వ్యాపారంలా భావిస్తే అంతే సంగతులు!
అయితే రెగ్యులర్ నిర్మాణ సంస్థలతో పొలిస్తే కార్పోరేట్ నిర్మాణ సంస్థల సక్సస్ రేట్ అత్యంత దారుణంగా ఉందన్నది కాదనలేని నిజం.;
గత కొంత కాలంగా సినిమా ఇండస్ట్రీలో కార్పోరేట్ కంపెనీల వెల్లువ కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. ఇబ్బడి ముబ్బడిగా కార్పోరేట్ కంపెనీలు సినిమా నిర్మాణం వైపు వస్తున్నాయి. లాభనష్టాలతో పని లేకుండా సినిమాలు నిర్మిస్తున్నాయి. ఈరోస్, రిలయన్స్, డిస్నీ, యూటీవీ, వయోకామ్, పీవీపీ , పీపూల్ మీడియా ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్ ఇలా ఎన్నో కార్పోరేట్ కంపెనీలు తెలుగు సినిమా నిర్మాణంలో భాగమవుతున్నాయి. అయితే రెగ్యులర్ నిర్మాణ సంస్థలతో పొలిస్తే కార్పోరేట్ నిర్మాణ సంస్థల సక్సస్ రేట్ అత్యంత దారుణంగా ఉందన్నది కాదనలేని నిజం.
వెరసి కార్పోరేట్ సంస్థలు అంతే వేగంగా నిర్మాణం నుంచి వైదొలుగుతున్నాయి. మరి ఇలా ఎందుకు జరుగుతుంది? అంటే ఎన్నో కారణాలు తెరపైకి వస్తున్నాయి. గత కొంత కాలంగా ఈరోస్, రిలయన్స్, లైకా ప్రొడక్షన్స్ తీవ్ర నష్టాల్లో ఉన్నాయి. ఆ సంస్థలు ఏ సినిమా నిర్మించినా నష్టం తప్ప రూపాయి లాభం చూడటం లేదు. మరి ఇలా ఎందుకు జరుగుతుంది? అంటే సినిమాను వాళ్లంతా కేవలం వ్యాపారంలా మాత్రమే భావిస్తున్నారు. ఫ్యాషన్ తో ఎంత మాత్రం సినిమా నిర్మించడం లేదు. ఈ మద్య కాలంలో ఆ సంస్థల నుంచి రిలీజ్ అయిన సినిమాలను నిశితంగా పరిశీలిస్తే స్టోరీల పరంగా ఎంత బలహీనంగా ఉన్నాయి? అన్నది అద్దం పడుతుంది.
కార్పొరేట్ కంపెనీలు ప్రతిదాన్ని బిజినెస్ మోడల్ లో చూస్తాయి. కానీ సినిమా అనేది ఒక ఎమోషన్. ఒక సీన్ బాగుందా లేదా అనేది కార్పొరేట్లు డేటా ప్రకారం చూస్తారు. కానీ ప్రేక్షకుడు మనసుతో చూస్తాడు. క్రియేటివిటీకి, లెక్కలకు మధ్య సమతుల్యత లేకపోవడం వల్ల చాలా ప్రాజెక్టులు విఫలమవుతున్నాయి. ఒక ప్రైవేట్ నిర్మాత అయితే, షూటింగ్ స్పాట్‌లో ఏదైనా మార్పు కావాలంటే వెంటనే నిర్ణయం తీసుకుంటారు. కార్పొరేట్ కంపెనీలలో ఒక చిన్న మార్పు చేయాలన్నా బాంబే లేదా విదేశాల్లో ఉన్న బోర్డ్ మెంబర్స్ పర్మిషన్ తీసుకోవాలి.
ఈ ప్రాసెస్ వల్ల షూటింగ్ లేట్ అవ్వడం, బడ్జెట్ పెరిగిపోవడం జరుగుతుంది. తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు ఎక్కువగా హీరోల ఇమేజ్ మీద నడుస్తాయి. ఇక్కడ వ్యక్తిగత బంధాలు, నమ్మకం ముఖ్యం. కార్పొరేట్ సంస్థలు కేవలం కాంట్రాక్టులు, లీగల్ నోటీసుల మీద ఆధారపడతాయి. మన హీరోలు లేదా దర్శకులు ఒక వ్యక్తిగత నిర్మాతకు ఇచ్చే వెసులుబాటును, కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వకపోవచ్చు. కార్పొరేట్ మేనేజర్లు ఎక్కువగా ఏసీ రూముల్లో కూర్చుని మార్కెటింగ్ ప్లాన్ చేస్తారు. బి సెంటర్, సి సెంటర్ ప్రేక్షకుడి పల్స్ పట్టుకోవడంలో వారు విఫలమవుతున్నారు.
స్థానిక పంపిణీదారులు, ఎగ్జిబిటర్లతో వారికి ఉండే సంబంధాలు చాలా పరిమితం. కార్పొరేట్ కంపెనీలు వస్తున్నాయని తెలియగానే హీరోలు, దర్శకులు రెమ్యునరేషన్లను భారీగా పెంచేస్తారు. సినిమా బడ్జెట్‌లో డబ్బైశాతం కేవలం రెమ్యునరేషన్లకే పోవడం వల్ల, క్వాలిటీ తగ్గుతోంది. ఫలితంగా సినిమా ఫ్లాప్ అయితే భారీ నష్టాలు తప్పడం లేదు. కేవీఎన్ ప్రొడక్షన్స్ ఇంత వరకూ `జన నాయగన్` సినిమాను రిలీజ్ చేసుకోలేకపోయింది. బ్యాకెండ్ లో రకరకాల కారాణాలున్నాయి. వాటిని పరిష్కరించుకోవడంలో కేవీఎన్ విఫలమవుతుందనే ఆరోపణ కూడా ఉంది.
రీసెంట్ గా `టాక్సిక్` కూడా విడుదల వాయిదా వేసిన సంగతి తెలిసిందే. `కె.డీ ది డెవిల్` షూటింగ్ లోనూ జాప్యం కనిపిస్తుంది. పీవీపీ సంస్థ అయితే మునుపటిలా సినిమాలు నిర్మించలేదు. పీపూల్ మీడియా ఫ్యాక్టరీ కూడా వరుస వైఫల్యాల్లో ఉంది. పీపూల్ మీడియా ఫ్యాక్టరీ సొంత నిర్ణయాలు తీసుకోలేక ఇతర సహ నిర్మాతల మీద ఆధార పడుతుంది. గీతా ఆర్స్ట్, సితారా ఎంటర్ టైన్ మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్ సహా ఇండస్ట్రీలో రెగ్యులర్ గా ఉండే వారంతా ఎంతో ఫ్యాషన్ తో సినిమాలు నిర్మిస్తారు. ఓ సినిమా ఫెయిలైనా ఆ నష్టాలను మరో సినిమా ఫలితంతో రికవరీ చేస్తారు. ఆ టెక్నిక్ కార్పోరేట్ కంపెనీలకు తెలియదు.