పరాశక్తితో ప్రేక్షకులను అలరించబోతోంది. ఇప్పటికే వరుస విజయాలతో బిజీగా మారిన సుధా కొంగరకు రజనీకాంత్ అవకాశం ఇవ్వాలని కూడా అభిమానులు కోరుతున్నారు. మరి వీరి కలయికలో అసలు సినిమా వస్తుందా? వస్తే ఆ ప్యూర్ లవ్ స్టోరీ ఎలా ఉండబోతోంది? అనే విషయాలు కూడా ఆసక్తికరంగా మారాయి. రజనీకాంత్ విషయానికి వస్తే.. కూలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన ప్రస్తుతం జైలర్ 2 సినిమాలో నటిస్తున్నారు .