వైవాహిక బంధానికి 15 ఏళ్లు.. బన్నీతో స్వీట్ మూమెంట్స్ షేర్ చేసిన స్నేహ రెడ్డి!

టాలీవుడ్ స్టార్ కపుల్ అల్లు అర్జున్ - స్నేహ రెడ్డి నేడు (మార్చి 6న) తమ 15వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు.;

Update: 2026-03-06 10:33 GMT

టాలీవుడ్ స్టార్ కపుల్ అల్లు అర్జున్ - స్నేహ రెడ్డి నేడు (మార్చి 6న) తమ 15వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా స్నేహ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. "15 ఏళ్ల ప్రయాణం.. మన ప్రేమతో నిండిన ప్రపంచం, ఇద్దరు పిల్లలు, స్వీట్ పప్పీస్..ఇలా ఎన్నో తీపి జ్ఞాపకాలు" అంటూ ఆమె పెట్టిన పోస్ట్ చూసి అభిమానులు మురిసిపోతున్నారు. బన్నీ దంపతులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షల పర్వం కొనసాగుతుంది..ఆ విశేషాలు చూద్దాం ..



 


15 ఏళ్ల జ్ఞాపకాలు.. స్నేహ ఎమోషనల్ నోట్:

ఈ 15వ పెళ్లిరోజు సందర్భంగా స్నేహ రెడ్డి తన ఇన్స్టాగ్రామ్ లో ఒక ఫోటోను షేర్ చేస్తూ పెట్టిన మెసేజ్ అందరి హృదయాలను హత్తుకుంటోంది. 'ప్రతి అధ్యాయంలోనూ నాకు తోడుగా ఉన్నందుకు ధన్యవాదాలు, ఎన్నో తీపి జ్ఞాపకాలు నాకు ఇచ్చావు' అంటూ బన్నీపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. ఇక అల్లు అర్జున్ కూడా స్నేహకి 'నువ్వు లేకపోతే ఈ 15 ఏళ్ళు ఇలా వుండేది కాదు' అని ఆమె పైన ప్రేమను సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. ఇక అల్లు అర్జున్ గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన ప్రయాణంలో స్నేహ ఒక పిల్లర్‌లా నిలబడ్డారు. ఈ రోజు అల్లు ఫ్యాన్స్ అందరూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అల్లు కపుల్ అంటూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. వీరి బంధం ఇలాగే కలకాలం వర్ధిల్లాలని అందరూ కోరుకుంటున్నారు.



 


తొలిచూపులోనే ప్రేమ.. పెళ్లి వరకు సాగిన ప్రయాణం:

సినిమాల్లో లవర్ బాయ్‌గా మెప్పించే అల్లు అర్జున్, నిజ జీవితంలోనూ ఒక అందమైన ప్రేమకథను నడిపారు. అమెరికాలో చదువు ముగించుకుని వచ్చిన స్నేహను ఒక స్నేహితుడి పెళ్లిలో చూసిన బన్నీ, తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడ్డారు. వీరిద్దరి మనసులు కలిసినా, మొదట్లో పెద్దలు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. కానీ "ఒకరిని విడిచి మరొకరం ఉండలేము" అని వారు గట్టిగా నిలబడటంతో, చివరికి పెద్దలు పచ్చజెండా ఊపారు. అలా 2011 మార్చి 6న వీరిద్దరూ వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు.



 


అన్యోన్య దాంపత్యం.. అయాన్, అర్హలతో సందడి:

బన్నీ, స్నేహల బంధం రోజురోజుకూ మరింత బలపడుతూ వస్తోంది. వీరికి 2014లో కుమారుడు అయాన్, 2016లో కుమార్తె అర్హ జన్మించారు. అల్లు అర్జున్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, తన ఫ్యామిలీకి ఇచ్చే ప్రాధాన్యత అందరినీ ఆకట్టుకుంటుంది. షూటింగ్స్ నుండి ఏ కొంచెం విరామం దొరికినా విదేశాలకు వెకేషన్స్ ప్లాన్ చేయడం లేదా ఇంట్లోనే పిల్లలతో సరదాగా గడపడం బన్నీకి అలవాటు. అందుకే వీరిని టాలీవుడ్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ క్యూటెస్ట్ కపుల్‌గా ఫ్యాన్స్ అభివర్ణిస్తుంటారు.



 


Tags:    

Similar News