చైతూ 'వృషకర్మ'.. సుకుమార్ ఏమన్నారంటే?
టాలీవుడ్ యువ సామ్రాట్ నాగ చైతన్య, యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరీ లీడ్ రోల్స్ లో రూపొందుతున్న మూవీ వృషకర్మపై ఇప్పటికే సినీప్రియులతోపాటు అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.;
టాలీవుడ్ యువ సామ్రాట్ నాగ చైతన్య, యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరీ లీడ్ రోల్స్ లో రూపొందుతున్న మూవీ వృషకర్మపై ఇప్పటికే సినీప్రియులతోపాటు అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. సినిమా ప్రకటించినప్పటి నుంచే ప్రేక్షకుల్లో పాజిటివ్ క్రియేట్ అయింది. రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన గ్లింప్స్ ఆ అంచనాలను మరింత పెంచిందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.
వృషకర్మ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్రతో పాటు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై నిర్మాతలు బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యంగ్ డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు సినిమాను తెరకెక్కిస్తున్నారు. కథ, కాన్సెప్ట్ పరంగా కూడా వృషకర్మ మూవీ స్పెషల్ గా ఉండబోతుందని ఇప్పటికే ప్రచారం సాగుతోంది.
అయితే ఇటీవల విడుదలైన గ్లింప్స్ ను చూస్తే.. సినిమా హారర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తోపాటు సోషియో ఫాంటసీ అంశాలతో రూపొందుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. విజువల్స్, టెక్నికల్ క్వాలిటీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. అన్నీ కలిసి ఒక విభిన్నమైన అనుభూతిని అందించేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మిస్టరీ, థ్రిల్ తో కూడిన సన్నివేశాలు ప్రేక్షకుల ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.
ఇక గ్లింప్స్ విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుండగా.. తాజాగా సుకుమార్ స్పందించారు. వీడియో మెసేజ్ లో ఆయన సినిమాపై తన అభిప్రాయాలను వెల్లడించారు. దర్శకుడు కార్తీక్ వర్మ దండు కథ వినిపించినప్పుడు తాను ఎంతో ఆశ్చర్యపోయానని సుకుమార్ తెలిపారు. కథ మొదట వినగానే బాగా నచ్చడంతో నిర్మాతగా ఉండాలని వెంటనే నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
"కార్తీక్ కథ చెప్పినప్పుడు చాలా బాగా అనిపించింది. అప్పుడే సినిమాకు నిర్మాతగా ఉండాలని ఫిక్స్ అయ్యాను. ఇండస్ట్రీకి మంచి టెక్నీషియన్ దొరికాడని చెప్పాలి" అని సుకుమార్ పేర్కొన్నారు. సినిమా విజువల్స్ అద్భుతంగా వచ్చాయని ఆయన చెప్పారు. "కథ వినిపించినప్పుడు విజువల్స్ ఇంత బాగా వస్తాయని నేను ఊహించలేదు. కానీ సినిమా చాలా అద్భుతంగా తెరకెక్కింది" అని సుకుమార్ అన్నారు.
సంగీత దర్శకుడు అజనీష్ లోక్ నాథ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు బలంగా నిలిచిందని సుకుమార్ తెలిపారు. డీవోపీగా పనిచేసిన రగుల్ వచ్చాక మూవీ క్వాలిటీ మరింత పెరిగిందని అన్నారు. ఇక హీరో నాగచైతన్య గురించి మాట్లాడిన సుకుమార్, ఆయన మొదటి నుంచే అన్ని విభాగాల్లోనూ ఆయన పాల్గొని అవుట్ పుట్ మెరుగ్గా రావడానికి సహకరించారని చెప్పారు. సినిమా అవుట్ పుట్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నామని, మూవీని కచ్చితంగా ఎంజాయ్ చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.