• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కొత్త దారి పట్టిన సమంతా

కొత్త దారి పట్టిన సమంతా

By - Tupaki Desk
Update: 2019-08-12 06:39 GMT
పెళ్లి చేసుకున్నాక విభిన్న పాత్రల వైపు మొగ్గుచూపిస్తున్న సమంతా ఈ ఏడాది ఇప్పటికే రెండు సూపర్ హిట్స్ ని ఖాతాలో వేసుకుంది . మజిలి సక్సెస్ ని భర్త నాగ చైతన్యతో కలిసి షేర్ చేసుకోగా ఓ బేబీ మాత్రం సోలోగా తన ఎకౌంటులో పడిపోయింది. చిన్న క్యామియో చేసిన మావయ్య సినిమా మన్మధుడు 2  దెబ్బెసినా దాని ప్రభావం తన మీద పడలేదు. ప్రస్తుతం శర్వానంద్ తో 96 రీమేక్ కు కమిట్ అయిన సామ్ త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది.

కానీ శర్వాకు ఆ మధ్య కాస్త గాయం కావడంతో బ్రేక్ వస్తుందేమో అని ఊహించి ఆ కాల్ షీట్స్ ని ఓ వెబ్ సిరీస్ కు ఇచ్చేసింది. ఇప్పుడు దాని తాలూకు షూట్ లోనే చెన్నైలో బిజీగా ఉంది సామ్. 40కి పైగా కాల్ షీట్స్ ఇచ్చిందంటే ఇది ఖచ్చితంగా పెద్ద సీజన్ అయ్యుంటుంది. అమెజాన్ ప్రైమ్ దీనికి నిర్మాత. ఎలాగూ వెబ్ సిరీస్ ల ట్రెండ్ ఊపందుకుంటోంది. హిందీలో ఇప్పటికే వీటి క్రేజ్ ఇంచుమించు సినిమాల స్థాయిలో ఉంది.

సౌత్ లో వీటి మీద అవగాహన తక్కువ కాబట్టి ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నారు. సమంతా లాంటి స్టార్స్ చేస్తే అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులూ వీటి మీద ఓ లుక్ వేస్తారు. అందులోనూ మేకింగ్ విషయంలోనూ నిర్మాతలు రాజీ పడటం లేదు. మెసేజ్ ఓరియెంటెడ్ ప్రధానంగా రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ లో సమంతా రోల్ ఏంటి  దర్శకుడు ఎవరు లాంటి డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. మొత్తానికి అందరికంటే ముందే సమంతా వెబ్ సిరీస్ లవైపు కన్నేసి తెలివైన పనే చేస్తోంది

   

Tags:    
  • Samantha 
  • Web Series 
  • Telugu News 
  • Latest Updates 

Similar News

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

Copyright @2026

Powered by Blink CMS