బ్యాక్ టూ బ్యాక్ ఏం చేసినా ఇప్పుడే?
ఛార్మింగ్ స్టార్ శ్రీకాంత్ తనయుడు రోషన్ `ఛాంపియన్` సినిమాతో విమర్శలకు ప్రశంసలందుకుంటున్నాడు.సినిమాలో రోషన్ లుక్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.;
ఛార్మింగ్ స్టార్ శ్రీకాంత్ తనయుడు రోషన్ `ఛాంపియన్` సినిమాతో విమర్శలకు ప్రశంసలందుకుంటున్నాడు.సినిమాలో రోషన్ లుక్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. నిజంగా రామ్ చరణ్ చెప్పినట్లు యూరోయన్ యాక్షన్ స్టార్ లా ఉన్నాడు. సినిమాకే రోషన్ లుక్ హైలైట్ గా మారింది. కానీ రోషన్ నుంచి ఇది కాదు కోరుకుంటుంది. అతడికి తగ్గ సరైన హిట్ కమర్శియల్ హిట్ పడాలి. అతడిని హీరోగా పెట్టి నిర్మాతలు 500 కోట్ల ప్రాజెక్ట్ తెరకెక్కించాలి. అది సక్సెస అయితే నిజంగా రోషన్ యూరిపోయన్ రేంజ్ యాక్షన్ స్టార్ అవుతాడు. అందులో ఎలాంటి డౌట్ లేదు.
రోషన్ ని అలా తయారు చేసే దర్శకుడు కావాలి. ఇప్పుడు అందుకు ఛాన్సు ఉంది. ఇంత వరకూ చిన్న బ్యానర్లలో పని చేసిన రోషన్ కిప్పుడు మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే సితార ఎంటర్ టైన్ మెంట్స్ రోషన్ ని హీరోగా పెట్టి ఓ సినిమా చేయడానికి రెడీ అవుతుంది. ఆ సినిమా స్టోరీ ఎలాంటింది? దర్శకుడు ఎవరు? అన్నది బయటకు రాలేదు గానీ నిర్మాత నాగవంశీ టేస్టుకు తగ్గట్టే సినిమా తీస్తాడు? అందులో ఎలాంటి డౌట్ అవసరం లేదు. ఇప్పుడున్న నిర్మాతల్లో నాగవంశీ అడ్వాన్స్డ్ గా, ఇన్నోవేటివ్ గా థింక్ చేగయల సామర్ద్యం ఉన్న నిర్మాత.
స్క్రిప్ట్ లపై కూడా మంచి అవగాహన ఉంది. అదిప్పుడు రోషన్ కి కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. అలాగే రోషన్ తో స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా ఓ సినిమా చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఛాంపియన్ సినిమా చూసిన తర్వాత అరవింద్ తీసుకున్న నిర్ణయిమిది. రోషన్ లో ట్యాలెంట్ ని గుర్తించి అతడికి సరైన కథ పడితే గ్లోబల్ స్థాయి రేంజ్ ఉన్న నటుడు అవుతాడు? అన్నది అరవింద్ మనసులో అభిప్రాయం. ఇప్పుడే ఆదిశగా రోషన్ తో ఆ తరహా అటెంప్ట్ చేయకపోయినా? భవిష్యత్ లో చేసే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతానికి మాత్రం రోషన్ సరైన కమర్శియల్ సినిమా చేసే ఆలోచనలో అరవింద్ కనిపిస్తున్నారు. రోషన్ కి ఈ రెండు ప్రాజెక్ట్ ల రూపంలో మంచి అవకాశాలు వ చ్చాయి. నటుడిగా ప్రూవ్ చేసుకోవడానికి ఇంతకు మించిన మరో అవకాశం కూడా రాదు. రోషన్ కష్టపడి ఎఫెర్ట్ పెట్టి పని చేయా లి గానీ నాగవంశీ, అరవింద్ లు అత డిలో బెస్ట్ యాక్టర్ ని బయటకు తేగలరు. డాడ్ శ్రీకాంత్ కూడా రోషన్ పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. అలాగని రోషన్ పై ఒత్తిడి లేదు.